సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి కొత్త కొలువులు మంజూరయ్యాయి. వచ్చే ఏడాది ఈ సొసైటీ ద్వారా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి ఆదేశాలిచ్చింది. మొత్తం 4,322 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో గురుకుల పాఠశాలలకు సంబంధించి 4,284... మరో 38 బీసీ గురుకుల సొసైటీకి కేటాయించింది. ఈ పోస్టులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్లపాటు విడతల వారీగా భర్తీ చేసుకునేలా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలు, సొసైటీకి మంజూరు చేసిన పోస్టుల్లో 3,717 పోస్టులు మాత్రమే రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగతా 605 పోస్టులను అవుట్ సోర్సింగ్‌లోనే నియమించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది 2,537 పోస్టులు...
గురుకుల సొసైటీ, గురుకుల పాఠశాలలకు మంజూరు చేసిన 4,322 పోస్టుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,537 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020–21లో 833 పీజీటీ పోస్టులు, 2021–22లో 119 ఫిజికల్ డైరెక్టర్లు, 2022–23లో 833 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
బీసీ గురుకుల సొసైటీకి మంజూరైన పోస్టులు
రెగ్యులర్...
కేటగిరీ పోస్టులు
డిప్యూటీ సెక్రటరీ 1
అసిస్టెంట్ సెక్రటరీ 2
రీజినల్ కో–ఆర్డినేటర్లు 10
సూపరింటెండెంట్లు 2
సీనియర్ అసిస్టెంట్లు 8
జూనియర్ అసిస్టెంట్లు 5
అవుట్‌సోర్సింగ్..
డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ 2
డాటా ఎంట్రీ ఆపరేటర్ 4
ఆఫీస్ సబార్డినేట్ 4
బీసీ గురుకులాల్లో కేటగిరీల
వారీగా మంజూరైన పోస్టులు
రెగ్యులర్...
కేటగిరీ పోస్టులు
ప్రిన్సిపాల్ 119
జూనియర్ లెక్చరర్ 833
పీజీటీ 833
టీజీటీ 1,071
ఫిజికల్ డైరెక్టర్ 119
పీఈటీ 119
లైబ్రేరియన్ 119
క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్ 119
స్టాఫ్ నర్స్ 119
సీనియర్ అసిస్టెంట్ 119
జూనియర్ అసిస్టెంట్(టైపిస్ట్) 119
అవుట్‌సోర్సింగ్...
ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు 238
ల్యాబ్ అటెండర్లు 238
ఆఫీస్ సబార్డినేట్లు 119
గురుకులాల్లో 4,322 పోస్టులు
Published Tue, Jan 29 2019 1:52 AM | Last Updated on Tue, Jan 29 2019 5:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment