ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ దుర్మరణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. నాలుగు నెలల క్రితం ముంబైలోని తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ జియా మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. అది ఆత్మహత్యేనని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే అది హత్య అనడానికి తన దగ్గర తగిన ఆధారాలున్నాయని జియాఖాన్ తల్లి రబియా అమిన్ చెబ్తున్నారు. జియాఖాన్‌ను గొంతునులిమి హత్య చేసిన తరువాత ఆత్మహత్యగా నమ్మించేందుకు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారని ఆరోపిస్తున్నారు. అందుకు ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్ట్‌ను రుజువుగా చూపుతున్నారు. అందులో బెల్ట్‌తో గొంతును బిగించి చంపినట్లు, అనంతరం ఉరి వేసినట్లు స్పష్టంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిటిషన్‌ను కూడా ఆమె దాఖలు చేశారు.