Osmania Hospital
-
గోషామహల్లో ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన వేళ గోషామహల్లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. గోషామహల్లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈరోజు ఉదయం 11.54 గంటలకు గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో గోషామహల్ గ్రౌండ్లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి గోషామహల్ స్టేడియం కాకుండా ఇంకెక్కడైనా నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉస్మానియ ఆసుపత్రి నిర్మాణంపై ముందుకెళ్లాలని స్థానికుల సూచిస్తున్నారు.మరోవైపు.. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్..‘ఇక్కడ ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించాలి. గోషామహల్ గ్రౌండ్లో ఆసుపత్రి కడితే తమకు అనేక రోగాలతో పాటు, మార్చురీ వాసన వస్తుందని పక్కనే ఉన్న ప్రజలు భయపడుతున్నారు. అక్కడున్న ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలి. అక్కడి ప్రజల గోడును వినండి. నేను కుంభమేళాలో ఉన్నందున నేటి కార్యక్రమానికి హాజరుకాలేపోతున్న అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పురుషోత్తంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్బంగా పురుషోత్తం మాట్లాడుతూ..‘ఆసుపత్రి నిర్మాణం చేయాలనుకోవడం మంచిదే. కానీ, గోషామహల్ వంటి ఇరుకైన ప్రాంతంలో కాదు. ఊపిరాడకుండా ఉండే ఇరుకు ఇండ్లు, రోడ్ల మధ్య ఆసుపత్రి నిర్మాణం సరికాదు. వర్షం వస్తే ఇక్కడి రోడ్లు నదులను తలపిస్తాయి. స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ నిర్ణయాన్ని పున:సమీక్ష చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు. -
ఉస్మానియా ఆస్పత్రి భవనం పోలీస్ గ్రౌండ్స్ లో నిర్మించవద్దని డిమాండ్
-
కొత్త ‘ఉస్మానియా’కు నెలాఖరులోగా శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి కోసం నూతన భవన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేయాలని, ఇందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై శనివారం తన నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త ఆస్పత్రిని నిర్మాణం కోసం ప్రతిపాదించిన గోషామహల్ స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూబదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాపులను అధికారులు సీఎంకు వివరించారు. అందులో సీఎం పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఆస్పత్రి నిర్మాణం జరపాలని స్పష్టం చేశారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.భవిష్యత్తులో సమీపంలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల వంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను తయారు చేయాలని ఆదేశించారు. రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ వంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అత్యాధునిక వసతులతో ఆస్పత్రి నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని.. ఈ మేరకు పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. -
గాంధీ, ఉస్మానియాల్లో డాక్టర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వివిధ కేటగిరీల్లో డాక్టర్ల భర్తీకి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. ఈనెల 9వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 12వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 14వ తేదీన నియామకపత్రాలు ఇవ్వనున్నారు.ఈ రెండు ఆస్పత్రుల్లో 235 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఉస్మానియాలో 8 ప్రొఫెసర్ పోస్టులు, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 111 అసిస్టెంట్ ప్రొఫెసర్, 33 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అదేవిధంగా గాంధీ ఆస్పత్రిలో 3 ప్రొఫెసర్, 29 అసిస్టెంట్ ప్రొఫెసర్, 24 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, 4 ట్యూటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 9న గాంధీ మెడికల్ కాలేజీ పరిపాలన భవనంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ సమక్షంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్‌లో కమిషనర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. -
గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో అనాథ శవాల ఆత్మఘోష!
అవి రాష్ట్రంలోనే పేరొందిన రెండు ప్రభుత్వ పెద్దాస్పత్రులు... పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ రెండు ఆస్పత్రుల్లోని మార్చురీలు (శవాగారాలు), వాటి దయనీయ పరిస్థితిని చూస్తే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.. గుండెలు బరువెక్కుతాయి. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల మృతదేహాలు ఆనవాళ్లు లేక మార్చురీల్లో కుళ్లిపోయి దుర్వాసనలు వెదజల్లుతూ శవాల దిబ్బగా మారుతున్నాయి. సరైన సమయంలో దహన సంస్కారాలకు నోచుకోక వాటి ఆత్మలు ఘోషిన్తున్నాయి.. ఈ హృదయ విదారక దుస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో నిత్యం సుమారు 50 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. వాటిలో దాదాపు 10–15 వరకు అనాథ శవాలే. తాజా మృతదేహాలను మార్చురీలోని ఫ్రీజరు బాక్స్‌ల్లో భద్రపరుస్తున్న సిబ్బంది... గుర్తుతెలియని, అనాథ మృతదేహాలను పఫ్రూం (మూకుమ్మడిగా మృతదేహాలను భద్రపరిచే గది)కు తరలిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, పోలీసులు, ఫోరెన్సిక్ వైద్యుల మధ్య సమన్వయ లోపం కారణంగా మృతదేహాలను అక్కడ రోజుల తరబడి ఉంచాల్సి వస్తుండటంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. సిబ్బంది సైతం లోపలకు వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. నిబంధనలకు పాతర! పోస్ట్‌మార్టం జరిగిన 72 గంటల తర్వాత అనాథ శవాలను జీహెచ్ఎంసీ విభాగం శ్మశానవాటికకు తరలించాలనే నిబంధనలు ఉన్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్ఎంసీ ఓ కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియల నిర్వహణకు కొంత మొత్తం చెల్లిస్తుండగా ఆ సంస్థ మాత్రం వివిధ సాకులు చెబుతూ మృతదేహాల తరలింపులో తీవ్ర జాప్యం చేస్తోంది. రవాణా ఖర్చులు మిగుల్చుకొనేందుకు దాదాపు 10 రోజులకోసారి దాదాపు 20 చొప్పున మృతదేహాల తరలింపు ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం ఒక్కో మృతదేహం తరలింపు, అంత్యక్రియలకు కాంట్రాక్టు సంస్థకు జీహెచ్ఎంసీ రూ. 