విజయం నిశ్చయం:వైఎస్ విజయమ్మ | peoples are looking for ys jagan ruling | Sakshi
Sakshi News home page

విజయం నిశ్చయం:వైఎస్ విజయమ్మ

Published Thu, May 1 2014 3:56 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

విజయం నిశ్చయం:వైఎస్ విజయమ్మ - Sakshi

విజయం నిశ్చయం:వైఎస్ విజయమ్మ

 ప్రశాంతమైన వదనం....కల్మషం లేని హృదయం....ఆమె  చిరునవ్వు....
 అభాగ్యులకు భరోసా కల్పించింది.  కష్టాలకొలిమిలో కాలిపోతున్న జనాలకు ఆమె పలకరింపు మలయమారుతమై సుతారంగా తాకింది. కపటనేతల కుటిలయత్నాలపై ఆమె మాటల తూటాలను పేల్చారు. అబద్ధాల బాబు తొమ్మిదేళ్ల చీకటి పాలన గురించి సోదాహరణంగా వివరించారు. ఆమె వాగ్ధాటి, సంధించిన ప్రశ్నల శరాలు జన ప్రవాహంలో చైతన్య తరంగాలను సృష్టించాయి.  మరో వైపు ఆమె పర్యటన  వైఎస్‌ఆర్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రబోధాత్మక ప్రసంగం వారిలో కదనకుతూహలాన్ని రగిలించింది.  
 
మండుటెండలోనూ పోటెత్తిన జనాలను చూసిన ప్రత్యర్థుల  గుండెల్లో ఓటమి గుబులురేగింది. బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటించి, బహిరంగ సభల్లో ప్రసంగించారు. జిల్లాపై వరాల జల్లుకురిపించారు. అధికారంలోకి వచ్చినతరువాత చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. వైఎస్‌ఆర్ సీపీ విజయం నిశ్చయమని, ప్రజల కష్టాలు తీరే రోజులు మరెంత దూరంలో లేవని  భరోసా ఇచ్చారు.
 
 ప్రజా వాహిని కదిలింది విజయం మీదేనంటూ ప్రతీ గళం పలికింది మద్దతు మీకేనంటూ అడుగు అడుగునా అభిమానం కురిపిస్తూ మాట మాటకూ మహానేతను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రతి పల్లె పలకరించింది... ఆ ఆత్మీయ స్పర్శకు పులకరించి విజయ గీతిక ఆలపించింది.వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జిల్లాలోని పూసపాటిరేగ, గరివిడి, విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి చోటా అభిమానం ఆమెపై పూల వానై కురిసింది. ఆమె మాట్లాడిన ప్రతిచోటా ప్రజా స్పందన మిన్నంటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement