శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల కారణంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈ నెల 30న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పర్యటించనున్నారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజ యకృష్ణ రంగారావు సోమవారం తెలిపారు. గార, పోలాకి మండలాల తోపాటు శ్రీకాకుళం పట్టణంలో నీట మునిగిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించి బాదితులను పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు.
విజయవంతం చేయండి: కృష్ణదాస్
జిల్లాలో విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడంలోను, నష్టాలను అంచనా వేయటంలోను అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు.
వై.ఎస్.విజయమ్మ పర్యటన రేపు
Published Tue, Oct 29 2013 6:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement