ఒక రోజు క్రితమే ఆ యువకునికి వివాహం అయ్యింది. తన గదిలో పూలతో అందంగా అలంకరించిన మంచంపై పడుకున్నాడు. ఉన్నట్టుండి పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఆ యువకునిపై ధడాలున పడింది. అంతే అతను బాధతో కేకలు పెట్టాడు. అంతవరకూ ఆనందం తాండవమాడిన ఆ ఇంటిలో విషాదం నెలకొంది.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఆందళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఉన్నట్టుండి పడిపోవడంతో ఒక యువకుని మెడ తెగిపోయింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ యువకునికి తక్షణ చికిత్సనందిస్తూ, మొత్తం 26 కుట్లు వేసి, అతని ప్రాణాలు కాపాడారు. ఒకరోజు క్రితమే ఆ యువకునికి వివాహం అయ్యింది. మక్రానా పరిధిలోని గౌడాబాస్ ప్రాంతంలో ఉంటున్న యువకునిపై సీలింగ్ ఫ్యాన్ పడింది. ఈ ఘటనలో ఆ యువకుని గొంతుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మార్బల్ వ్యాపారి రమ్జాన్ సిసోడియా కుమారుడు ఇక్రామ్(27)కు జూన్ 9న వివాహం జరిగింది. అనంతరం సంప్రదాయంలో భాగంగా వధువు జన్నత్ తన పుట్టింటికి వెళ్లింది.
వరుడు విశ్రాంతి తీసుకుంటుండగా...
ఇక్రామ్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి ఇక్రామ్ బాధతో కేకలుపెట్టాడు.వెంటనే కుటుంబ సభ్యులు ఆ గదిలోకి వెళ్లి చూడగా, ఇక్రామ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని గొంతు, చేయికి తీవ్రంగా రక్తసస్రావం అవుతోంది. సీలింగ్ ఫ్యాన్ కిందపడివుంది. వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ అతనిమీద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు ఇక్రామ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ ఫారూక్ మాట్లాడుతూ బాధితుని గొంతుకు ఇరువైపుల గల రక్తనాళాలు తెగిపోయాయి. వాటి నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అతనిని ఆపరేషన్ చేశాం. తెగిపోయిన రక్తనాళాలను తిరిగి జోడించాం ఇందుకోసం 26 కుట్లు వేయాల్సివచ్చింది. బాధితుని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే మక్రానా పోలీస్టస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్రామ్ వాంగ్మూలం తీసుకున్నారు. తరువాత అతని ఇంటిలో ఇక్రామ్ పడుకున్న గదిని పరిశీలించారు. ఇక్రామ్ పంజాబ్‌లోని అంబాలాలో మార్బల్ వ్యాపారం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: లుధియానాలో రూ. 7 కోట్ల దోపిడీ
Comments
Please login to add a commentAdd a comment