శ్రమైక జీవనభాగ్యం
- పరవశించిన పారిశ్రామిక ప్రాంతం
- అడుగడుగునా జన హారతులు
- గాజువాక, పశ్చిమ నియోజకవర్గాలలో విజయమ్మ రోడ్‌షోకు అపూర్వ స్పందన
- ఎనిర్వాసిత కాలనీల నీరాజనం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పారిశ్రామిక ప్రాం తం పులకించింది. విజయమ్మ రాకతో పరవశించింది. ‘విశాఖ లోక్‌సభ బరిలో నిలిచి న తాను సదా మీ కందరికీ అందుబాటు లో ఉండి ప్రతి ఒక్క సమస్య పరిష్కారాని కి కృషిచేస్తా’నని విజయమ్మ ఇచ్చిన భరోసాతో ఆనందించింది. వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారంలో భాగం ఆదివారం విజయ మ్మ నిర్వహించిన వైఎస్సార్ జనభేరి రోడ్ షోకు జనం మద్దతు వెల్లువెత్తింది. ఈ సం దర్భంగా విజయమ్మ పారిశ్రామిక ప్రాంత ప్రగతికి వరాల వర్షం కురిపించారు.
అనునిత్యం అండగా ఉంటా
విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న రాజశేఖరరెడ్డి ఆశయాల కొనసాగింపుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల్ని విజయ మ్మ వివరించారు. బీహెచ్‌పీవీని చంద్రబా బు నాయుడు ప్రయివేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తే.. వైఎస్సార్ దాన్ని పరిరక్షించేం దుకు చేపట్టిన చర్యల్ని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్ విస్తరణకు వైఎస్సార్ కృషి ఎనలేనిదన్నారు.
మూడు వేల మంది నిర్వాసితులకు ఆయన చొరవ వల్లే ఉపాధి దక్కిన విషయం చెప్తూ.. మిగిలిన వారికి కూడా జగన్ ప్రభుత్వంలో ఉపాధి దక్కుతుందన్న భరోసా ఇచ్చారు. హౌస్ కమిటీ వివాద పరిష్కా రం వైఎస్సార్ మరణంతో ఆగిపోయిందని, జగన్‌బాబు పాలన లో దాన్ని పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ రూపకల్ప న, రోడ్లు, మౌలిక వసతుల ఏర్పాటు, రూ.40 వేల కోట్లతో హెచ్‌పీసీఎల్ ప్లాంట్ విస్తరణ తదితర ప్రతి అభివృద్ధి వైఎస్సార్ ముద్ర కనిపిస్తోంద ని, ఆయన మరణంతో కుంటుపడిన అభివృద్ధి జోరందుకోవాలంటే జగన్‌బాబును ఆశీర్వదించండంటూ ప్రజలను కోరారు. వైఎస్సార్‌పై ఇక్కడి ప్రజలకున్న అభిమానమే తనను ఇక్కడికి తీసుకొచ్చినట్టుందన్నారు. ఎంపీగా గెలిచాక ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
రోడ్ షో జరిగిందిలా..
గాజువాక నియోజకవర్గ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి వెంటరాగా.. షీలానగర్ నుంచి రోడ్ షో ప్రారంభమైంది. అక్కడి నుంచి నాతయ్యపాలెం, పాతగాజువాక, చినగంట్యాడ, శ్రీనగర్, వడ్లపూడి, కణితి కాలనీ, రాజులపాలెం, కూర్మన్నపాలెం జంక్షన్, రాజీవ్‌నగర అగనంపూడి నిర్వాసిత కాలనీ, కొండయ్యవలస, డొంకాడ, ఫార్మాసిటీ కాలనీ మీదుగా పెదగంట్యాడ వరకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు.
తిరిగి సాయంత్రం పశ్చిమ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్ వెంటరాగా జింక్ గేట్ నుంచి రోడ్ షో మొదలయింది. ఆంజనేయస్వామి గుడి, ములగాడ హౌసింగ్ కాలనీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ, బర్మా కాలనీ, దుర్గా టెంపుల్ రోడ్, ఇందిరా కాలనీ పార్క్ రోడ్, జనతా కాలనీ, అంబేద్కర్ కాలనీ, గుడివాడ అప్పన్నకాలనీ, త్రినాథపురం, క్రాంతినగర్, దుర్గానగర్, మల్కాపురం పోలీస్ స్టేషన్ రోడ్, నౌసేనాబాగ్, కల్యాణి ఆస్పత్రి రోడ్, మల్కాపురం మెయిన్ రోడ్, రామకృష్ణాపురం రోడ్, శ్రీహరిపురం మెయిన్‌రోడ్, నక్కవానిపాలెం రోడ్ మీదుగా గాజువాక డిపోతో పశ్చిమ నియోజకవర్గ రోడ్ షో ముగిసింది. అక్కడి నుంచి మళ్లీ గాజువాక నియోజకవర్గంలో విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. అనంతరం తూర్పుగోదావరి బయలుదేరారు.
విజయమ్మ వెంట పార్టీ నియోజకవర్గ అభ్యర్థులతోపాటు నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ ఆద్యంతం ఉండి, రోడ్ షో సంధాన కర్తగా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తిని మన కుటుంబంలో ఒకరిగా చేస్తూ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారని, దానికి ప్రతిఫలంగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో విజయమ్మను, పార్టీ అభ్యర్థులు తిప్పల నాగిరెడ్డి, దాడి రత్నాకర్‌ను గెలిపించాలని పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రోడ్ షోలో విజయమ్మతోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, సీఈసీ సభ్యులు భూపతిరాజు శ్రీనివాసరాజు, దామా సుబ్బారావు, అధికార ప్రతినిధి పీలా ఉమారాణి, మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బీసీసెల్ కన్వీనర్ పక్కి దివాకర్, ప్రచార కమిటీ కన్వీనర్ రవిరెడ్డి, మైనార్టీసెల్ కన్వీనర్ నౌషద్, ఉత్తరాంధ్ర మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు జి.వి.రవిరాజు, సత్తి రామకృష్ణారెడ్డి, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.