
ఒక్కోసారి మనం ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు పిచ్చి ఆలోచనలు రావడం సహజం. ఉదాహరణకు మనం ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు.. లేదా భోజనం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ మన మీద పడుతుందేమో భ్రమపడతాం. అది మీద పడితే ఇక అంతే సంగతులు అని ఊహించుకుంటాం. ఒక్కోసారి ఇలాంటి భ్రమలు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. తాజాగా మనం చెప్పుకునే ఘటన అలాంటిదే.
చదవండి: రోడ్డు లేని ఊరు.. దారేది బాబు..!
ఇక విషయంలోకి వెళితే.. ఆ ఇంట్లో అంతా కలిసి ఆనందంగా భోజనం చేస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ హాయిగా భోజనం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న చిన్నపిల్లాడిపై ఒక్క ఉదుటన మీది నుంచి సీలింగ్ ఫ్యాన్ పడింది. దీంతో దెబ్బకు భయపడిపోయిన పిల్లాడి తల్లి తన బిడ్డను దగ్గరుకు తీసుకొని తలకు ఏమైనా అయిందా అన్నట్లుగా నిమిరింది. అయితే అదృష్టవశాత్తూ పిల్లాడి తల పక్క నుంచి ఫ్యాన్ పడడంతో పెద్ద గండం తప్పినట్లయింది. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది తెలియదు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ''వైరల్ హోగ్'' యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేశాడు. ఇంకేముంది షేర్ చేసిన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది.'' బుడ్డోడు బచాయించాడు.. అదృష్టం అంటే ఇదే..'' అంటూ క్యాప్షన్ జత చేశారు. మీరు ఈ వీడీయోను ఒక లుక్కేయండి.
చదవండి: Viral Video: తాబేలు వేట ఫస్ట్ టైం.. పాక్కుంటూ పిల్ల పక్షిని మింగింది
Comments
Please login to add a commentAdd a comment