out soursing
-
పంచాయతీ సెక్రటరీలకూ బదిలీల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ మలుపులు తిరుగుతోంది. కొన్ని జిల్లాల్లో పనిచేస్తున్న కార్యదర్శులకు ఒకలా, మరికొన్ని జిల్లాల్లో ఇంకోలా కేటాయింపులు, పోస్టింగ్‌లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు పోస్టింగుల వల్ల కుటుంబాలకు దూరమై వ్యయ, దూరభారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. మే, జూన్‌ల్లో సాధారణ బదిలీలు చేసే దాకా పాత స్థానాల్లోనే డిప్యూటేషన్‌పై కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్నిజిల్లాల్లో ఔట్సోర్సింగ్ కార్యదర్శుల ఔట్ ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ల్లోని పలువురు పంచాయతీ సెక్రటరీలను సాధారణ బదిలీలు జరిగే దాకా పాత జిల్లాల్లోనే డిప్యూటేషన్‌పై పనిచేసేలా తాజాగా ఉత్తర్వులిచ్చారు. అయితే ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పలువురిని నిజామాబాద్, తదితర జిల్లాలకు బదిలీ చేయడంతో కుటుంబాలకు దూరంగా తాము ఇబ్బందిపడుతున్నామని వారు వాపోతున్నారు. మరోవైపు దాదాపు ఏడాది కిందట వివిధ జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 800 మంది వరకు గ్రామ పంచాయతీ సెక్రటరీలను నియమించగా వీళ్లలో నిజామాబాద్ జిల్లాలో70 మంది, నిర్మల్ జిల్లాలో 40 మందిని తాజాగా తొలగించారు. ప్రస్తుత బదిలీలు, కేటాయింపుల్లో భాగంగా వీళ్లు పనిచేస్తున్న పంచాయతీల్లో పలువురు గ్రేడ్–1, 2, 3 సెక్రటరీలను నియమించినట్లు తెలుస్తోంది. గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–1 గ్రామాలకు కాకుండా ఔట్ సోర్సింగ్ సెక్రటరీలు పనిచేస్తున్న గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఉస్మానియాలో 3వ రోజు కొనసాగుతున్న నర్సుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : జీతాలు ఇవ్వడం లేదంటూ ఉస్మానియా ఆసుపత్రిలో నర్సులు చేపట్టిన దర్నా మూడో రోజుకు చేరుకుంది. నాలుగు నెలలుగా జీతం ఇవ్వడం లేదంటూ 87 మంది స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించారు. దీంతో గత మూడు రోజులుగా 12 ముఖ్య విభాగాల్లో సేవలు కుంటుపడ్డాయి. అవుట్సోర్సింగ్ కింద నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరినా ఇప్పటివరకు దీనికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తక్షణమే అవుట్సోర్సింగ్ లెటర్‌తో పాటు, ఐడీ కార్డు, రెండు నెలల జీతం ఇస్తేనే విదులకు హాజరవుతామని డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళనలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ, ఐసోలేషన్ వార్డులు, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో రోగులు తీద్ర ఇబ్బందులు పడుతున్నారు. -
వివక్షకు తావులేదు: సీఎం జగన్
‘ఆప్కాస్’ ద్వారా ఇప్పుడు ఒకేసారి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తున్నాం. ఇది ఒక డైనమిక్ నంబర్. ప్రతి నెలా ఈ నంబర్ మారిపోతుంది. రాబోయే రోజుల్లో అన్ని శాఖలు కార్పొరేషన్‌తో అనుసంధానమవుతాయి. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ‘ఆప్కాస్’తో వివక్ష లేకుండా ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగులకు ఠంచనుగా ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా జీతాలు వస్తాయి. వాటిలో కమీషన్లు, లంచాలు, కోతలు ఉండవు. పద్ధతి ప్రకారం జీతాలు ఇస్తారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ క్రమం తప్పకుండా జమ చేయడం ద్వారా ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఈ రోజు ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) ప్రారంభం కావడం అన్నది నిజంగా వ్యవస్థల్లో మార్పు దిశగా మరో అడుగు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో ఎక్కడా వివక్షకు తావుండకూడదు. 