సాక్షి, హైదరాబాద్ : జీతాలు ఇవ్వడం లేదంటూ ఉస్మానియా ఆసుపత్రిలో నర్సులు చేపట్టిన దర్నా మూడో రోజుకు చేరుకుంది. నాలుగు నెలలుగా జీతం ఇవ్వడం లేదంటూ 87 మంది స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించారు. దీంతో గత మూడు రోజులుగా 12 ముఖ్య విభాగాల్లో సేవలు కుంటుపడ్డాయి. అవుట్‌సోర్సింగ్ కింద నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరినా ఇప్పటివరకు దీనికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తక్షణమే అవుట్‌సోర్సింగ్ లెటర్‌తో పాటు, ఐడీ కార్డు, రెండు నెలల జీతం ఇస్తేనే విదులకు హాజరవుతామని డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళనలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ, ఐసోలేషన్ వార్డులు, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో రోగులు తీద్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment