stitches
-
వరునిపై పడిన సీలింగ్ ఫ్యాన్.. తరువాత?
ఒక రోజు క్రితమే ఆ యువకునికి వివాహం అయ్యింది. తన గదిలో పూలతో అందంగా అలంకరించిన మంచంపై పడుకున్నాడు. ఉన్నట్టుండి పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఆ యువకునిపై ధడాలున పడింది. అంతే అతను బాధతో కేకలు పెట్టాడు. అంతవరకూ ఆనందం తాండవమాడిన ఆ ఇంటిలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఆందళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఉన్నట్టుండి పడిపోవడంతో ఒక యువకుని మెడ తెగిపోయింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ యువకునికి తక్షణ చికిత్సనందిస్తూ, మొత్తం 26 కుట్లు వేసి, అతని ప్రాణాలు కాపాడారు. ఒకరోజు క్రితమే ఆ యువకునికి వివాహం అయ్యింది. మక్రానా పరిధిలోని గౌడాబాస్ ప్రాంతంలో ఉంటున్న యువకునిపై సీలింగ్ ఫ్యాన్ పడింది. ఈ ఘటనలో ఆ యువకుని గొంతుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మార్బల్ వ్యాపారి రమ్జాన్ సిసోడియా కుమారుడు ఇక్రామ్(27)కు జూన్ 9న వివాహం జరిగింది. అనంతరం సంప్రదాయంలో భాగంగా వధువు జన్నత్ తన పుట్టింటికి వెళ్లింది. వరుడు విశ్రాంతి తీసుకుంటుండగా... ఇక్రామ్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి ఇక్రామ్ బాధతో కేకలుపెట్టాడు.వెంటనే కుటుంబ సభ్యులు ఆ గదిలోకి వెళ్లి చూడగా, ఇక్రామ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని గొంతు, చేయికి తీవ్రంగా రక్తసస్రావం అవుతోంది. సీలింగ్ ఫ్యాన్ కిందపడివుంది. వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ అతనిమీద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు ఇక్రామ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ ఫారూక్ మాట్లాడుతూ బాధితుని గొంతుకు ఇరువైపుల గల రక్తనాళాలు తెగిపోయాయి. వాటి నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అతనిని ఆపరేషన్ చేశాం. తెగిపోయిన రక్తనాళాలను తిరిగి జోడించాం ఇందుకోసం 26 కుట్లు వేయాల్సివచ్చింది. బాధితుని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే మక్రానా పోలీస్టస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్రామ్ వాంగ్మూలం తీసుకున్నారు. తరువాత అతని ఇంటిలో ఇక్రామ్ పడుకున్న గదిని పరిశీలించారు. ఇక్రామ్ పంజాబ్‌లోని అంబాలాలో మార్బల్ వ్యాపారం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లుధియానాలో రూ. 7 కోట్ల దోపిడీ -
వార్డుబాయ్ హంగామా.. పెదవికి కుట్టేయమంటే కన్ను కింద కోశాడు
సాక్షి, కరీంనగర్: ఓ వ్యక్తి పెదవి పగిలి వైద్యం కోసం ఆసుపత్రికి రాగా.. మద్యం మత్తులో ఉన్న వార్డుబాయ్ పెదవికి కుట్లు వేయాల్సింది పోయి కన్ను కింద కోసిన దుర్ఘటన మంగళవారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. వివరాల్లో కెళితే.. ప్రమాదంలో పెదవి పగిలిన వ్యక్తి కుట్లు వేయించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. సీవోటీలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్ కుట్లు వేయమని వార్డుబాయ్‌ను పురమాయించాడు. అప్పటికే చిత్తుగా మద్యం సేవించి సీవోటీ వద్ద విధులు నిర్వహించే వార్డుబాయ్ పెదవికి కుట్లు వేయకుండా కన్ను కింది భాగంలో బ్లేడ్‌తో కోసి కొత్త గాయం చేశాడు. దీంతో పేషెంట్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్, నర్సులు పేషెంట్ల బంధువుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరగగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీసేలా వ్యవహరిస్తున్నారని పేషెంట్ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సదరు వార్డుబాయ్ గతంలో కూడా చాలాసార్లు మధ్య మత్తులో హల్ చేసిన ఘటనలు ఉన్నాయి. అధికారుల ఉదాసీనత కారణంగానే సదరు వార్డుబాయ్ మద్యం మత్తును వీడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించలేదు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు -
ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు
భోపాల్: ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్‌లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమె ముఖంపై 10 సెంటీమీటర్ల మేర లోతైన గాటు పెట్టి బ్లేడుతో పలుచోట్ల దాడిచేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం శివరాజ్ ఆదేశించారు. బాధితురాలిని సీఎం పరామర్శించి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. మున్సిపల్ అధికారులు ఒక నిందితుని ఇంటిని కూల్చివేశారు. अन्याय का प्रतिकार करना अन्य लोगों के लिए प्रेरणा का कार्य है, इस नाते बहन सीमा अन्य महिलाओं के लिए प्रेरक भी हैं। उनके बेटा और बेटी पढ़ते हैं और उनके सहयोग के लिए भी कलेक्टर भोपाल को आवश्यक निर्देश दिये हैं। pic.twitter.com/BXQ5ywPCxG — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 12, 2022 -
బ్లేడ్‌తో దాడి.. విద్యార్థికి 35 కుట్లు
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలలో ఇద్దరు విద్యార్ధుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ విద్యార్థికి తీవ్ర గాయలు అవ్వడంతో 35 కుట్లు పడ్డాయి. ఢిల్లీలోని బాదార్పూర్లో గల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఏడో తరగతి విద్యార్థుల మధ్య క్లాస్ రూమ్‌లో సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. రఫీ అనే విద్యార్థి కూర్చున్న సీటు తనకు ఇవ్వాల్సిందిగా మరో విద్యార్ధి బెదిరించాడు. దీనికి రఫీ తిరస్కరిచండంతో.. భోజన విరామం సమయంలో ఆ విద్యార్ధి స్నేహితులతో కలిసి వాష్‌రూమ్‌లో ఉన్న రఫీపై బ్లాడ్స్‌తో తీవ్రంగా దాడిచేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడడంతో.. పాఠశాల యాజమాన్యం అక్కడే ప్రథమ చికిత్సను అందించింది. తీవ్ర రక్తస్రవం అవ్వడంతో స్కూల్ యాజమాన్యం అతన్ని ఢిల్లీలోని ఎయియ్స్‌కి తరలించారు. విద్యార్థి వీపు భాగంలో బ్లేడ్‌తో తీవ్రంగా గాయపర్చడం వల్ల 35 కుట్లు వేసినట్ల ఎయియ్స్ వైద్యులు తెలిపారు. తనను విద్యార్థులు బెదిరిస్తున్నట్లు రఫీ పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన వారు పటించుకోలేదని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనలో పాల్గొన్న అందరూ మైనర్లే కావడం వల్ల పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
తలకు గాయమైతే.. స్టాప్లర్తో కుట్లు
వరంగల్ : తలకు గాయమైందని ఓ మహిళ ఆసుపత్రికి వెళితే అక్కడి వైద్యుడు... గాయానికి కుట్లకు బదులు స్టాప్లర్తో పిన్నులు వేసి పంపించాడు. ఫలితంగా ఆమె గాయం ఇంకాస్త ముదిరింది. ఈ చోద్యం వరంగల్ జిల్లా తొర్రూరులో జరిగింది. తొర్రూరు మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ తన భర్త కూరయ్యతో కలసి నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళుతూ ప్రమాదానికి గురై గాయపడింది. నుదుటిపై గాయం కావడంతో భారతమ్మ అదే రోజు తొర్రూరులోని ఎంబీబీఎస్ వైద్యుడు స్వరూప్‌కుమార్ వద్దకు వెళ్లారు. గాయానికి కుట్లకు బదులు వైద్యుడు పిన్నులు వేస్తుంటే భర్త కూరయ్య అదేంటని ప్రశ్నించగా... ఏమీకాదని చెప్పి పంపించాడు. నొప్పి తీవ్రం కావడంతో భారతమ్మ ఆదివారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లింది. పిన్నులు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందన్న వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. కాగా పిన్నులు వేసిన వైద్యుడు స్వరూప్కుమార్ను విలేకరులు ప్రశ్నించగా... ఇలా చాలామందికి పిన్నులు వేస్తున్నామని, ఎవరికీ ఇన్ఫెక్షన్ రాలేదని సూటిగా చెప్పడంతో విన్నవారు విస్తుపోవాల్సి వచ్చింది. -
తలకు గాయమైతే.. స్టాప్లర్తో కుట్లు