భోపాల్: ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్‌లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు.
ప్రతిఘటించిన ఆమె ముఖంపై 10 సెంటీమీటర్ల మేర లోతైన గాటు పెట్టి బ్లేడుతో పలుచోట్ల దాడిచేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం శివరాజ్ ఆదేశించారు. బాధితురాలిని సీఎం పరామర్శించి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. మున్సిపల్ అధికారులు ఒక నిందితుని ఇంటిని కూల్చివేశారు.
अन्याय का प्रतिकार करना अन्य लोगों के लिए प्रेरणा का कार्य है, इस नाते बहन सीमा अन्य महिलाओं के लिए प्रेरक भी हैं। उनके बेटा और बेटी पढ़ते हैं और उनके सहयोग के लिए भी कलेक्टर भोपाल को आवश्यक निर्देश दिये हैं। pic.twitter.com/BXQ5ywPCxG
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 12, 2022
Comments
Please login to add a commentAdd a comment