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వాలి. వాటన్నింటిలో 50 శాతం మహిళలు ఉండాలి. దళారులు, ప్లేస్మెంట్ ఏజెంట్ల వ్యవస్థ, కమీషన్లకు తావు లేకుండా చేసేందుకే ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచనుగా ఏ కోత లేకుండా గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడంతో పాటు, లంచాల ప్రసక్తి లేకుండా పారదర్శకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొండంత అండగా నిలుస్తూ ఏర్పాటు చేసిన ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) కార్యకలాపాలను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఒకేసారి 50 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించేందుకు కంప్యూటర్లో బటన్ నొక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం వివిధ జిల్లాల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగినికి నియామక పత్రం అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ విన్నాను.. చూశాను.. ► నా సుదీర్ఘ పాదయాత్రలో అన్ని ప్రాంతాలు తిరిగాను. 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు నడిచాను. అప్పుడు ప్రతి చోట ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు విన్నాను.. చూశాను. ‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతోంది’ అని ఒక్కచోట కూడా ఎవరూ చెప్పలేదు. ► మాకు కాంట్రాక్ట్‌లో ఒక జీతం చూపి, అంతకంటే తక్కువ జీతం ఇస్తున్నారని, కాంట్రాక్టర్ మా జీతం కట్ చేస్తున్నారని కొంత మంది చెప్పారు. ‘అన్నా.. ఈ ఉద్యోగం రావడానికి లంచాలివ్వాలి. మళ్లీ జీతాలు తీసుకోవడానికి కూడా లంచాలివ్వాలి.. ఇవి రెండూ ఇవ్వకపోతే మమ్నల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు’ అని మరికొంత మంది ప్రతి జిల్లాలో చెప్పారు. ► ఔట్ సోర్సింగ్‌లో కొందరికి మేలు చేయడం కోసం కాంట్రాక్టర్లను తీసుకువచ్చారు. నాడు కొన్ని చోట్ల నాయకులు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లుగా మారారు. ఆలయాల్లో పారిశుధ్య కాంట్రాక్ట్ పనుల మొత్తాన్ని అమాంతంగా పెంచి చంద్రబాబు బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకే.. ► అందుకే ఈ వ్యవస్థను పూర్తిగా మార్చి, పారదర్శకత తేవాలనుకున్నా. అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలని, ఎవరికీ లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండాలని భావించి ‘ఆప్కాస్’ ఏర్పాటు చేశాం. ► ఈ కార్పొరేషన్లో రెండు కేంద్రాలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా జేసీలతో కూడిన కమిటీలు పని చేస్తాయి. జిల్లా ఇన్చార్జ్ మంత్రులు రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తారు. దీంతో ఎక్కడా అవినీతికి తావుండదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది బాగా పని చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పని చేయాలి. గతంలో ఎక్కువ చూపి కొట్టేసే వారు ► గతంలో కాంట్రాక్ట్ సంస్థలు ఉద్యోగుల సంఖ్యను ఎక్కువ చూపి, తక్కువ సంఖ్యలో నియమించి వారితో పని చేయించుకునేవి. 20 మంది పని చేయాల్సి ఉండగా 15 మందినే నియమించి మిగతా ఐదుగురి వేతనాలను ఆ కాంట్రాక్టర్లు, ఇతర నేతలు పంచుకునేవారు. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా వాటన్నింటికీ తావుండదు. ► కార్పొరేషన్‌ను సక్సెస్ చేయడం కోసం కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా అంతా మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నా. ► సాధారణ పరిపాలన శాఖకు చెందిన ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ నియామక పత్రాలను అందించారు. జిల్లాల్లో కలెక్టర్లు, మంత్రులు నియామక పత్రాలు అందించాలని సీఎం సూచించారు. ► ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్నితో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీవితాంతం రుణపడి ఉంటాం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ ప్రారంభించిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. గతంలో మా జీతం నెలలో ఏ రోజు తీసుకుంటామో తెలియని పరిస్థితి ఉండేది. ఈపీఎఫ్, ఈఎస్ఐ పరిస్థితే తెలిసేది కాదు. ఒకే డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఉద్యోగులకు రకరకాలుగా జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆప్కాస్ ద్వారా మధ్యవర్తిత్వం, దళారీ వ్యవస్థను నిర్మూలించినందుకు సంతోషంగా ఉంది. కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం. – జె.సూరిబాబు, టైపిస్ట్, కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీస్, తూర్పు గోదావరి జిల్లా మీకు మంచి పేరు తెస్తాం ‘ఇచ్చిన మాట మేరకు మాకు న్యాయం చేశారు.. మేము బాగా పని చేసి మీకు మంచి పేరు తీసుకువస్తాం.. దళారుల ప్రమేయం లేకుండా మాకు జీతాలు అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.. జీవితాంతం మీకు రుణ పడి ఉంటాం’ అని శుక్రవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సీఎం జగన్‌తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మాట నిలుపుకున్నారు.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా నెల నెలా జీతాలు అందనుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. ఎన్నో కష్టాలు పడ్డాము. నెలనెలా జీతం రాక, కాంట్రాక్టర్ మారుతున్నప్పుడల్లా ఈ ఉద్యోగం ఉంటుందో, ఉండదోనని భయపడ్డాము. ఆనాడు పాదయాత్రలో మిమ్మల్ని కలిశాను. ఇచ్చిన మాట మేరకు మాకు న్యాయం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. – లక్ష్మీకాంతం, జూనియర్ అసిస్టెంట్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ, శ్రీకాకుళం జిల్లా ఇక కష్టాలు తప్పినట్లే.. మీరు మా కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా ఒకటో తేదీనే జీతాలు వస్తాయని తెలిసి ఎంతో సంతోష పడుతున్నాం. మా వంతుగా మేం కూడా సక్రమంగా పనిచేసి, మీకు మంచి పేరు తీసుకువస్తాం. నేను 2007 నుంచి ఔట్ సోర్సింగ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. సకాలంలో జీతాలు రాక, నెల నెలా పిల్లల ఫీజులు కట్టుకోలేక, నిత్యావసరాలు కూడా కొనుగోలు చేయలేక, అప్పులు చేసుకుంటూ ఇల్లు గడుపుకునేవాళ్లం. ఇక అలాంటి కష్టాలు తప్పినట్లేనని తెలిసి సంతోషిస్తున్నాం. – మేరి సుచిత్ర, డేటా ఎంట్రీ ఆపరేటర్, పామిడి తహసీల్దార్ ఆఫీస్, అనంతపురం జిల్లా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం పండగ చేసుకున్నారు. తమ జీవితాలకు భరోసా కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యాలయాల్లో ఉద్యోగులు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. కేక్‌లు కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. చరిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా పొరుగు సేవల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయమని ఔట్ సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాప్తాడు దయాకర్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వైవీ రావులు అభినందించారు. ఇందుకు వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఒకేసారి 50 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేయడం ద్వారా వారి జీవితాలకు ఒక భరోసా కలిగిందన్నారు. తద్వారా దళారులు లేని వ్యవస్థ ఏర్పాటైందని, ఈ ఉద్యోగులకు కూడా పెరుగుతున్న ధరల సూచికకు అనుగుణంగా డీఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక హామీని నెరవేర్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’ (ఆప్కాస్)కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఓ సంస్థను ఏర్పాటు చేయాలని భావించిన సీఎం దానికి అనుగుణంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆప్కాన్ ప్రారంభం సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందిన పలువురితో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ముచ్చటించారు. (ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘పాదయాత్ర సమయంలో ఎంతో మంది కాంట్రాక్టు ఉద్యోగులు నా వద్దకు వచ్చి వారి బాధలను పంచుకున్నారు. ఇస్తామన్న జీతాలు ఇవ్వకుండా కోతలు విధించారని విలపించారు. ఉద్యోగాలు రావడానికి, జీతాలు ఇవ్వడానికీ లంచం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఇదే మాట వినిపించేంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చెందిన సమీప బంధువు భాస్కర్ నాయుడు టీడీపీ హయాంలో అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం చేశారు. గత ప్రభుత్వం వారిని నిలువునా దోచుకుంది. దీనిని రూపుమాపాలని ఆప్కాస్‌ను రూపొందించాం. అలాగే మహిళలకూ 50 శాతం ఉద్యోగాలు దక్కే విధంగా దీనిని అమలు చేస్తాం. కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్‌కు చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. దీంతో ఎక్కడా కూడా అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉండదు. జీతాలు, ఉద్యోగాల్లో ఎక్కడా చేతివాటాలకు అస్కారం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉంటుంది. ప్రతి ఒకనెలా 1వ తేదీనే జీతం చెల్లిస్తాం. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి విధానాలు కచ్చితంగా పాటిస్తాం. ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా జీతాలు వారి చేతుల్లోకే వస్తాయి. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతాం. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌లో 20 మంది పనిచేయాలని ఉంటే 15 మందితో పనిచేయించి.. మిగిలిన వారి జీతాలను కాంట్రాక్టర్లే తీసుకునేవారు. ఇకపై సిఫారసులు, దళారీలకు చోటు లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తాం’ అని అన్నారు. ఇక ఆప్కాస్‌పై కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తీవ్ర దోపిడీకి గురయ్యామని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ భద్రతపై నమ్మకం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. -
సమాన పనికి సమాన వేతనం
సాక్షి, ఏలూరు (టూటౌన్): కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతో కాలంగా తమ సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. రెగ్యులరైజ్ చేయటం కుదరకపోతే కనీసం సమాన పనికి సమాన వేతనం అందించాలంటూ అలుపెరుగకుండా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని పాలకులు అమలు చేయడం లేదు. దీంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది చాలీ చాలని జీతాలతోనే తమ జీవితాలను వెళ్లదీస్తున్నారు. గొర్రెకు బెత్తుడే తోక అన్న చందంగా వీరు ఎంత పనిచేసినా వచ్చేది మాత్రం నామమాత్రపు వేతనమే. చేసేది ప్రభుత్వ శాఖల్లో కాబట్టి ఎప్పటికైనా పాలకులకు తమపై కరుణ కలుగకపోతుందా.. సర్వీస్ రెగ్యులరైజ్ చేయకపోతారా.. వేతనాలు పెంచక పోతారా.. అనే ఆశతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ బతుకు బండి ఈడుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 14,000 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కాంట్రాక్టు సిబ్బంది పనిచేయని ప్రభుత్వ శాఖ, సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు. జగన్ హామీపై హర్షం.. సోమవారం ఆదోని సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీ జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. సుప్రీం కో ర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామంటూ జగన్ ప్రకటించడం పట్ల వీరిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. తమ బాధలను ఆయనైనా అర్థం చేసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తున్న వేతనంలో కనీసం సగం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రతా కరువే కాంట్రాక్టు ఉద్యోగానికి భద్రతా కరువే. ఏటా రెన్యూవల్ తప్పనిసరి. ప్రశ్నించే అధికారం లేదు. పని ఎక్కువ వేతనం తక్కువ. వ్యవసాయ శాఖ డిప్లొమా చేసిన మాకు రోజు వారీ కూలీలకు వచ్చేంత కూడా వేతనం లేదు. వ్యవసాయ శాఖలో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఏటా రెన్యూవల్ కోసం పోరాటం తప్పడం లేదు. –పి.