సాక్షి, హైదరాబాద్: నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ ఉస్మానియా ఆసుపత్రి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆసుపత్రి ప్రాంగంణలో బుధవారం ధర్నాకు దిగారు.ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి తమకు వేతనాలు పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని, అయినా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి ఉన్నా సరే తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నామన్నారు. అయినప్పటికి ప్రభుత్వం తమ బతుకులతో ఆడుకుంటుందని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి, గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పెంచినట్లే తమకు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment