
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం సంభవించింది. ఓపీలో డెర్మటాలజీ విభాగంలో.. విధులు నిర్వర్తిస్తున్నడాక్టర్ భువనశ్రీపై ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ క్రమంలో భువనశ్రీ తలకి తీవ్ర గాయమైంది.
తోటి డాక్టరు వెంటనే ఆమెకు కట్లు కట్టారు. ప్రస్తుతం డాక్టర్ భువనశ్రీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పెషేంట్‌లు, డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’
Comments
Please login to add a commentAdd a comment