ఆదినారాయణ, జిల్లా అధ్యక్షులు, కాంట్రాక్టు ఎంపీఈఓలు సంఘం 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎదుగూ బొదుగూ లేదు 20 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలుగా కొనసాగుతున్నా. ఉద్యోగం రెగ్యులర్ చేయరు. జీతాలు పెంచరు. పనిభారం పెరిగింది. జిఓల పేరుతో గతంలో ఇచ్చిన జీతం కన్నా రూ.వెయ్యి తక్కువ ఇస్తున్నారు. రూ.11,000 వేతనంతో నగరంలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. – మేళ్ల వెంకటేశ్వరమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు, ఏలూరు అమలు కాని సుప్రీం కోర్టు అదేశాలు కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను పాలకులు అమలు చేయడం లేదు. దీంతో నెలంతా కష్టపడినా వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకురావాల్సిన దుస్థితి. దీనిపై మేమ ఎన్నో సార్లు ఉద్యమాలు చేసినా పాలకులు చలించలేదు. – కామన సంజయ్, జిల్లా అధ్యక్షుడు, విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ -
గురుకులాల్లో 4,322 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి కొత్త కొలువులు మంజూరయ్యాయి. వచ్చే ఏడాది ఈ సొసైటీ ద్వారా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి ఆదేశాలిచ్చింది. మొత్తం 4,322 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో గురుకుల పాఠశాలలకు సంబంధించి 4,284... మరో 38 బీసీ గురుకుల సొసైటీకి కేటాయించింది. ఈ పోస్టులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్లపాటు విడతల వారీగా భర్తీ చేసుకునేలా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలు, సొసైటీకి మంజూరు చేసిన పోస్టుల్లో 3,717 పోస్టులు మాత్రమే రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగతా 605 పోస్టులను అవుట్ సోర్సింగ్‌లోనే నియమించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వచ్చే ఏడాది 2,537 పోస్టులు... గురుకుల సొసైటీ, గురుకుల పాఠశాలలకు మంజూరు చేసిన 4,322 పోస్టుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,537 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020–21లో 833 పీజీటీ పోస్టులు, 2021–22లో 119 ఫిజికల్ డైరెక్టర్లు, 2022–23లో 833 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. బీసీ గురుకుల సొసైటీకి మంజూరైన పోస్టులు రెగ్యులర్... కేటగిరీ పోస్టులు డిప్యూటీ సెక్రటరీ 1 అసిస్టెంట్ సెక్రటరీ 2 రీజినల్ కో–ఆర్డినేటర్లు 10 సూపరింటెండెంట్లు 2 సీనియర్ అసిస్టెంట్లు 8 జూనియర్ అసిస్టెంట్లు 5 అవుట్సోర్సింగ్.. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ 2 డాటా ఎంట్రీ ఆపరేటర్ 4 ఆఫీస్ సబార్డినేట్ 4 బీసీ గురుకులాల్లో కేటగిరీల వారీగా మంజూరైన పోస్టులు రెగ్యులర్... కేటగిరీ పోస్టులు ప్రిన్సిపాల్ 119 జూనియర్ లెక్చరర్ 833 పీజీటీ 833 టీజీటీ 1,071 ఫిజికల్ డైరెక్టర్ 119 పీఈటీ 119 లైబ్రేరియన్ 119 క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్ 119 స్టాఫ్ నర్స్ 119 సీనియర్ అసిస్టెంట్ 119 జూనియర్ అసిస్టెంట్(టైపిస్ట్) 119 అవుట్సోర్సింగ్... ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు 238 ల్యాబ్ అటెండర్లు 238 ఆఫీస్ సబార్డినేట్లు 119 -
పంచాయతీ కార్యదర్శులు ‘అవుట్’
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు భర్తీ అవుట్ సోర్సింగ్ పద్ధతితో భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇటీవల పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారాలోకేష్ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. గ్రామానికి ఒక కార్యదర్శి నియమించే ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోచుకోక.. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ పడుతుందా? ఎలాగోలా కష్టపడి ఉద్యోగం సాధిద్దామా? అనే నిరుద్యోగుల ఆశలకు ప్రభు త్వ నిర్ణయం ప్రతిబంధకంగా పరిణమించనుంది. జిల్లాలో 970 పంచాయతీలున్నాయి. వీటిని పాలనా సౌలభ్యం నిమిత్తం వీటిని 487 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్‌కు ఒకరు చొప్పున కార్యదర్శిని నియమించాల్సి ఉండగా.. గతంలో ప్రభుత్వం 360 ఉద్యోగాలు భర్తీ చేసింది. కార్యదర్శుల కొరత నేపథ్యంలో ఒక్కో కార్యదర్శి తనకు కేటాయించిన క్లస్టర్‌కు రెగ్యులర్‌గానూ.. మరో క్లస్టర్‌కు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 342 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. క్లస్టర్‌కు ఒకరు చొప్పున నియామకం చేపట్టినా జిల్లాకు ఇంకా 145 మంది అవసరం. కానీ ఇంత వరకూ ఎంపిక చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో గ్రామకార్యదర్శుల కొరత వేధిస్తుండటంతో పాలనలో ఇబ్బందులు నెలకొన్నాయి. మరోవైపు నాలుగైదు మైనర్ పంచాయతీలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి వాటికి కార్యదర్శిని నియమించారు. తద్వారా పనిభారం పెరగడంతోపాటు కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి ప్రస్తుతం పాలనా సౌలభ్యం నిమిత్తం ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శిని నియమించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లావ్యాప్తంగా 628 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఎన్నిక ప్రక్రియ అవుట్ సోర్సింగ్ ద్వారా చేపట్టనున్నారు. త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. నెలాఖరుకు స్పష్టత ఉద్యోగాల భర్తీ విషయంలో నెలాఖరుకు స్పష్టత రానుంది. పంచాయతీ కార్యదర్శికి కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్ణయించారు. రాత పరీక్షలో మెరిట్సాధించిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టుల భర్తీకి జిల్లా స్థాయిలో ఐదుగురితో ఒక సెలక్షన్ కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, రెవెన్యూ, మరో శాఖ అధికారిని సభ్యులుగా నియమించనున్నారు. అభ్యర్థుల ఎంపికలో కమిటీతే తుది నిర్ణయం. నిరుద్యోగుల్లో ఆందోళన ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ అటుంచితే నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఉద్యోగం ఒప్పంద ప్రాతిపదిక నిర్వహించడంతో తాము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న నిరీక్షణకు తెర పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఉద్యోగం అవుట్ సోర్సింగ్‌లో చేపడితే ఇక.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడోస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈవోపీఆర్డీ, కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం! జిల్లాలోని 49 మండలాల పరిధిలో 42 మంది ఈఓపీఆర్డీలు విధులు నిర్వర్తిస్తుండగా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీని పదోన్నతుల ద్వారా చేపట్టనున్నారు. ప్రస్తుతం 125 మంది కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి నియమించే తరుణంలో పెద్ద పంచాయతీకి కంప్యూటర్ ఆపరేటర్ నియామకం తప్పనిసరి. వీటిని సైతం భర్తీ చేసే అవకాశం ఉంది. -
మైక్రో ఇరిగేషన్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తణుకు టౌన్ : జిల్లా సూక్ష్మ సేద్య పథకంలో ఔట్ సోర్సింగ్ ద్వారా మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్, మైక్రో ఇరిగేషన్ ఏరియా అధికారి పోస్టులకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ నిర్వాహకులు బి.వెంకట్ తెలిపారు. మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్ పోస్టుకు (1) ఎస్సీ పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని, మైక్రో ఇరిగేషన్ ఏరియా అధికారి (1) పోస్టుకు ఎస్టీ పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్‌కు బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఏరియా అధికారికి హార్టీకల్చర్‌లో డిప్లామో లేదా అగ్రి కల్చర్ డిగ్రీ చదివిన వారులు అర్హులన్నారు. ఈ నియామకాలు ప్రతిభ, అనుభవం ఆధారంగానే భర్తీ చేస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 17లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.