రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక నాయకుడు ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అని వైఎస్సార్ సీపీ నేత షర్మిల స్పష్టం చేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఏ రోజూ కూడా ఒక్క ఛార్జీ కూడా పెరగలేదని సంగతి ఆమె గుర్తు చేశారు. ప్రజల పట్ల అంత నిబద్ధత పనిచేస్తూ ఆయన పాలన సాగించారన్నారు. ఆయన మరణం తరువాత పేదలకు మంజూరైన ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా అలసత్వం ప్రదర్శించిదని మండిపడ్డారు. రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో ఆటలాడుకుందన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన విపక్షం టీడీపీ వారితో కుమ్మక్కై ప్రజలను మోసం చేసిందని షర్మిల అన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలకపక్షంతో డ్రామాలాడారన్నారు. ప్రజా సమస్యల కోసం ఎవరైనా పోరాడింది అంటే అది వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ప్రజల కోసం జగనన్న నిరంతరం నిరహారదీక్షలు చేశారన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు.