BC gurukala posts
-
బీసీ గురుకులాల్లో కొలువులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) బోధనేతర కొలువుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలకు బోధనేతర కోటాలో జూనియర్ అసిస్టెంట్ల నియామకాలకు ఆమోదం తెలి పింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీ చేయనుంది. 2017–18 విద్యా సంవత్సరంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ద్వారా కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభం కాగా ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన టీజీటీ, పీజీటీ పోస్టులను ఇటీవల టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా భర్తీ చేశారు. ఇప్పటివరకు బోధనా సిబ్బంది భర్తీ మాత్రమే జరిగింది. తాజాగా ఈ పాఠశాలలకు బోధనేతర సిబ్బందిని సైతం భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలుత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చింది. ఒక్కో గురుకుల పాఠశాలకు ఓ జూనియర్ అసిస్టెంట్ చొప్పున కొత్తగా ఏర్పాటైన 119 గురుకులాలు, అంతకు ముందు ఉన్న 20 గురుకులాలకు ఈ పోస్టులు మంజూరయ్యాయి. వారంలోగా ఈ పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కలెక్టర్లకు నియామక బాధ్యతలు.. బీసీ గురుకుల పాఠశాలల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు జిల్లా కేడర్ కావడంతో వాటి నియామక బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. అర్హత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, జాబితా రూపకల్పన మాత్రం గురుకుల నియామకాల బోర్డు పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఒకేసారి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఫలితాల మెరిట్, రోస్టర్ పాయింట్ల ఆధారంగా జాబితా తయారు చేస్తారు. వీటిని జిల్లా కలెక్టర్లకు సమర్పించిన తర్వాత అక్కడ ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. అనంతరం అర్హుల జాబితా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని గురుకుల బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇతర పోస్టుల భర్తీకి అవకాశం.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ తర్వాత ఇతర కేడర్లలో పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన 119 గురుకులాల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో వీటిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ యంత్రాంగం గురుకుల బోర్డుకు సమర్పించినట్లు తెలిసింది. -
1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం!
హైదరాబాద్ : తెలంగాణలోని బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బీసీ గురుకులాల్లో ఖాళీల భర్తీకి త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీ గురుకుల విద్యాలయాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన వాటిలో ప్రిన్సిపల్(36), టీజీటీ(1,071), పీఈటీ(119), ఇతర పోస్టులు(472) ఉన్నాయి. గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ఈ పోస్టులను త్వరలో భర్తీ చేయనుంది. దీనికనుగుణంగా ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
గురుకులాల్లో 4,322 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి కొత్త కొలువులు మంజూరయ్యాయి. వచ్చే ఏడాది ఈ సొసైటీ ద్వారా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి ఆదేశాలిచ్చింది. మొత్తం 4,322 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో గురుకుల పాఠశాలలకు సంబంధించి 4,284... మరో 38 బీసీ గురుకుల సొసైటీకి కేటాయించింది. ఈ పోస్టులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్లపాటు విడతల వారీగా భర్తీ చేసుకునేలా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలు, సొసైటీకి మంజూరు చేసిన పోస్టుల్లో 3,717 పోస్టులు మాత్రమే రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగతా 605 పోస్టులను అవుట్ సోర్సింగ్‌లోనే నియమించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వచ్చే ఏడాది 2,537 పోస్టులు... గురుకుల సొసైటీ, గురుకుల పాఠశాలలకు మంజూరు చేసిన 4,322 పోస్టుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,537 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020–21లో 833 పీజీటీ పోస్టులు, 2021–22లో 119 ఫిజికల్ డైరెక్టర్లు, 2022–23లో 833 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. బీసీ గురుకుల సొసైటీకి మంజూరైన పోస్టులు రెగ్యులర్... కేటగిరీ పోస్టులు డిప్యూటీ సెక్రటరీ 1 అసిస్టెంట్ సెక్రటరీ 2 రీజినల్ కో–ఆర్డినేటర్లు 10 సూపరింటెండెంట్లు 2 సీనియర్ అసిస్టెంట్లు 8 జూనియర్ అసిస్టెంట్లు 5 అవుట్సోర్సింగ్.. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ 2 డాటా ఎంట్రీ ఆపరేటర్ 4 ఆఫీస్ సబార్డినేట్ 4 బీసీ గురుకులాల్లో కేటగిరీల వారీగా మంజూరైన పోస్టులు రెగ్యులర్... కేటగిరీ పోస్టులు ప్రిన్సిపాల్ 119 జూనియర్ లెక్చరర్ 833 పీజీటీ 833 టీజీటీ 1,071 ఫిజికల్ డైరెక్టర్ 119 పీఈటీ 119 లైబ్రేరియన్ 119 క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్ 119 స్టాఫ్ నర్స్ 119 సీనియర్ అసిస్టెంట్ 119 జూనియర్ అసిస్టెంట్(టైపిస్ట్) 119 అవుట్సోర్సింగ్... ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు 238 ల్యాబ్ అటెండర్లు 238 ఆఫీస్ సబార్డినేట్లు 119 -
‘బీసీ గురుకులాల’కు 240 రెగ్యులర్ పోస్టులు
- మరో 192 ఔట్ సోర్సింగ్ పోస్టులు సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ పరిధిలో జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన 16 గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 240 రెగ్యులర్ పోస్టులు, 192 ఔట్సోర్సింగ్ పోస్టులకు గానూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ గురుకులాల సర్వీసు రూల్స్ ఆధారంగా రెగ్యులర్ పోస్టులను డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రెగ్యులర్ పోస్టులు.. కేటగిరీ పోస్టులు వేతనం (రూపాయల్లో) ప్రిన్సిపల్ 16 42,490 - 96,110 జూనియర్ లెక్చరర్ 176 37100 - 91,450 లైబ్రేరియన్ 16 37100 - 91,450 ఫిజికల్ డెరైక్టర్ 16 37100 - 91450 సీనియర్ అసిస్టెంట్ 16 22460 - 66330 ఔట్సోర్సింగ్ పోస్టులు.. జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈవో 16 ల్యాబ్ అసిస్టెంట్ 32 అటెండర్ 32 కుక్ 16 మల్టీ పర్పస్ వర్కర్ 96 మొత్తం 192.