- మరో 192 ఔట్ సోర్సింగ్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ పరిధిలో జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన 16 గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 240 రెగ్యులర్ పోస్టులు, 192 ఔట్‌సోర్సింగ్ పోస్టులకు గానూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ గురుకులాల సర్వీసు రూల్స్ ఆధారంగా రెగ్యులర్ పోస్టులను డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
రెగ్యులర్ పోస్టులు..
కేటగిరీ పోస్టులు వేతనం (రూపాయల్లో)
ప్రిన్సిపల్ 16 42,490 - 96,110
జూనియర్ లెక్చరర్ 176 37100 - 91,450
లైబ్రేరియన్ 16 37100 - 91,450
ఫిజికల్ డెరైక్టర్ 16 37100 - 91450
సీనియర్ అసిస్టెంట్ 16 22460 - 66330
ఔట్‌సోర్సింగ్ పోస్టులు..
జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈవో 16
ల్యాబ్ అసిస్టెంట్ 32
అటెండర్ 32
కుక్ 16
మల్టీ పర్పస్ వర్కర్ 96
మొత్తం 192.
‘బీసీ గురుకులాల’కు 240 రెగ్యులర్ పోస్టులు
Published Wed, Sep 28 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
Advertisement