2,000–2,500 మ«ద్య ఇస్తున్నట్లు సమాచారం. గతంలో గాంధీ, ఉస్మానియాలకు చెందిన అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహించిన ఓ స్వచ్ఛంద సంస్థపై ఆరోపణలు రావడంతో దానిని తప్పించి జీహెచ్ఎంసీయే రంగంలోకి దిగినా అదే తీరు నెలకొనడం గమనార్హం. కాలేజీలకు కొన్ని అనాథ శవాలు? మార్చురీ నుంచి కొన్ని అనాథ శవాలను కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంసీ) నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు మానవ అనాటమీ, డిసెక్షన్పై అవగాహన కల్పించాలి. ఇందుకోసం మృతదేహాలు కావాలి. అయితే రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మృతిచెందే వ్యక్తుల మృతదేహాలు డిసెక్షన్‌కు పనికిరానందున రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ సాధారణ రుగ్మతలతో మరణించే అనాథల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కొందరు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పుర్రె, ఎముకల విక్రయం! అంత్యక్రియలకు ముందు అప్పుడప్పుడూ అనాథ మృతదేహాల నుంచి పుర్రెతోపాటు కొన్ని శరీర భాగాలకు చెందిన ఎముకలను వేరు చేసి తాంత్రిక, భూత వైద్యులుగా చెలామణి అయ్యే వారికి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పుర్రెను రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు, చేతి, తొడ ఎముకలు, వెన్నెముక, జాయింట్‌గా ఉన్న ఐదు చేతివేళ్ల ఎముకలను రూ. 2 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వెంటాడుతున్న సిబ్బంది కొరత.. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను సిబ్బంది కొరత వెంటాడుతోంది. గాంధీ మార్చురీలో ప్రస్తుతం ఏడుగురు వైద్యులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మరో ముగ్గురు వైద్యులు, ఆరుగురు సిబ్బందితో ఇంకో యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు. మరోౖవెపు ఉస్మానియాలో వైద్యుల కొరత అంతగా లేకున్నా ఏడుగురు కిందిస్థాయి సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. సమన్వయంతో అంత్యక్రియలు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పఫ్ రూంలోకి తరలించాక 5–6 మృతదేహాలను ఒకసారి చొప్పున జీహెచ్ఎంíసీ సిబ్బంది తీసుకెళ్తున్నారు. వారితో సమన్వయం చేసుకుంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ బి. నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చనిపోయిన వ్యక్తి అనాథ కాకూడదు గుర్తుతెలియని వ్యక్తిని అనాథ శవంలా కాకుండా వారి కుటుంబ సభ్యులకు చేరవేయాలనే మా ఉద్దేశానికి వ్యతిరేకంగా ఈ తంతు నడుస్తోంది. ప్రభుత్వంతో 8 ప్రామాణికాలకు అనుగుణంగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే మేం నడుచుకున్నా మమ్మల్ని కాదని జీహెచ్ఎంసీకి అప్పగించింది. – డా. రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్, ప్రధాన కార్యదర్శి తరలింపులో కొన్నిసార్లు జాప్యం అనాథ శవాల తరలింపులో కొన్నిసార్లు జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. మేం ప్రతిరోజూ జీహెచ్ఎంసీకి అనాథ శవాల వివరాలను లిఖితపూర్వకంగా అందిస్తున్నాం. గాంధీలో 60 మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజరు బాక్సులు, పఫ్రూంతోపాటు అన్ని వసతులు ఉన్నాయి. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జాప్యం లేదు.. 3 అనాథ శవాల తరలింపులో జాప్యం జరగట్లేదు. సమాచారం అందిన వెంటనే మార్చురీ నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం. – ముకుందరెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, బేగంపేట సర్కిల్ -
తలలో కణితి.. శిశువుకు శస్త్రచికిత్స
రఘునాథపల్లి: తలలో కణితితో జన్మించిన ఆడశిశువుకు ఆపరేషన్ చేసి ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆ కణితిని తొలగించారు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల ఆడశిశువును.. ఎవరో ఈ నెల 28న జనగామ జిల్లా రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో వదిలేశారు. బాలల సంరక్షణ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మంగళవారం వైద్యులు ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. కాగా, చిన్నారికి గుండెలోనూ సమస్య ఉందని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి తెలిపారు. -
గ్యాస్ లీక్ అవ్వడంతో.... దంపతులు మృతి!!
సత్తుపల్లిటౌన్: వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి తీవ్రంగా గాయపడిన దంపతులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన దంపతులు అడపా శ్రీరామమూర్తి (50), అడపా ఇంద్రకుమారి(44) నవంబర్ 30న ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఇంద్రకుమారికి మంటలు అంటుకోవడంతో ఆర్పేందుకు యత్నించిన భర్త శ్రీరామమూర్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) వారికి సత్తుపల్లిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా భర్త శ్రీరామమూర్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంద్ర కుమారి మృతి చెందింది. చికిత్స పొందుతూ ఒకేరోజు దంపతులు మృతి చెందటంతో హనుమాన్‌నగర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడు శ్రీరామమూర్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి సతీశ్, రాజేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబానికి మున్నూరుకాపు సంఘం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాధురి మధు, రామిశెట్టి సుబ్బారావు, రామిశెట్టి కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, తోట గణేశ్ సంతాపం తెలిపారు. (చదవండి: డాక్యుమెంట్ రైటర్లదే హవా..) -
ఉస్మానియాలో కలకలం: డ్యూటీ డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం సంభవించింది. ఓపీలో డెర్మటాలజీ విభాగంలో.. విధులు నిర్వర్తిస్తున్నడాక్టర్ భువనశ్రీపై ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ క్రమంలో భువనశ్రీ తలకి తీవ్ర గాయమైంది. తోటి డాక్టరు వెంటనే ఆమెకు కట్లు కట్టారు. ప్రస్తుతం డాక్టర్ భువనశ్రీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పెషేంట్లు, డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’ -
ఉస్మానియాలో కలకలం: డ్యూటి డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
-
Ifrah Fatima, Mounika Wadiwala: ఇద్దరు వందయ్యారు
డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, ఉస్మానియా హాస్పిటల్లో ఎంబీబీఎస్ చేసింది. ఆమె స్నేహితురాలు డాక్టర్ మౌనిక వడియాల. తను కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంది. అప్పుడొచ్చింది కరోనా. ప్రపంచం మొత్తం భయవిహ్వలమై పోయింది. ఒంట్లో ఏ రకమైన నలత వచ్చినా ‘ఇది కరోనా లక్షణమేమో’ లని బెంబేలు పడిపోతున్నారు జనం. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఉధృతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్ల క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు కిటకిటలాడిపోతున్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ దొరక్క ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు పరుగులు తీస్తున్నారు పేషెంట్లు. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లకు నర్సింగ్ స్టాఫ్‌తో సర్వీస్ ఇప్పిస్తే పేషెంట్లకు సంతృప్తి ఉండడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే డాక్టర్లకు ప్రజలకు మధ్య పెద్ద దూరం పెరుగుతుందనిపించింది. ఆ దూరాన్ని తగ్గించడానికి ఒక వారధిగా పనిచేయాలనుకున్నారు. ఈ యువ డాక్టర్లిద్దరికీ అప్పుడు వచ్చిందో ఆలోచన. వెంటనే ఆన్లైన్ వైద్యానికి శ్రీకారం చుట్టారు. ఈ వైద్యానికి ఫీజు లేదు! ఇఫ్రాహ్, మౌనికలు తమ ఆలోచనను స్నేహితులందరికీ చెప్పారు. విన్నవాళ్లలో దాదాపుగా అందరూ కరోనా పేషెంట్లకు ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చారు. మొదటగా ఏప్రిల్ నెలలో 24 మంది డాక్టర్లతో ఒక బృందం తయారైంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు సమయాన్ని ఒక్కొక్క స్లాట్ రెండు గంటల చొప్పున ఆరు స్లాట్లుగా విభజించుకున్నారు. ప్రతి టైమ్ స్లాట్‌లో నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండేటట్లు చూసుకున్నారు. డాక్టర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఏ సమయంలో ఏ డాక్టర్లను సంప్రదించాలి... వంటి వివరాలతో ఒక పట్టిక తయారు చేశారు. ఈ పట్టికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ మాట్లాడేటంతటి రష్. డాక్టర్లు ఇచ్చిన సర్వీస్ చాలా సులువైనదే. అయితే హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకని క్లిష్టమైన సమయంలో వీరి సేవ పేషెంట్లను సేదదీర్చే చల్లని చిరుజల్లయింది. పేషెంట్లు చెప్పిన లక్షణాల ఆధారంగా కరోనా తీవ్రతను గ్రహించి అవసరమైన మందులను, ఆహారాన్ని సూచించేవారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పేవారు. తేలికపాటి లక్షణాలకు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని, హోమ్ క్వారంటైన్ పాటించమని ధైర్యం చెప్పేవారు. అలాగే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను స్వయంగా సంప్రదించాల్సి ఉంటుందో కూడా వివరించారు. ఈ సర్వీస్‌లో కొంతమంది డాక్టర్లు ఫోన్లో మాట్లాడితే మరికొంతమంది వాట్సప్ చాట్ ద్వారా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. వందమందికి చేరింది! ఇఫ్రాహ్, మౌనిక ప్రారంభించిన ఫ్రీ మెడికల్ సర్వీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్ల పోస్టులను ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, బాలీవుడ్ నటి కొంకణాసేన్‌లు కూడా షేర్ చేశారు. దేశం నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. దాంతో డాక్టర్ల సంఖ్యను 24 నుంచి యాభైకి, మే ఒకటి నాటికి యాభై నుంచి వందమందికి పెంచుకున్నారు. ఒక్కో స్లాట్‌లో ఎనిమిది నుంచి పది మంది డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. మొత్తంగా ఈ మెడికల్ సర్వీస్ నెట్‌వర్క్‌లో దేశవిదేశాల్లో ఉన్న డాక్టర్ మిత్రులందరినీ భాగస్వాములను చేయగలిగారు ఇఫ్రాహ్, మౌనిక. అలాగే సర్వీస్ టైమ్ కూడా ఉదయం ఎనిమిది నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు విస్తరించారు. రాను రాను కరోనా భయం శారీరకం నుంచి మానసిక సమస్యలకు దారి తీయడాన్ని గమనించి... హైదరాబాద్, ఎర్రగడ్డ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డాక్టర్లు కూడా ఈ మెడికల్ సర్వీస్‌లో పాలుపంచుకున్నారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల కోసం యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్‌లో ఉంటున్న వాళ్లు కూడా ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే! నిజంగా అవసరమైన టెస్టులేవో, అవసరం లేని టెస్టులేవో పేషెంట్లకు తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది ఒక లిస్ట్ ఇచ్చి ‘ఈ పరీక్షలు చేయించుకుని రండి’ అని మాత్రమే చెప్తారు. మరోమాట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఒక తుమ్ము వచ్చినా, చిన్నపాటి దగ్గు వచ్చినా, ఒళ్లు వెచ్చబడినా భయంతో వణికిపోవాల్సిన దుస్థితి రాజ్యమేలుతున్న సమయంలో, డాక్టర్ల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న తరుణంలో ఈ యువ డాక్టర్లు చేస్తున్న మంచిపని వైద్యరంగం మీద గౌరవాన్ని పెంచుతోంది. ఒక్కొక్కరికి రెండు వేల ఫోన్ కాల్స్! మాకు రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ వచ్చేవి. ఈ యాభై రోజుల్లో మా టీమ్ డాక్టర్లు సరాసరిన ఒక్కొక్కరు రెండు వేల మందికి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటారు. మా ప్రయత్నంలో ప్రధానమైన ఉద్దేశం మా తోటి వైద్యుల మీద పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడానికి మా వంతు సహకారం అందించడం. పేషెంట్లతో అనునయంగా మాట్లాడి, ‘ఏం ఫర్వాలేదు, ఈ రోగాన్ని జయించగలం’ అనే ధైర్యాన్ని కల్పించడం. అదేవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా హాస్పిటల్‌కు వెళ్లడాన్ని నివారించడం కూడా. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లు హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ తీవ్ర లక్షణాలున్న పేషెంట్లతో మెలగడం ద్వారా వీరిలో కూడా వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఎక్కువ. అలాంటి అనర్థాలను నివారించడానికి మా వంతుగా కృషి చేశాం. ఈ ప్రయత్నంలో కలిసి వచ్చిన డాక్టర్లందరూ తొలిరోజు నుంచి ఇప్పటి వరకు అదే అంకితభావంతో పని చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞత లు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మాకు ఫోన్ కాల్స్ కూడా బాగా తగ్గాయి. – డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, డాక్టర్ మౌనిక వడియాల – వాకా మంజులారెడ్డి -
Covid-19: ఆస్పత్రిలో బెడ్స్ కావాలా?
లక్డీకాపూల్: కోవిడ్ సెకండ్‌వేవ్ ఉధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి. అతికష్టం మీద పడక సమస్య తీరినా.. వెంటిలేటర్ ఖాళీ లేకపోవడమో.. లేక ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం లేని దుస్థితి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వివరాలు మీ కోసం ‘సాక్షి’ అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు టిమ్స్, గచ్చిబౌలి – 94949 02900 గాంధీ – 93922 49569 ఈఎస్ఐ, సనత్‌నగర్ – 77029 85555 జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి – 80085 53882 ఉస్మానియా – 98499 02977 మిలిటరీ హాస్పిటల్, తిరుమలగిరి – 78895 29724 నిలోఫర్ – 94406 12599 చెస్ట్ హాస్పిటల్ – 99492 16758 ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట – 93470 43707 ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట – 98662 44211, ఏరియా హాస్పిటల్, గోల్కొండ – 94409 38674 ఏరియా హాస్పిటల్, నాంపల్లి – 80085 53888 సీహెచ్‌సీ రాజేంద్రనగర్ – 80085 53865 ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం – 80085 53912 జిల్లా దవాఖాన, కొండాపూర్ – 94400 61197 సీహెచ్‌సీ, హయత్‌నగర్ – 80085 53863 ప్రైవేట్ ఆసుపత్రులు కిమ్స్, కొండాపూర్ – 98495 54428 ఆదిత్య బొగ్గులకుంట – 99851 75197 అపోలో జూబ్లీహిల్స్/కంచన్ బాగ్ – 92462 40001 రెయిన్ బో, బంజారాహిల్స్ – 99591 15050 ఒమేగా, బంజారాహిల్స్ – 98480 11421 సెయింట్ థెరిస్సా, ఎర్రగడ్డ – 90320 67678 మల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్, సూరారం – 98498 91212 వివేకానంద, బేగంపేట – 99482 68778 కేర్, బంజారాహిల్స్/ హైటెక్‌సిటీ – 99560 69034 నోవా – 93917 11122 కామినేని – 94910 61341 అస్టర్ ప్రైమ్, అమీర్‌పేట – 91777 00125 వాసవి, లక్డీకాపూల్ – 98481 20104 యశోద – 99899 75559, 93900 06070 మల్లారెడ్డి ఆస్పత్రి, సూరారం – 87903 87903 రవి హిలియోస్, ఇందిరాపార్క్ – 98490 84566 ఇమేజ్, అమీర్‌పేట/మాదాపూర్ – 90000 07644 ప్రతిమ, కాచిగూడ 99593 61880/ 97039 90177 ఏఐజీ, గచ్చిబౌలి –040–4244 4222, 6744 4222 విరించి, బంజారాహిల్స్ – 040 4699 9999 మెడికోవర్, మాదాపూర్ – 040 68334455 సన్ షైన్ – 040 44550000, 80081 08108 దక్కన్ – 90000 39595, స్టార్, బంజారాహిల్స్ – 040 4477 7777 మమత–బాచుపల్లి – 78932 11777 ఆయాన్ ఇన్స్టిట్యూట్ కనకమామిడి – 98496 05553 మెడిసిటీ ఇన్స్టిట్యూట్ , మేడ్చల్ – 97037 32557 వీఆర్కే మెడికల్ కాలేజీ, మెయినాబాద్ – 99859 95093 షాదన్ మెడికల్ కాలేజీ, హిమాయత్‌సాగర్ – 98482 88697 చదవండి: Bachupally: 840 ఫ్లాట్స్.. 320 విల్లాలు: 24/7వలంటీర్లు -
రోడ్డుపై వరి కుప్ప.. ప్రమాదంతో ఒకరి మృతి
షాబాద్: రోడ్డుపై ఆరబెట్టిన వడ్ల కుప్పతో ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన షాబాద్‌లో చోటుచేసుకుంది. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తుర్కు ఎన్నెపల్లికి చెందిన చింతలపల్లి వీరేశ్ (27), అతని స్నేహితుడు జంగయ్యతో కలిసి హైతాబాద్ నుంచి షాబాద్‌కు మోటార్ బైక్‌పై శుక్రవారం రాత్రి వేళ వస్తున్నారు. మాచన్‌పల్లి స్టేజీ వద్ద రోడ్డుపై ఆరబెట్టిన వడ్ల కుప్పపై నల్లటి కవర్ కప్పటంతో గమనించక ప్రమాదానికి గురయ్యారు. వీరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన జంగయ్యను చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
‘ఉస్మానియా’ను ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రికి మరమ్మతులు చేస్తారా? లేక నూతన భవనాలను నిర్మిస్తారా? ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఆరేళ్లు గడిచినా ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను 4 వారాల్లో సమర్పించాలని, ఉస్మానియా ఆసుపత్రి స్థలంతో పాటు భవనాలకు సంబంధించిన సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. చారిత్రక కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చకుండా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేయాలా లేదా భవనాలు కూల్చేసి కొత్త భవనాలు నిర్మించాలా అన్న దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ పిల్ 2015లో దాఖలైందని, ఆరేళ్లయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా సైట్‌మ్యాప్, గూగుల్ మ్యాప్‌లను సమర్పించాలని ఆదేశించినా ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. చారిత్రక భవనాలను హెరిటేజ్ భవనాల జాబితా నుంచి తొలగించి వాటిని కూల్చేసేందుకు ప్రభుత్వం జీవో–183 జారీ చేసిందని, ఈ జీవో చట్ట విరుద్ధమని ఇటీవల ఎర్రమంజిల్ భవనాల పరిరక్షణలో భాగంగా ఇచ్చిన తీర్పులో హైకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. హెరిటేజ్ భవనాలను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. -
పెద్దాస్పత్రికి సుస్తీ!
సాక్షి, హైదరాబాద్: పేదలకు పెద్ద దిక్కుగా నిలిచిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఎలక్టివ్ సర్జరీలే కాదు.. అత్యవసర చికిత్సలూ నిలిచిపోయాయి. పాతభవనంలోని ఆపరేషన్ థియేటర్లకు తాళం వేయడంతో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లోని సర్జరీలన్నీ నిలిచిపోవడంతో ఇప్పటికే ఆస్పత్రిలో అడ్మిటై...చికిత్సల కోసం ఎదురు చూస్తున్న నిరు పేదలకు తీరని నిరాశే మిగులుతోంది. కులీకుతుబ్‌షా, ఓపీ భవనాల్లో పలు ఆపరేషన్ థియేటర్లు ఉన్నప్పటికీ..ఆయా భవనాల్లో పోస్టు ఆపరేటివ్ వార్డులు లేకపోవడం, ఉన్నవాటికి ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో చికిత్సలు వాయిదా వేయాల్సి వస్తుంది. సర్జరీలన్నీ నిలిచిపోవడంతో ఆస్పత్రిలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటీ, పోస్ట్ ఆపరేటివ్ ప్రాక్టీస్ లేకపోవడం, వార్షిక పరీక్షల గడువు సమీపిస్తుండటంతో ఆయా వైద్య విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆపరేషన్ థియేటర్లు మూతపడటంతో.. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 11 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో నాలుగు థియేటర్లు పాతభవనంలోనే ఉన్నాయి. ప్రస్తుతం పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం, ఆ ప్రాంగణంలోని వరద నీరు వచ్చి చేరడంతో ఇటీవల పాత భవనాన్ని ఖాళీ చేసి, తాళం వేసిన విషయం తెలిసిందే. పాత భవనంలో జనరల్ మెడిసిన్, జనరల్, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీలకు చెందిన సుమారు 700 మంది రోగులు చికిత్స పొందేవారు. ఎనిమిది యూనిట్లు ఉన్న జనరల్ సర్జరీ విభాగానికి రెండు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, ఆరు యూనిట్లు ఉన్న ఆర్థోపెడిక్ విభాగానికి ఒక ఆపరేషన్ థియేటర్ ఉంది. జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ఆపరేషన్ థియేటర్‌నే సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు కూడా ఉపయోగించుకునే వారు. రెండు నెలల నుంచి ఈ మూడు ఆపరేషన్ థియేటర్లు మూతపడే ఉన్నాయి. అప్పటి నుంచి ఆయా విభాగాల్లో ఎలక్టివ్ సర్జరీలతో పాటు కిడ్నీ, కాలేయ మార్పిడి వంటి అత్యవసర చికిత్సలు కూడా నిలిచిపోయాయి. కోవిడ్ భయంతో ఇప్పటికే ఎలక్టివ్ సర్జరీలను వాయిదా వేస్తుండగా...ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో అత్యవసర చికిత్సలు వాయిదా వేయాల్సి వస్తుంది. గతంలో ఇక్కడ చిన్నాపెద్ద అన్ని కలిపి రోజుకు సగటున 140 నుంచి 150 ఎలక్టివ్ సర్జరీలు జరిగేవి. ప్రస్తుతం పాత భవనంలోని ఓటీలన్నీ మూతపడటంతో ప్రస్తుతం వారానికి నాలుగైదు సర్జరీలే జరుగుతుండటం విశేషం. టెక్నీషియన్ లేక పోవడంతో కార్డియో థొరాసిక్ విభాగంలో గత రెండేళ్ల నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీలు నిలిచిపోగా...అనుభవం ఉన్న వైద్యులు లేక పోవడంతో యూరాలజీ విభాగంలో గత ఆరు నెలల నుంచి కిడ్నీ మార్పిడి చికిత్సలు నిలిచిపోవడం విశేషం. గాంధీ, కింగ్కోఠిలను కోవిడ్ సెంటర్లుగా మార్చడంతో.. గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులను ఇప్పటికే పూర్తిస్థాయి కోవిడ్ కేంద్రాలుగా మార్చిన విషయం తెలిసిందే. గతంలో ఒక్క గాంధీలోనే రోజుకు సగటున 3000 మంది ఓపీకి వచ్చేవారు. ఆస్పత్రి లో నిత్యం 1500 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందేవారు. ప్రస్తుతం ఇక్కడ సాధారణ వైద్యసేవలను నిలిపివేయడంతో ఇప్పటి వరకు అక్కడ చికిత్సలు పొందిన రోగులు అత్యవసర పరిస్థి తుల్లో ఉస్మానియాకు వస్తున్నారు. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్న ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉస్మానియాలో ప్రస్తుతం 6 కేఎల్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. ఇది చాలా వరకు పాతభవనంలోని ఆపరేషన్ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్ వార్డులకు అనుసంధానించబడి ఉంది. కులీకుతుబ్‌షా, ఓపీ బ్లాక్‌లోని పోస్టు ఆపరేటీవ్ వార్డులకు ఆక్సిజన్ సరఫరా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. 100 శాతం ప్రెషర్‌తో సరఫరా కావాల్సిన ఆక్సిజన్ 40 శాతం ప్రెషర్‌తో సరఫరా అవుతుంది. వెంటిలేటర్, ఆక్సిజన్లపై ఉన్న రోగులకు శ్వాస అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల మరో 2 కేఎల్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయిచింది. ఈ పనులు పూర్తి అయ్యేందుకు మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రోగుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. -
‘ప్రభుత్వం మా జీవితాలతో ఆడుకుంటుంది’
సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ ఉస్మానియా ఆసుపత్రి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆసుపత్రి ప్రాంగంణలో బుధవారం ధర్నాకు దిగారు.ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి తమకు వేతనాలు పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని, అయినా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి ఉన్నా సరే తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నామన్నారు. అయినప్పటికి ప్రభుత్వం తమ బతుకులతో ఆడుకుంటుందని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి, గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పెంచినట్లే తమకు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. చదవండి: ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత -
ఉస్మానియాలో 3వ రోజు కొనసాగుతున్న నర్సుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : జీతాలు ఇవ్వడం లేదంటూ ఉస్మానియా ఆసుపత్రిలో నర్సులు చేపట్టిన దర్నా మూడో రోజుకు చేరుకుంది. నాలుగు నెలలుగా జీతం ఇవ్వడం లేదంటూ 87 మంది స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించారు. దీంతో గత మూడు రోజులుగా 12 ముఖ్య విభాగాల్లో సేవలు కుంటుపడ్డాయి. అవుట్సోర్సింగ్ కింద నాలుగు నెలల క్రితమే ఉద్యోగంలో చేరినా ఇప్పటివరకు దీనికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తక్షణమే అవుట్సోర్సింగ్ లెటర్‌తో పాటు, ఐడీ కార్డు, రెండు నెలల జీతం ఇస్తేనే విదులకు హాజరవుతామని డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళనలతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ, ఐసోలేషన్ వార్డులు, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో రోగులు తీద్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై మాట్లాడకుండా కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ పాండు నాయక్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూలిపోయే దశలో ఉందని, భవనాల ఫ్లోరింగ్ దారుణంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో మంత్రులు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ఆసుపత్రి ఆందోళనకర పరిస్థితిలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాల ప్రణాళిక ఉందని హాస్పిటల్ సూపరిండెంట్ చెప్పినా అది ఆచరణ రూపం దాల్చడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం దీనికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిజాం కట్టిన భవనాలను కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, అద్భుతమైన సచివాలయాన్ని మూడనమ్మకాల కోసం కూలగొట్టడం దారుణమన్నారు. హెరిటేజ్ భవనాన్ని కూల్చొద్దని, ఉస్మానియా ఆవరణలోనే ఉన్న 6 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. హెరిటేజ్ భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. (కరోనాను 'ఆరోగ్య శ్రీ' లో చేర్చాలి : ఉత్తమ్ ) -
ఉస్మానియా పాత భవనానికి సీల్
-
అప్పుడు అడ్డుపడి.. ఇప్పుడు విమర్శలా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాల నేతల చేష్టలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముందుచూపుతో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిద్దామని 2015లోనే ప్రతిపాదించారని, కానీ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతోనే నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఫలితం గా వారే ఇప్పుడు అక్కడి రోగుల ఇబ్బందులకు కారకులయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆస్పత్రిలోకి వర్షం నీళ్లు వస్తున్నాయంటూ అర్థం లేకుండా మాట్లా డటం సరికాదన్నారు. నూతన భవన నిర్మాణ ప్రతిపా దనను పక్కనపెట్టి పెద్ద ఎత్తున మరమ్మతులు చేయించిందని చెప్పారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వర్షాల కారణంగా కొన్ని పెచ్చులు ఊడటం, వరద నీరు లోపలికి రావడం వల్ల పేషెంట్లకు, సిబ్బందికి కొంత ఇబ్బంది కలిగిందన్నారు. మూసీకి వెళ్లే నాలా బ్లాక్ కావడంతో.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ సీఈ లక్ష్మారెడ్డి ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి మంత్రి ఈటలకు నివేదిక అందజేశారు. బేగంబజార్ నుంచి మూసీకి ఉస్మానియా ఆస్పత్రి భూ గర్భం నుంచి వరద నీటి నాలా వెళ్తోందని, అది బ్లాక్ కావడంతోనే ఆస్పత్రిలోకి నీళ్లు వచ్చాయని అధికారులు వివరించారు. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందితో కలసి నీటిని తీసేశామని తెలిపారు. ఖులీ ఖుతుబ్ షా బిల్డింగ్‌లో 200 పడకలను సిద్ధం చేశామని, ఇక్కడున్న పేషెంట్లను అక్కడికి తరలించామని వెల్లడించారు. కోవిడ్–19 తొలికేసు నమోదయిన మార్చి 2 నుంచి ఇప్పటివరకు 108 రోజులు గడిచినా ఏ ఒక్కరోజు కూడా వైద్య, ఆరోగ్య శాఖ విరామం తీసుకోలేదని రాజేందర్ పేర్కొన్నారు. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వితో సమావేశమై భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. -
తెలంగాణలో మరో కరోనా మరణం
సాక్షి, రంగారెడ్డి/ హైదరాబాద్ : తెలంగాణలో మరో కరోనా మరణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేగూర్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. కాగా మహిళ మృతి చెందిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 10 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లు అప్రమత్తమై మహిళ సొంత గ్రామమైన చేగూర్‌ను పరిశీలించారు. అనంతరం మృతురాలి నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ మందును విస్తృతంగా స్ప్రే చేయించారు. కాగా చనిపోయిన మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఎవరెవరు ఉన్నారో గుర్తించి వారిని సిపార్డ్‌లోని క్వారంటైన్ కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలిన వారికి తమ ఇళ్లలోనే క్వారంటైన్ చేపట్టాలని సూచించారు. -
గుట్టు రట్టవుతుందనే బయటపెట్టట్లేదు..
సాక్షి, సిటీబ్యూరో : ఆరోగ్య రాజధాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకుపోతుంటే మన ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రం ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నాయి. మందులు, వైద్య పరికరాల కొనుగోలు, ఇతర అభివృద్ధి పనుల్లో పారదర్శంగా వ్యవహరించాల్సిన ఆస్పత్రులు ఆయా అంశాల్లో ఎంతో గోప్యత పాటిస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం కనీసం ఆస్పత్రి పేరుతో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయలేని దుస్థితి. వైద్య విభాగాలు, నిపుణులు, సేవల వేళలు, ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్లు కంప్యూటర్లో పొందుపర్చేందుకు చర్యలు చేపట్టక పోవడం హాస్యస్పదం. ఫలితంగా మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు మాత్రమే కాదు..వివిధ సేవలు, అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ విభాగంలో ఎంత మంది వైద్యులు పని చేస్తున్నారు. ఎన్ని పడకలు ఉన్నాయి. ఏఏ వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తదితర వివరాలు బయటికి తెలియడం లేదు. నగరంలో ఒక్క నిమ్స్ మినహా మరే ఇతర ఆస్పత్రికి ప్రత్యేక వెబ్సైట్ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. లోపించిన పారదర్శకత... ప్రతిష్టాత్మాక ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా సహా సుల్తాన్‌బజార్ ప్రభుత్వం ప్రసూతి వైద్యశాల, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, ఫీవర్ ఆస్పత్రి, ఈఎన్టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం, సనత్‌నగర్‌లోని ఛాతి ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది. వీటిలో ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి మినహా ఇతర ఆస్ప త్రులేవీ ఇప్పటి వరకు ఆన్లైన్లో ఖాతా తెరవలేదు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు ఇటీవల వెబ్సైట్ ఓపెన్ చేసినప్పటికీ..ఆస్పత్రి చరిత్ర వంటి సాధారణ అంశాలు మినహా ఓపీ, ఐపీ, సర్జరీలు, టెండర్లు, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చలేదు. ఆస్పత్రుల్లో ఆన్లైన్ వ్యవస్థ లేక పోవడంతో అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు మొదలు విలువైన వైద్యపరికరాలు, మందుల కొనుగోలు, ఉద్యోగుల నియామకాలు, శానిటేషన్, క్యాంటిన్, పార్కింగ్ వగైరా కాంట్రాక్టులు, చివరకు అత్యవసర పరిస్థితుల్లో కొనుగోలు చేసే మందులు తదితర అంశాల్లో పారదర్శకత లోపించి, అక్రమాలకు తావిస్తోంది. నిలోఫర్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు... నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసినా..ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదు. నిలోఫర్ వెబ్సైట్లో ఇప్పటికీ మాజీ సూపరింటెండెంట్ పేరు, ఫొటోలు, పాత సమాచారమే కన్పిస్తుంది. ఒక్క వైద్య సేవలకు సంబంధించిన వివరాలు మాత్రమే కాదు ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర పరిపాలనాధికారుల పేర్లు, ఫొటోలు సైతం పాతవే దర్శనమిస్తుండటం గమనార్హం. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు కూడా ఆఫ్‌లైన్‌లో చేపడుతుండటం విశేషం. ఆరోగ్యశ్రీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల్లో భారీగా గోల్మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి, వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు అందులో పొందుపర్చి, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన ఉన్నతాధికారులే అక్రమా లకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, సిటీబ్యూరో: నల్లగొండ జిల్లా కొండారానికి చెందిన నిరుపేద రమేష్(19) శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న క్షతగాత్రుడిని బంధువులు శనివారం ఉదయం ఎల్బీనగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యశ్రీ పథకంలో అడ్మిట్ చేయాల్సిందిగా కోరగా, సేవలు నిలిపివేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారు అడిగినంత చెల్లించి ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. మరోఘటనలో ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడిన చంపాపేటకు చెందిన వినోద్(35)ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడా వారికి చేదు అనుభవమే ఎదురైంది. ఈ పరిస్థితి రమేష్, వినోద్లకు మాత్రమే కాదు.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు అనేకమందికి శనివారం ఎదురైన అనుభవం. నిమ్స్‌కు పెరిగిన రోగుల తాకిడి ప్రైవేటు ఆస్పత్రుల ఆరోగ్యశ్రీ బకాయిలు భారీగా పేరుకపోవడం, ప్రభుత్వం గత ఏడాది నుంచి పైసా విదల్చకపోవడంతో ప్రస్తుతం బకాయిలు రూ.1200 కోట్లకు చేరాయి. చికిత్స చేసిన 40 రోజుల్లోనే బిల్లు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ఏడాదిగా బకాయిలు చెల్లించక పోవడంతో ఆగ్రహించిన నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు నవంబర్ 20 నుంచి ఔట్ పేషంట్ సర్వీసులు, నవంబర్ 30 అర్ధరాత్రి నుంచి ఇన్‌పేషంట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఆ మేరకు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మినహా మిగిలిన ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు శనివారం ఉదయం నుంచి ఇన్‌పేషంట్ సేవలను పూర్తిగా నిలిపివేశాయి. వివిధ ప్రమాదాల్లో గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులు, గుండెపోటు బాధితులు, కాలేయ, మూత్ర పిండాల జబ్బులతో ఆస్పత్రులకు వస్తున్న ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కనీస వైద్యం అందలేదు. మరోదారి లేక కొందరు అడిగినంత చెల్లించి చేరగా, మరికొందరు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌కు తరలిపోయారు. దీంతో ఆయా ఆస్పత్రులకు శనివారం ఆరోగ్యశ్రీ రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇప్పటికే సాధారణ రోగులతో కిటకిటలాడుతున్న ఆయా ఆస్పత్రుల్లో తాజా కేసులకు కనీసం పడకలు కూడా దొరకని పరిస్థితి తలెత్తింది. 70 శాతం చికిత్సలు ప్రైవేటులోనే నగరంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాలో 240 ఆస్పత్రులు ఉండగా, వీటిలో అపోలో, యశోద, కేర్, కిమ్స్, స్టార్, సన్‌షైన్, కామినేని, మ్యాక్స్‌క్యూర్, కాంటినెంటల్ సహా 11 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ పరిధిలో ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ జాబితాలో ఉన్నాయి. నెట్వర్క్ పరిధిలోని మెజార్టీ ఆస్పత్రులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులతో పోలిస్తే నగరంలోని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందే అవకాశం ఉండడంతో జిల్లాల నుంచి చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, సరోజినిదేవి, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, ఈఎన్టీ, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు టీచింగ్ ఆస్పత్రులతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రుల్లోనూ ఈ సేవలు అందుతున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్‌ఎస్‌లో 70 శాతం చికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతుండగా, 30 శాతం చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. -
అద్భుతం.. ఉస్మానియా వైద్యం
సుల్తాన్‌బజార్ : ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కోమరయ్య కుమారుడు శ్రీను(22) పుట్టుకతో అంతుచిక్కని వ్యాధి బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. అతని శరీరమంతా నల్లని మచ్చలు ఏర్పడ్డాయి.తలపై కేన్సర్ గడ్డ కూడా ఏర్పడింది. కుటుంబ సభ్యులు 2011లో నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జె కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స చేసి తొలగించారు.తరువాత (రెండు సంవత్సరాల క్రితం) ఈ వ్యాధి తిరగబడింది. గతంలో తలపై ఏర్పడిన చోటే తిరిగి గడ్డ ఏర్పడింది. మెల్ల మెల్లగా మెదడు వరకు ఏర్పడింది. 10 రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ అతనికి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి నాగప్రసాద్, అనస్టీసియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పాండునాయక్, న్యూరో సర్జరి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్‌రెడ్డిల నేతృత్వంలో వైద్య బృందం సుమారు 4 గంటలపై శ్రమించి శ్రీను తలపై నుంచి మెదడువరకు పేరుకుపోయిన కేన్సర్ గడ్డను తొలగించి తొడపై నుంచి చర్మాన్ని తీసి తలపై అతికించి చికిత్స విజయంతంగా నిర్వహించారు. దీంతో వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అభినందించి సత్కరించారు. రోగి జీవన ప్రమాణాన్ని పెంచగలిగాం తలపై కేన్సర్ గడ్డ పేరుకుపోయిన శ్రీనుకు రెండు రోజుల క్రితం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి అతని జీవన ప్రమాణాన్ని పెంచగలిగాం. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని వైద్య పరిభాషలో జీరో ధర్మ పెగ్మెంటోజో అని అంటారు. 3 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి అరుదుగా వస్తుంది. కొందరికి ఈ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. 20 ఏళ్లలో ఇలాంటి ప్రాణాంతక వ్యాధితో ఎవ్వరూ రాలేదు. మొదటిసారిగా ఇలాంటి కేసు రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత ఇంటికి పంపించాం. – డాక్టర్ నాగప్రసాద్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి -
మృత్యువుతో పోరాటం.. బతకాలని ఆరాటం
సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకరు ఇద్దరు కాదు.. సుమారు 70 మంది కాలేయ సంబంధిత బాధితులు ప్రస్తుతం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. చికిత్స చేసే వైద్య నిపుణులు ఉన్నా.. ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 5,002 మంది అవయవాల కోసం పేర్లు నమోదు చేసుకుంటే, వీరిలో 2,706 మంది కిడ్నీల కోసం, 2,197 మంది కాలేయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క ఉస్మానియాలోనే 70 మంది బాధితులు కాలేయ మార్పిడి చికిత్సల కోసం ఎదురు చూస్తున్నారు. కోమాలో ఉస్మానియా గ్యాస్ట్రో ఎంటరాలజీ.. ప్రతిష్టాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని 2010లో ఏర్పాటు చేశారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో ఇప్పటివరకు ఏడు కాలేయ(బ్రెయిన్‌డెత్ కేసుల నుంచి అవయవాలను సేకరించి బాధితునికి అమర్చడం) మార్పిడి చికిత్సలను విజయవంతంగా చేశారు. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలను పొందే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల నిరుపేద బాధితులు చికిత్సల కోసం ఇక్కడికి వస్తున్నారు. అయితే సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి ఆపరేషన్ థియేటర్ కానీ, ఐసీయూ కానీ లేదు. దీంతో వేరే విభాగానికి చెందిన థియేటర్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని బ్రెయిన్‌డెత్ కేసులు లేకపోవడంతో బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అవయవాన్ని దానం చేసేందుకు బంధువులు(లైవ్ డోనర్) ముందుకొచ్చినా.. ఆస్ప త్రిలో అవసరమైన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ లేదు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ చికిత్సల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లైవ్‌డోనర్ సర్జరీల కోసం మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సహా అత్యాధునిక ఐసీయూను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కింగ్‌కోఠి ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అత్యవసర సమయంలో చికిత్సలు అందించేందుకు అవసరమైన విభాగాలు, నిపుణులు అక్కడ లేకపోవడంతో వెనుకడుగు వేశారు. ఉస్మానియాలో నూతన భవన నిర్మాణానికి మరో ఐదారేళ్లు పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని గాంధీకి తరలించాలని భావించింది. అక్కడికి వెళ్లి చికిత్సలు చేసేందుకు వైద్యులు సుముఖంగా ఉన్నా.. ఆయా ఆస్పత్రుల్లో వైద్యుల సంఘం నేతలుగా చలామణి అవుతున్న ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా సిండికేట్‌నగర్‌కు చెందిన దేవి ఒక్కగానొక్క కుమారుడు ధర్మతేజ(14) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగేళ్ల క్రితం రక్తపువాంతులు కావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. ఫలితం లేకపోవడంతో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసినా.. కాలేయం దొరకలేదు. బాబు ఆరోగ్యం క్షీణించడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు తల్లి దేవి ముందుకొచ్చింది. అయితే లైవ్‌డోనర్ నుంచి అవయవాన్ని సేకరించి, సర్జరీ చేసే అవకాశం ఉస్మానియాలో లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. యాదాద్రి జిల్లాకు చెందిన నర్సింహ, అరుణల కుమారుడు అద్విత్ కుమార్(12 నెలలు) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లగా, ఉస్మానియాకు సిఫార్సు చేశారు. పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో లైవ్‌డోనర్ చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. ‘కార్పొరేట్’ సహకారంతో బాలికకు పునర్జన్మ నాగర్‌కర్నూలు జిల్లా చారగొండకు చెందిన శ్రీకాంత్, రాణి దంపతుల కుమార్తె సాయివర్షిత(7) పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పాప ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ‘ఆటో ఇమ్యూనో డిసీజ్’తో ఆమె బాధపడుతున్నట్లు గుర్తించి.. వెంటనే కాలేయ మార్పిడి చేయాలన్నారు. తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసేందుకు తల్లి రాణి ముందుకొచ్చింది. ఆస్పత్రిలో లైవ్‌డోనర్ చికిత్సకు అవకాశం లేకపోవడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి దాతల సహాయంతో చికిత్స చేశారు. అనంతపురం జిల్లా సిండికేట్‌నగర్‌కు చెందిన దేవి ఒక్కగానొక్క కుమారుడు ధర్మతేజ(14) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగేళ్ల క్రితం రక్తపువాంతులు కావడంతో స్థానిక వైద్యులకు చూపించారు. ఫలితం లేకపోవడంతో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని స్పష్టం చేశారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసినా.. కాలేయం దొరకలేదు. బాబు ఆరోగ్యం క్షీణించడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు తల్లి దేవి ముందుకొచ్చింది. అయితే లైవ్‌డోనర్ నుంచి అవయవాన్ని సేకరించి, సర్జరీ చేసే అవకాశం ఉస్మానియాలో లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. యాదాద్రి జిల్లాకు చెందిన నర్సింహ, అరుణల కుమారుడు అద్విత్ కుమార్(12 నెలలు) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నిలోఫర్‌కు వెళ్లగా, ఉస్మానియాకు సిఫార్సు చేశారు. పరీక్షించిన వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. అయితే ఆస్పత్రిలో లైవ్‌డోనర్ చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. -
కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు పెరిగాయి. సీట్ల పెంపుపై ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వైద్య విద్య సంచాలకుడికి లేఖ రాసింది. గాంధీ వైద్య కళాశాల ఛాతీ విభాగంలో 1, అనస్తీషియా విభాగంలో 2, కాకతీయ వైద్య కళాశాల చర్మ వ్యాధుల విభాగం లో 1, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంలో 5, రేడియాలజీలో 3, ఈఎన్టీలో 1, కంటి విభాగంలో 1, ఉస్మానియా వైద్య కళాశాల స్త్రీ వ్యాధుల విభాగంలో 4, ఈఎన్టీ విభాగంలో 3, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అనస్తీషియా విభాగంలో 6 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో్ల పెంచిన సదుపాయాలతోనే 27 సీట్లు పెరిగాయని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. -
శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రి