
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలలో ఇద్దరు విద్యార్ధుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ విద్యార్థికి తీవ్ర గాయలు అవ్వడంతో 35 కుట్లు పడ్డాయి. ఢిల్లీలోని బాదార్‌పూర్‌లో గల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఏడో తరగతి విద్యార్థుల మధ్య క్లాస్ రూమ్‌లో సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. రఫీ అనే విద్యార్థి కూర్చున్న సీటు తనకు ఇవ్వాల్సిందిగా మరో విద్యార్ధి బెదిరించాడు. దీనికి రఫీ తిరస్కరిచండంతో.. భోజన విరామం సమయంలో ఆ విద్యార్ధి స్నేహితులతో కలిసి వాష్‌రూమ్‌లో ఉన్న రఫీపై బ్లాడ్స్‌తో తీవ్రంగా దాడిచేశారు.
ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడడంతో.. పాఠశాల యాజమాన్యం అక్కడే ప్రథమ చికిత్సను అందించింది. తీవ్ర రక్తస్రవం అవ్వడంతో స్కూల్ యాజమాన్యం అతన్ని ఢిల్లీలోని ఎయియ్స్‌కి తరలించారు. విద్యార్థి వీపు భాగంలో బ్లేడ్‌తో తీవ్రంగా గాయపర్చడం వల్ల 35 కుట్లు వేసినట్ల ఎయియ్స్ వైద్యులు తెలిపారు. తనను విద్యార్థులు బెదిరిస్తున్నట్లు రఫీ పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన వారు పటించుకోలేదని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనలో పాల్గొన్న అందరూ మైనర్లే కావడం వల్ల పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment