Janabheri
-
వైఎస్ఆర్ సిపి నాయకుల ప్రచారం
-
'చెప్పిన పనులే కాదు... చెప్పనవి కూడా చేస్తా '
కర్నూలు: రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్దానాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అబద్దపు హామీలిస్తున్నారని అన్నారు. మన రాష్ట్ర బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లయితే.. రూ.1.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, మద్యపాన నిషేధంను ఎత్తివేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం కర్నూలు జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు. కర్నూలు జిల్లా నుంచి మొట్టమొదటి ఎమ్మెల్సీ అభ్యర్థి అవకాశం ముస్లింకి ఇస్తానని ఆయన హామీయిచ్చారు. ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా, ఢిల్లీకి సాగిల పడే ప్రభుత్వం కావాలా అని ఆయన అడిగారు. చంద్రబాబు మోడీకి ఓటు వేయమంటున్నారని, తాను తెలుగుజాతి భవిష్యత్ కోసం ఓటు వేయమంటున్నానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రం దశ-దిశ మార్చే ఆరు పనులు చేస్తానని హామీయిచ్చారు. చెప్పిన పనులే కాకుండా.. చెప్పనవి కూడా చేస్తానని జగన్ అన్నారు. -
జ(గ)న సంద్రం
-
వట్లూరు జనభేరిలో జగన్ ప్రసంగం
-
'ఆ క్షణం జగన్‌ను చూసి గర్వ పడ్డా'
-
వైఎస్ఆర్ జనభేరి సభలు
-
తండ్రి మాటే బాటగా.. ఆశయ సాధనే లక్ష్యంగా..
-
విశాఖ జనభేరిలో జగన్ ప్రసంగం
-
ప.గో. జిల్లాలో షర్మిల జనభేరి
-
జగన్ రాకతో జన సంద్రమైన సాగర తీరం
-
'విభజన పాపం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలదే'
-
తూ.గో. జిల్లాలో వైఎస్ జగన్ జనభేరి
-
ఎర్రటి ఎండలో.. ఆలస్యమైనా కూడా.. అంతే ఆప్యాయంగా..
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రభంజనం
-
'నిజాయితీ ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు'
మైలవరం: ఏ నాయకుడైతే పేదవాడి కష్టాలను తెలుసుకుంటాడో ఆ నాయకుడినే మన నేతగా ఎన్నుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్ షోలో జగన్ ప్రసంగించారు. విశ్వసనీయత, నిజాయతీ ఓ వైపు ఉంటే కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే 5 సంతకాలతో పాటు మరో 6 పనులు చేస్తానని ఆయన హామియిచ్చారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని చెప్పారు. అవ్వాతాతల కోసం రెండో సంతకం చేస్తానని వెల్లడించారు. రైతన్నకు భరోసా ఇస్తూ మూడో సంతకం పెడతానని అన్నారు. వ్యవసాయరంగంలో గొప్ప మార్పులు తెస్తానని చెప్పారు. అక్కా, చెల్లెళ్ల కళ్లల్లో సంతోషం కోసం నాలుగో సంతకం చేస్తానని అన్నారు. ఇల్లు, కార్డులేని నిరుపేదల కోసం 5వ సంతకం పెడతానని హామీయిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు తెస్తానని, ఏ గ్రామంలో కూడా బెల్టుషాపు లేకుండా చేస్తానని వైఎస్ జగన్ హామీయిచ్చారు. -
'బాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే..'
-
'బీజేపీ, టీడీపీలు ఊసరవెల్లి పార్టీలు'
-
'చెడిపోయిన రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోంది'
తిరువూరు : తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్ శుక్రవారం తిరువూరు నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారని, ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి వీరు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలరా సూటిగా ప్రశ్నించారు. ఆరోజు మీకు పోలవరం ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్, హంద్రీనీవా ప్రాజెక్ట్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నలు సంధించారు. మన రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉంటే.. ఇంటింటికి ఉద్యోగం ఎలా ఇస్తావు చంద్రబాబు అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు మనమే గెలుచుకుని మోడీ ప్రధాని కావాలా? మరొకరు కావాలా? అనేది మనమే నిర్ణయిద్దామని జగన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 9ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హామీనైనా అమలు చేశారని అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రూ.2 కిలో బియ్యాన్ని రూ.రూ.5.25 చేసింది చంద్రబాబేనని, ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి...ఎన్నికల తర్వాత ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు తీసుకొచ్చింది ఆయనేనని జగన్ గుర్తు చేశారు. రామరాజ్యం అయితే తాను చూడలేదని...వైఎస్ఆర్ సువర్ణయుగం చూశానని వైఎస్ జగన్ అన్నారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్ధం లేకుండా పోయిందన్నారు. రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలని ఆయన పేర్కొన్నారు. మొన్నటివరకు తెలంగాణలో తిరుగుతూ తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ చెప్పుకొన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు.. అక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి రాత్రే మాట మార్చి విభజనకు కారణం జగనే అంటున్నారని, చెడిపోయిన ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
మోడీ మాటలన్నీ గ్యాసే
* మన గ్యాస్‌లో మనకు వాటా ఇవ్వరుగానీ.. మన గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తారట * కృష్ణా జిల్లా ‘వైఎస్సార్ జనభేరి’లో జగన్ * రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి బీజేపీ నేతలు, చంద్రబాబు పూర్తిగా మద్దతిచ్చారు * రాష్ట్రాన్ని విభజించింది తామేనంటూ మొన్నటిదాకా తెలంగాణలో ఓట్లడిగారు * తెలంగాణలో ఎన్నికలైన రాత్రికి రాత్రే మాట మార్చి.. విభజన కారకుడు జగనేనంటున్నారు * వాళ్ల మాటలతో చాలా బాధ అనిపించింది * 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారు * ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటేఒక్క మేలు ఏంటో చెప్పగలరా? ‘వైఎస్సార్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: బీజేపీ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి రాష్ట్ర విభజనకు పూర్తిగా మద్దతిచ్చి.. ఇప్పుడు స్వర్గాన్ని తెచ్చి సీమాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారని, ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి వీరు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలరా సూటిగా ప్రశ్నించారు. మొన్నటివరకు తెలంగాణలో తిరుగుతూ తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ చెప్పుకొన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు.. అక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి రాత్రే మాట మార్చి విభజనకు కారణం జగనే అంటున్నారని, చెడిపోయిన ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నిన్న తిరుపతి సభలో నరేంద్ర మోడీ గ్యాస్ గురించి మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ లో.. కనీసం మన రాష్ట్రానికి ఎంత గ్యాస్ కోటా ఇస్తారని మోడీని అడుగుతున్నా. ఆ మాట మాట్లాడరు. కానీ మన వనరులతో దేశాన్ని బాగుపర్చుతామంటున్నారు. ఇటువంటి దొంగ ప్రేమ చూపిస్తున్నారు’’ అని తూర్పారబట్టారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్ గురువారం పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. బంటుమిల్లి నుంచి మొదలైన వైఎస్సార్ జనభేరి సింగరాయపాలెం మీదుగా కైకలూరు అక్కడి నుంచి విజయవాడ వరకు సాగింది. దారిపొడవునా ఆయన వృద్ధులను, యువకులను, మహిళలను పలకరిస్తూ ముందుకు సాగారు. బంటుమిల్లి, కైకలూరులలో జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆయా సభల్లో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. తెలంగాణలో ఎన్నికలవగానే మాట మార్చేశారు ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాజకీయాలు చెడిపోయాయి. ఓట్లు, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా వెనుకాడడంలేదు. ఒక బంగారం లాంటి రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చడానికి కూడా వెనుకాడడంలేదు. రాష్ట్రాన్ని సోనియాగాంధీ అడ్డగోలుగా విడగొట్టారు. అలా విడగొడుతుంటే ఇదే చంద్రబాబు, ఇదే బీజేపీ వీరిద్దరూ కూడా రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయమని చెబుతూనే.. మరోవైపు వీళ్లే పార్లమెంటులో వీళ్ల ఎంపీల చేత విభజనకు అనుకూలంగా ఓట్లు వేయించారు. తర్వాత బీజేపీ నాయకులు తెలంగాణకు వెళ్లి.. ‘పెద్దమ్మ సోనియాగాంధీ ఒకరేకాదు.. చిన్నమ్మను నన్ను కూడా గుర్తుపెట్టుకోండి.. నేను మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర విభజన జరిగేది కాదు’ అని అన్నారు. ‘మేమిచ్చిన ఆ లేఖతోనే రాష్ట్ర విభజన జరిగింది.. లేకుంటే విభజన జరిగేది కాదు’ అని తెలంగాణ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చంద్రబాబు అన్నారు. 30వ తేదీన అక్కడ ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయి గంట కూడా గడవక ముందే మోడీ, చంద్రబాబు రాత్రి ఏడుకల్లా తిరుపతిలో మీటింగ్ పెట్టారు. రాష్ట్రాన్ని విభజించింది వైఎస్ఆర్సీపీ అని నిస్సిగ్గుగా మాట్లాడారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు.. నిన్న తిరుపతిలో అవినీతి గురించి మాట్లాడారు. కేసుల గురించి చెప్పారు. వీళ్లందరినీ నేను ఒకటే అడుగుతున్నా. వైఎస్ బతికున్నంత వరకు ఆయన్ను మించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. వైఎస్ చనిపోయి 18 నెలలు అయ్యాక జగన్ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి విడిపోయిన రెండు నెలల తర్వాత.. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్లతో ఇదే చంద్రబాబు కుమ్మక్కై కోర్టుల దాకా వెళ్లి కేసులు వేసింది వాస్తవం కాదా? చంద్రబాబు, కాంగ్రెస్ నాలుగేళ్లుగా కుమ్మక్కయ్యారు. సీబీఐ జగన్ మీద విచారణ చేస్తోంది. ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో చంద్రబాబును మాత్రం కనీసం పిలువలేదు. చంద్రబాబుకు ఒక న్యాయం... జగన్‌కు మరో న్యాయం. ఆ మూడు రాష్ట్ర్రాలకూ ఏం చేశారు? బీజేపీని నేను ఒకటి అడగదలచుకున్నా.. 1999-2000 సంవత్సరంలో మీరు చిన్న రాష్ట్రాలకు అనుకూలమని జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్లను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రాయపూర్ను, జార్ఖండ్‌లో రాంచీని మహానగరాలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌ను కూడా అలాగే మహానగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నా.. ఆ మూడు రాష్ట్రాలకు వెళ్లి చూసిరండి. ఆ మూడు రాష్ట్రాల్లో కనీసం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. ఎయిమ్స్ తరహా, నిమ్స్ తరహా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదన్న సంగతి వీళ్లకి తెలుసా? 1999లో ఈ రాష్ట్రాలను వేరు చేసినప్పుడు ఇదే ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ నగరానికి రూ. 10 వేల కోట్లు ఇస్తామన్నారు. కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి, కొత్త మహానగరాన్ని నిర్మించుకోవడానికి ఇస్తామన్నారు. విడదీశాక బీజేపీ నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వీరు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా... ముష్టివేసినట్లు రూ. 400 కోట్లు మాత్రమే. ఇప్పుడు మాత్రం చిన్న రాష్ట్రాలు గొప్పగా ఉంటాయని, అది చేస్తాం.. ఇది చేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.’’ కొల్లేరుపై తొలి అసెంబ్లీ భేటీల్లోనే బిల్లు ‘‘2008లో వైఎస్ఆర్ ఇంతకుముందు ఎవరూ చేయని సాహసం చేశారు. అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. కొల్లేరును కాంటూరు +5 నుంచి కాంటూరు +3కు తగ్గిస్తూ తీర్మానం చేసి పంపారు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయారు. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా నా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇది పెడతాను. కొల్లేరు కాంటూరును మరోసారి +5 నుంచి +3 కి తగ్గిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తా. మనకు 25 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనమే ప్రధానిని నిర్ణయిస్తే ఈ సమస్యను రెండేళ్లలో పరిష్కరిస్తా. పార్టీ నాయకుడు దూలం నాగేశ్వరరావుకు నా గుండెల్లో స్థానం ఉంది. ఈ జిల్లా నుంచి మొదటి ఎమ్మెల్సీగా ఆయన్ను తీసుకెళ్తాను.’’ ‘‘ బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్.. వీళ్లెవరికి మన మీద ప్రేమ లేదు. వీళ్లకు కావాల్సిందల్లా ఓట్లు, సీట్లు మాత్రమే. ఓట్లు, సీట్ల కోసం వీరు ఏ అబద్ధమైనా ఆడతారు.. ఏ గడ్డి అయినా తింటారు. కాబట్టి వీళ్లనెవరినీ నమ్మొద్దు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలున్నాయి. ఒక్క సీటు కూడా పక్కకు పోకుండా 25 సీట్లను మనమే తెచ్చుకుందాం. ప్రధానిగా ఎవరిని కూర్చోబెట్టాలో మనమే నిర్ణయిద్దాం. బీజేపీనా.. ఇంకొకరా అనేది ఆ రోజు 25 మంది ఎంపీలతో దగ్గరుండి మనమే నిర్ణయిద్దాం. మన రాష్ట్ర అభివృద్ధిని మనమే నడుపుదాం.’’ టీడీపీ-బీజేపీ ఆ ఐదేళ్లలో చేయలేదేం? అదే తిరుపతి వేదిక మీద ఆ పెద్ద మనుషులు బీజేపీ-చంద్రబాబు కలిస్తే అలాఅలా స్వర్గాన్ని కిందకు తీసుకొస్తామని కూడా చెప్పారు. నేను చంద్రబాబును, బీజేపీని అడగదలచుకున్నా. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటేఒక్క మేలు ఏంటో చెప్పగలరా? రాష్ట్రం అంతా వెయ్యి కిలోమీటర్ల తీరం ఉందని, చంద్రబాబుకు ఓటెయ్యాలని, ఆయన గొప్పగా బాగు పరుస్తారని మోడీ చెబుతున్నారు. 1999 నుంచి 2004 వరకు మీరు కలిసి ఉన్నపుడు అప్పుడు మీకు ఈ వెయ్యి కిలోమీటర్ల తీరం కనిపించలేదా? ఆ రోజు తీరం ఉంది... ఈరోజు తీరం ఉంది. ఆ రోజు చేయలేని అభివృద్ధి ఈ రోజు చేస్తామని ఓట్ల కోసం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుగాని, గాలేరు-నగరి లాంటి రాయలసీమ ప్రాజెక్టులుగాని పూర్తి చేయాలని ఆ ఐదేళ్లలో మీకెందుకు అనిపించలేదు? - వైఎస్ జగన్మోహన్రెడ్డి -
'వైఎస్ఆర్ పథకాలన్నీ అద్భుతంగా చేసి చూపిస్తాం'
గుంటూరు: వైఎస్ఆర్ పాలనలో ఏ ఛార్జీ పెరగలేదని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా పెదకాకానిలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. చంద్రబాబు పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. వైఎస్ పాలనలో కరెంట్ ఛార్జీలు పెరిగాయని ఏ ప్రతిపక్షపార్టీ కూడా ఆరోపించలేదని తెలిపారు. వైఎస్ఆర్ పథకాలకు తూట్లు పొడవటమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగిందని విమర్శించారు. సర్‌ఛార్జీల పేరుతో రూ.32 వేల కోట్ల కరెంట్ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. ఐదేళ్లూ జగనన్న ప్రజల పక్షానే పోరాడారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి కాంగ్రెస్ సర్కార్‌ను చంద్రబాబు కాపాడారని చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించే ధైర్యం చేసిదంటే చంద్రబాబు లేఖే కారణమన్నారు. మామనే వెన్నుపోటు పొడిచిన ఘనడు చంద్రబాబు అన్నారు. 10 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు ప్రజల పక్షాన పోరాడానని చెప్పుకునే ధైర్యం లేదన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ పథకాలన్నీ అద్భుతంగా చేసి చూపిస్తామన్నారు. వైఎస్ పథకాలనే అమలు చేస్తానంటూ సిగ్గులేకుండా చంద్రబాబు తిరుగుతున్నాడని షర్మిల ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు తనవి అనుకున్నది జగనన్నే అని చెప్పారు. రోజుల తరబడి నిరాహారదీక్షలు చేసింది జగనన్నే అని షర్మిల తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ జనభేరి
-
జనం మెచ్చిన నేత కోసం.. ఎండైనా, వానైనా..
-
విజయనగరం జిల్లాలో విజయమ్మ జనభేరి
-
ఆ 48 గంటలు
-
తలరాతను మార్చే ఎన్నికలివి
* జనమంతా ఏకం కావాలి.. మనసు తెలుసుకునే నాయకుడినే ఎన్నుకోవాలి * కృష్ణా జిల్లా ప్రచారంలో వైఎస్ జగన్ * అధికారం కోసం చంద్రబాబు అన్నీ ఫ్రీగా ఇస్తానని అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు * తొమ్మిదేళ్లు సీఎంగా ఉండీ ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావని ఆయనను నిలదీయండి * ఎన్నికల తర్వాత బాబు ఉండడు, ఆయన పార్టీ ఉండదు.. అందుకే గడ్డి తినడానికీ వెనుకాడట్లేదు * ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ.. మరొకవైపు కుళ్లు, కుతంత్రాలు ఉన్నాయి.. వాటి మధ్య పోటీ * ఇప్పుడు మీరంతా ఏకం కావాలి... వైఎస్ కలలుకన్న సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం * చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు వైఎస్సాఆర్ జనభేరి సభల్లో జగన్మోహన్రెడ్డి పిలుపు వైఎస్సార్ జనభేరి సభ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవి మన తలరాతను మార్చబోయే ఎన్నికలు. అందువల్ల ఓటు వేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎటువంటి నాయకుడు మనకు కావాలి? ఎటువంటి ముఖ్యమంత్రి కావాలి? అనేది మనం ప్రశ్నించుకోవా లి. ఏ ముఖ్యమంత్రి అయితే ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో, వాళ్ల మనస్సు తెలుసుకుంటాడో.. ఏ నాయకుడైతే చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండేందుకు ఆరాటపడతాడో.. అటువంటి వ్యక్తిని మనం మన నాయకుడిగా ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తిని మనం మన సీఎంగా ఎన్నుకోవాలి. అప్పుడే మన తలరాతలు మంచిగా మారతాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వేసే ఓటుతో మన తలరాతను మార్చుకోబోతున్నాం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం... ఆయన తరువాత కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం... కానీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రం ఇప్పటికీ ప్రతి పేదవారి గుండెల్లో ఉండిపోయారు. రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతీ పేదవాడికి కూడా మంచి చేసిన మహానుభావుడు వైఎస్సార్. ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. వైఎస్సార్ పరిపాలనకు ముందు.. ఇప్పుడు జరుగుతున్న పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలి’’ అని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ బుధవారం కృష్ణా జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. ముందుగా ఉదయం చల్లపల్లిలో రోడ్‌షో నిర్వహించి అనంతరం అక్కడ జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో మాట్లాడారు. సాయంత్రం ఏడున్నర గంటలకు పామర్రులో, రాత్రి ఉయ్యూరులో జరిగిన సభల్లోనూ మాట్లాడారు. జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... చంద్రబాబును నిలదీయండి... చంద్రబాబూ..! తొమ్మిదేళ్లు సీఎంగా పరిపాలన చేశావు... ఇవాళ అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నావు... మరి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఒక్కటంటే ఒక్కటి ఎందుకు చేయలేకపోయావు? అని గట్టిగా నిలదీయండి. ఎందుకయ్యా ఇలా అబద్ధాలు ఆడతావు? అని ప్రశ్నించండి. ఎప్పుడైనా కాలేజీలకు వె ళ్లావా? వారెలా చదువుతున్నారో తెలుసుకున్నావా? అని అడగండి. తొమ్మిదేళ్లు సీఎంగా వుం టూ పేదోడి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ. 30 వేలు ఖర్చవుతుంది. ఆ రూ. 30 వేలు కట్టాలంటే పొలమో ఇల్లో అమ్ముకుంటే తప్ప చదివించలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా చంద్రబాబూ? అంటూ ప్రశ్నించండి. చంద్రబాబునాయుడు హయాంలో ఏ పేదవాడికైనా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, క్యాన్సర్ వచ్చినా ఆ పేదవాడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వుండేది. డాక్టర్ దగ్గరకు వెళితే రూ. 2 లక్షలో... రూ. 3 లక్షలో అవుతుందని డాక్టర్ చెప్పినప్పుడు రెండు రూపాయలో.. మూడు రూపాయలో.. నాలుగు రూపాయలో వడ్డీలకు తెచ్చినప్పుడు నీవు ఏమి చేశావు చంద్రబాబూ? అని నిలదీయండి. ఎన్నికలకు వెళ్లేముందు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని చెప్పావు... ఎన్నికలు అయిపోయాక ఇదే రెండు రూపాయల బియ్యాన్ని ఐదుంపావలా చేయలేదా చంద్రబాబునాయుడూ? అని ప్రశ్నించండి. ఏ రోజైనా ఆయన గ్రామాల్లోకి వెళ్లాడా అని అడగండి. ఎన్నికలకు వెళ్లేముందు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పా వు.. ఎన్నికలు అయిపోయాక చెల్లెమ్మలతో తనకేం పని ఉందని చెప్పి.. మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని ‘ఈనాడు’ దినపత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించావు. ఆ రాయించిన మూడు రోజుల్లోనే ప్రతి గ్రామంలో బెల్టుషాపులు తెచ్చింది నీవు కాదా? అని చంద్రబాబును నిలదీయండి. ఒకవైపు సోనియాగాంధీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తుంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండి సోనియాను నిలదీయాల్సింది పోయి.. ఒకవైపు అన్యాయం జరుగుతుందని చెప్తూ మరోవైపు ఆయన తన ఎంపీల చేత పార్లమెంటులో సోనియాకు అనుకూలంగా విభజనకు అనుకూలంగా ఎందుకు చంద్రబాబు ఓటేయించాడని నిలదీయండి. విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను... చంద్రబాబునాయుడు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు. విశ్వసనీయత లేని మాటలు మాట్లాడుతున్నాడు. నిజాయితీ లేని తన మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఒక రోజు సెల్ఫోన్లు ఫ్రీగా ఇస్తానని చెప్తాడు. రెండో రోజు టీవీలు ఫ్రీగా ఇస్తానంటాడు. మూడో రోజు సాధ్యంకాని రూ. 1.27 లక్షల కోట్ల రైతు రుణాలు మాఫీ అంటాడు. మరో రోజు మీరెవరూ ఇంటినుంచి బయటకు రావొద్దు.. మీ ఇంటికే అన్నీ ఫ్రీగా ఇస్తానని చంద్రబాబునాయుడు చెప్తున్నాడు. చంద్రబాబునాయుడు సాధ్యంకానివి, చేయలేనివి చెప్తూ అబద్ధాలు చెప్తూ రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో కొందరు నా వద్దకు వచ్చి.. ‘అన్నా... చంద్రబాబు అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నాడు.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అంటున్నాడు.. మనం కూడా ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తామని ప్రజలకు చెప్దాం...’ అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ ఒక్కటైతే నేను చెప్తా... చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడలేను. ఆయనలా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. నేను ఒక మాట చెప్తే ఆ మాట కోసం నిలబడతాను. నాకు వైఎస్ నుంచి వచ్చిన వారసత్వం విశ్వసనీయత... చంద్రబాబు ఎందుకు విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నాడంటే.. ఆయనకు 65 ఏళ్లు. ఈ ఎన్నికలు అయిపోయాక ఆయనుండడు.. ఆయన పార్టీ ఉండదు.. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే అడ్డగోలుగా అధికారం కోసం ఏ గడ్డైనా తినడానికి వెనకాడటం లేదు. ఆయనలా నేను విశ్వసనీయతలేని, నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. ఎందుకంటే చంద్రబాబునాయుడు కంటే పాతిక సంవత్సరాల చిన్నోడిని. మరో ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేయాలి. విశ్వసనీయత అన్న పదం మీద రాజకీయాలు చేయాలి కాబట్టి అబద్ధాలు చెప్పలేను. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నుంచి నాకు వచ్చిన వారసత్వం ఏదైనా ఉందంటే అది విశ్వసనీయత. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. దీంతో పాటు అదనంగా ఆరు పనులు చేపట్టబోతున్నాను. ఈ పదకొండు పనులతో ఈ రాష్ట్ర దశ, దిశ మార్చుతాను. ఆ దేవుడు అనుగ్రహిస్తాడు.. చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తాను.’’ దిగజారిపోయిన వ్యవస్థ.. దివంగత నేత ఎప్పుడూ అంటూ ఉండేవాడు. రాజకీయం అన్నది ప్రతీ పేదవాడి గుండె చప్పుడు వినడం అని ఆయన అనేవారు. రాజకీయం అన్నది చనిపోయిన తర్వాత కూడా ప్రతీ పేదవాడి గుండెల్లో బతికే ఉండటం కోసం ఆరాటపడడమే రాజకీయమని ఆయన అంటూ ఉండేవారు. కానీ ఈరోజు రాజకీయం అన్నది ఒక చదరంగంలా తయారుచేశారు. ఓట్ల కోసం సీట్ల కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనకాడడంలేదు. ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా వెనకాడడంలేదు. ఓట్ల కోసం సీట్ల కోసం ఒక మనిషిని ఎలా తప్పించాలి అని ఆలోచన చేస్తున్నారు. ఒక మనిషి లేకుండా ఒక పార్టీ లేకుండా ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నారు. అన్యాయంగా కేసులు పెట్టి ఒక మనిషిని జైలు పాలు చేయడానికైనా వెనుకాడడంలేదు. బంగారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభ జించడానికి వెనుకాడడంలేదు. దిగజారిపోయిన వ్యవస్థ కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. వైఎస్ పరిపాలనకు ముందు.. ఇప్పుడు జరుగుతున్న పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలి. రైతులతో బాబు ఆడుకుంటున్నాడు.. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు. మరి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసి రుణాల మాఫీ దేవుడెరుగు.. వడ్డీల మాఫీ అయినా చేయలేదేం? అది సాధ్యంకాదు కాబట్టి చేయలేదు. రైతు రుణాలు మాఫీ అంటాడు.. డ్వాక్రా రుణాల మాఫీ అంటాడు. మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల రుణాలు మా ఫీ అంటాడు. మన బడ్జెట్లో మనకొచ్చే ఆదాయాలు కేవలం రూ. 1.25 లక్షల కోట్లుంటే చంద్రబాబు 1.5 లక్షల కోట్ల రుణా లు మాఫీ చేస్తానంటున్నాడు. ఇలా పట్టపగలు అబద్ధాలు ఆడుతున్నాడు. ఇటువంటి దొంగ వాగ్దానం చేస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత రైతన్నలు బ్యాంకుల వద్దకు రుణాల కోసం వెళ్తారు. మీరు కట్టాల్సి రుణాలు ఇంకా ప్రభుత్వం కట్టలేదు కాబట్టి మీకు కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకుల వారు చెప్తారు. అప్పుడు ఆ రైతన్న పరిస్థితి ఎంత అన్యాయంగా ఉంటుందో ఆలోచించాలి. ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా..? చంద్రబాబు ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తానంటున్నాడు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి 65 ప్రభుత్వ సంస్థలను మూసివేయించి 26 వేల మందిని నడిరోడ్డు మీదకు నెట్టాడు. రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉంటాయో చంద్రబాబుకు తెలుసా? రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. స్వాతంత్య్రం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఆయనకు తెలుసా? రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటిది మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పట్టపగలు అబద్ధాలు ఆడుతున్నాడు.’’ వైఎస్ కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం చంద్రబాబు పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అలాగే దివంగత నేత వైఎస్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి. కృష్ణా జిల్లాలో వ్యవసాయం అన్నది కీలకమైంది. చంద్రబాబు హయాంలో మన కళ్ల ఎదుటే ఆల్మట్టి నిర్మాణం మొదలుపెట్టింది. మన కళ్ల ఎదుటే కృష్ణా ప్రాంతానికి సంబంధించి ఒక పంట వేయడానికి కూడా రైతన్నలు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. దివంగత నేత వైఎస్ సువర్ణయుగంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వ్యక్తి. చంద్రబాబునాయుడిలా అబద్ధాలు చెప్తూ నిజాయితీ లేని విధంగా వ్యవహరించలేను. మాట కోసం ఎందాకైనా పోయే విశ్వసనీయత పాలన కావాలా లేదా ఆలోచన చేయండి. ఈ రోజు ఎన్నికల్లో ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీ ఉన్నాయి. మరో వైపు కుళ్లు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఈ పరిస్థితిలో మీరంతా ఒకటి కావాలి. దివంగత నేత కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం. -
గుంటూరు జిల్లా గురజాలలో షర్మిల జనభేరి
-
ఒక్క అవకాశం ఇవ్వండి..వైఎస్ షర్మిల
‘చంద్రబాబు హయాంలో ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించండి... వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఎలా ఉన్నారో గుర్తుకు తెచ్చుకోండి...మీ కష్టాలన్నీ తెలిసిన వాడు.. వాటిని తీర్చేవాడు జగనన్న. ఓటేసేముందు గుండెలపై చేయి వేసుకుని రాజన్నను గుర్తుకు తెచ్చుకోండి.. ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటేసి రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డిని గెలిపించి జగనన్నను సీఎం చేయండి. ఒక్క అవకాశం ఇవ్వండి.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. - వైఎస్ షర్మిల జగనన్న గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు .. రాజంపేట, సుండుపల్లి జనభేరిలో వైఎస్ షర్మిల షర్మిలను చూసేందుకు పోటెత్తిన జనం టీడీపీ, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగిన షర్మిల రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నకు అండగా నిలవాలని పిలుపు మిథున్‌రెడ్డి, అమర్నాథరెడ్డిని గెలిపించాలని వినతి షర్మిల రాకతో సుండుపల్లిలో పండుగ వాతావరణం సాయంత్రం నుంచి డప్పులు, డ్యాన్స్‌లతో వైఎస్సార్సీపీ శ్రేణుల సందడి సాక్షి, కడప: వైఎస్సార్కాంగ్రెస్పార్టీ జనభేరిలో భాగంగా వైఎస్ షర్మిల రాజంపేట, సుండుపల్లిలో సోమవారం పర్యటించారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని రైల్వేకోడూరు మీదుగా సాయంత్రం 5.06 గంటలకు రాజంపేటకు చేరుకున్నారు. షర్మిలరాకకోసం 3గంటల నుంచి రాజంపేట నాలుగురోడ్లకూడలిలో జనాలు వేచిఉన్నారు. షర్మిలరాగానే ఈలలు, కేకలతో సందడి చేశారు. మహిళలు భారీగా తరలివచ్చారు. మిద్దెలపైకి నిల్చుని షర్మిల ప్రసంగాన్ని ఆలకించారు. యువకులు మిద్దెలు, హోర్డింగులపై నిల్చున్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలు ఎలా కష్టపడ్డారో...ఎంత నరకం అనుభవించారో...ప్రజలను చంద్రబాబు ఎంత చులకనగా చూశారో షర్మిల ఉదాహరణలతో వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవారో గుర్తు చేశారు. ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని ఐదేళ్లలో చక్కెర నుంచి గ్యాస్ దాకా....ఆర్టీసీ చార్జీల నుంచి కరెంటు చార్జీల వరకూ ఒక్కసారి కూడా పెంచకుండా ప్రజారంజక పాలనను అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందని కొనియాడారు. ప్రజలపై భారం లేకుండానే సంక్షేమపాలన అందించి రికార్డు సీఎంగా కీర్తిగ డించారన్నారు. వైఎస్‌లాగే జగన్ కూడా ప్రజలను కంటికిరెప్పలా చూసుకుంటారని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే అమలు చేసే కార్యక్రమాలను వివరించారు. డ్వాక్రా రుణాలమాఫీ, రైతులకోసం 3వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి, కరువునివారణకోసం 2వేల కోట్లతో ప్రత్యేకనిధి, అమ్మ ఒడి ద్వారా ప్రతి నెలా ఒక్కోబిడ్డకు నెలకు 500రూపాయల చొప్పున తల్లిఖాతాలో డబ్బులు జమచేయడం వంటి పలు కార్యక్రమాలను వివరించారు. చంద్రబాబు, వైఎస్ పాలన మధ్య వ్యత్యాసాలను చెబుతున్నపుడు సావధానంగా విన్న జనాలు..జగన్ సీఎం అయితే చేయబోయే కార్యక్రమాల వివరించినప్పుడు ఈలలు, కేకలతో హోరెత్తించారు. వైఎస్ ప్రవేశపెట్టిన 108 గురించి చెబుతూ ‘కుయ్...కుయ్..కుయ్’ అని షర్మిల అన్నపుడు వైఎస్‌ను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ అభివాదం చేసేసమయంలో చెయ్యితిప్పడం, మాట్లాడటం చూసి అచ్చం వాళ్లనాయనలాగే ఉంది’అని మహిళలు చర్చించుకున్నారు. రాజంపేటలో ప్రచారం ముగించుకుని షర్మిల 5.37గంటలకు సుండుపల్లికి బయలుదేరారు. రాజంపేటలో రాయచోటిరోడ్డులోని వీధుల్లో షర్మిలను చూసేందుకు జనం ఎగబడ్డారు. సుండుపల్లిలో పండుగవాతావరణం షర్మిలరాకతో సుండుపల్లిలో పండుగవాతావరణం నెలకొంది. సాయంత్రం 5గంటల నుంచే సుండుపల్లిరోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. డప్పుల వాయిద్యాలు, అభిమానుల నృత్యాలు, విన్యాసాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సందడి చేశారు. షర్మిల సుండుపల్లికి చేరుకోగానే ఈలలు, కేకలతో హోరెత్తించారు. తనకు అపూర్వస్వాగతం పలికి, అభిమానం చూపించిన సుండుపల్లి వాసులకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. సుండుపల్లి నుంచి అనుంపల్లి, శిబ్యాల, చలంపల్లి, రాయచోటి మీదుగా కడపకు వెళ్లారు. అక్కడి నుంచి పోరుమామిళ్లకు చేరుకుని కొమ్మరోలు సమీపంలో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పర్యటనకు వెళతారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరె డ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
మూడు వారాల్లో వైఎస్ సంక్షేమ రాజ్యం
పాడేరు, అరకు, కొత్తవలస బహిరంగ సభల్లో వైఎస్ విజయమ్మ సాక్షి, విశాఖపట్నం/శృంగవరపుకోట, న్యూస్‌లైన్: ‘‘మరో మూడు వారాలు ఆగండి. కష్టాలు పడుతున్న మీ అందరికి మీ మనవడు పింఛన్లు అందిస్తారు. వృద్ధులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 చొప్పున ఇస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని తీసుకువస్తారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. జగన్ కూడా రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తారు. జగన్ వైఎస్‌లా మంచి నాయకుడు. మనసున్న నేత. జగన్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో అయిదు సంతకాలు చేస్తారు. అవి రాష్ట్ర చరిత్రనే తిరగరాస్తాయి. కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి మీరంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. చంద్రబాబు మీ అందరినీ నమ్మించడానికి కల్లబొల్లి హామీలు ఇస్తున్నారు. వాటిని నమ్మకండి. విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే. ఆయన ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇవ్వబట్టే ఈరోజు రాష్ట్రం ముక్కలైంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఎన్నికల ప్రచారంలో విజయమ్మ పాల్గొన్నారు. పాడేరు, అరకు, కొత్త వలస బహిరంగ సభల్లో ప్రసంగించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో, విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన రోడ్‌షోలలోనూ ప్రసంగించారు. భారీ వర్షంలోనూ విజయమ్మకు గిరిజనం బ్రహ్మరథం వైఎస్ విజయమ్మ తొలిసారిగా విశాఖజిల్లా ఏజెన్సీ ప్రాంతానికి రావడం తో ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో ఎన్నో సంక్షేమ పథకాలను అందుకున్న తమకు ఆయన భార్యను తొలిసారిగా చూసే భాగ్యం దక్కడంతో గిరిజనం పండుగ చేసుకున్నారు. పాడేరు, అరకు బహిరంగ సభలకు వేలాదిగా తరలివచ్చారు. విజయమ్మ ప్రసంగాలకు జై కొట్టారు. విజయమ్మ పాడేరుకు చేరుకోగానే సభా వేదికకు కిలో మీటరున్నర ముందు నుంచే వేలాది జనం ర్యాలీగా ఆమె కాన్వాయ్ వెంట నడిచారు. అరకులోనూ విజయమ్మకు విశేష ఆదరణ లభించింది. జోరున వర్షం కురుస్తున్నా, ఆమెను చూసేందుకు ప్రజలు గంటల తరబడి అక్కడి నుంచి కదల్లేదు. వర్షంలోనే తడుస్తూ విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. ప్రచార రథానికి తప్పిన ప్రమాదం విశాఖ ఏజెన్సీలో విజయమ్మ కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న ప్రచార రథానికి ప్రమాదం తప్పింది. ఆ సమయంలో వాహనంలో విజయమ్మ లేరు. ఆదివారం సాయంత్రం ఆమె అరకులో ప్రచారరథంపై నుంచి ప్రసంగించి అనంతరం తన వాహనంలో ఘాట్‌రోడ్డులో తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో కాన్వాయ్‌లో ముందుగా వెళ్తున్న ప్రచారరథానికి అనంతగిరి మండలం డముకు సమీపంలో 5వ నంబరు మలుపు వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవరు సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన కొండ అంచును ఢీకొట్టించి ఆగేలా చేశారు. నెమ్మదిగా వస్తుండటం వల్ల ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత కాన్వాయ్‌లోని వాహనాలు ముందుకు సాగిపోయాయి. మరమ్మతులు చేసిన అనంతరం ప్రచార రథాన్ని విశాఖకు తీసుకెళ్లారు. -
వి.కోటలో షర్మిళ జనభేరీ
-
తంబళ్ళపల్లిలో షర్మిల జనభేరి
-
ఖమ్మం జిల్లా సత్తు పల్లిలో జగన్ జనభేరి
-
ఖమ్మం కొత్తగూడెంలో జగన్ జనభేరి
-
'వైఎస్ లేని లోటు జగన్ తీరుస్తాడు'
-
'రైతుల గురించి బాబు ఎప్పుడూ పట్టించుకోలేదు'
-
హుజూర్నగర్ జనభేరిలో జగన్ ప్రసంగం
-
నల్లగొండ జిల్లా కోదాడలో జగన్ జనభేరి
-
రాజమండ్రి జనభేరిలో విజయమ్మ ప్రసంగం
-
నంద్యాల జనభేరిలో షర్మిల ప్రసంగం
-
'వైఎస్సార్ సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం'
-
సికింద్రాబాద్‌లో షర్మిళ జనభేరీ
-
'మంజూరైన ఇళ్లకు బిల్లులు చెల్లించలేదు'
-
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: షర్మిల
-
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: షర్మిల
హైదరాబాద్: పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచింది కిరణ్ సర్కారేనని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీడిమెట్లలోని షాపూర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. అధికారపక్షాన్ని కాలర్ పట్టుకుని ప్రశ్నించాల్సిన చంద్రబాబు తనకేమీ పట్టనట్టు వ్యవహరించారని విమర్శించారు. ఈ ఐదేళ్ల దుర్మార్గ కాంగ్రెస్ పాలనపై ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాడింది జగనన్న మాత్రమేనని గుర్తు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే జగనన్న ముఖ్యమనుకున్నాడని, పదవులను సైతం లెక్కచేయలేదని అన్నారు. చివరికి జైలుకు కూడా వెళ్లాడని గుర్తు చేశారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. వైఎస్ఆర్ సీపీకి ఓటేసి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని ఓటర్లకు షర్మిల విజ్ఞప్తి చేశారు. -
పటాన్‌చెరువులో షర్మిళ జనభేరీ
-
కందుకూరులో జనసునామీ
-
'సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు'
కందుకూరు: ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో చేపట్టిన ‘ వైఎస్సార్ జనభేరి’లో మేకపాటి ప్రసంగించారు. సీమాంధ్రలోని అన్నిస్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ తమ పార్టీ సత్తా చాటుతుందని చెప్పారు. మహబుబాబాద్, ఖమ్మం, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెల్చుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ వైఎస్ జగన్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని మేకపాటి అన్నారు. -
కందుకూరులో జనసునామీ
కందూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారయాత్ర ‘ వైఎస్సార్ జనభేరి’కి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా రాజన్న తనయుడికి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రకాశం జిల్లా కందూరులో సోమవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్సందన లభించింది. కనీవినీ ఎరగని రీతిలో జనం హాజరయ్యారు. యువనేత చూసేందుకు వచ్చిన జనంతో కందూరు కిక్కిరిసింది. ఎటు చూసినా జనమే కనిపించారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో కందుకూరులో జనసునామీ వచ్చిందా అనిపించింది. జగన్ కాన్వాయ్ వెంట వేలాది సంఖ్యలో జనం తరలివచ్చారు. తన కోసం ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన ప్రజలకు వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. తనపట్ల చూపుతున్న ప్రేమాదరణకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. -
శేరిలింగంపల్లి జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
కెపిహెచ్బి వైఎస్సాఆర్ జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
మేకపాటిని కేంద్ర మంత్రిని చేస్తా: జగన్
-
'జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది బాబే'
-
రేపటి నుంచి షర్మిల జనభేరి
28న జగన్.. సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కబోతోంది. ఆది, మంగళ వారాల్లో వైఎస్ షర్మిల నగరంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం పదిగంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి షర్మిల జనభేరి ప్రారంభమై ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో సాగుతుంది. మంగళవారం ఉదయం కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమయ్యే జనభేరి కంటోన్మెంట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో సాగుతుంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం నగరంలో విస్తృత పర్యటన చేసే అవకాశముంది. -
'ప్రజలే మా ధైర్యం.. ప్రజలే మా దైవం'
-
ఉప్పొంగిన అభిమానం
రాజన్న బిడ్డను అక్కున చేర్చుకున్న గిరిజన తండాలు రెండో రోజు జనభేరి విజయవంతం ఐదు నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల పర్యటన ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగని ప్రచారయాత్ర పాల్వంచలో పోటెత్తిన జనం వనమాకు మద్దతుగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ సాక్షి, ఖమ్మం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగాన్ని వినేందుకు పట్టణాలకు దీటుగా పల్లెలు.. గిరిజన తండాలు కదిలాయి. దారిపొడవునా మహిళలు, కూలీలు ఎదురేగి పూలవర్షం కురిపిస్తూ ఆప్యాయంగా రాజన్నబిడ్డకు స్వాగతం పలికారు. షర్మిల యాత్రకు వస్తున్న జనాభిమానాన్ని చూస్తూ నూతనోత్సాహంతో వైఎస్ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులు కదం తొక్కాయి.. జిల్లాలో సోమవారం షర్మిల ఎన్నికల ప్రచారం జనభేరి సాగిన తీరిది. రెండోరోజు ఎన్నికల ప్రచారయాత్ర ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో సాగింది. ఉదయం 9.49 గంటలకు షర్మిల ప్రచార యాత్ర ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆమె పార్టీ జిల్లాకార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అంబే ద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్, వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. అక్కడి నుంచి రోటరీనగర్, ఇల్లెందు క్రాస్‌రోడ్, మంచుకొండ మీదుగా బూడిదంపాడుకు ప్రచారయాత్ర చేరుకుంది. బూడిదంపాడులో గిరిజన మహిళలు షర్మిలతో చేయి కలిపేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ప్రచార రథానికి అడ్డుగా వచ్చి.. రహదారిపై నీళ్లు చల్లి.. పూలబాట వేసి సాదరంగా ఆహ్వానించి వారి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం కామేపల్లి మండలంలోకి యాత్ర ప్రవేశించగా... గోవింద్రాల, పొన్నెకల్లు గ్రామాల్లో గిరిజనులు బారులు తీరి షర్మిలకు స్వాగతం పలికారు, మధ్యాహ్నం 12 గంటలకు ప్రచార యాత్ర గార్లకు చేరుకుంది. వైఎస్ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులు కలిసికట్టుగా షర్మిలకు స్వాగతం పలికి ఆమెతోపాటు ప్రచారంలో పాల్గొన్నారు. కారేపల్లిలో కూడా షర్మిల ప్రచారయాత్రకు విశేష స్పందన లభించింది. డప్పు వాయిద్యాలతో పార్టీ కార్యకర్తలు ఆమెను ఆహ్వానించారు. ఇక్కడి సభకు వైరా నియోజకవర్గంలోని పలు మండలాల కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు షర్మిల ప్రచారయాత్ర ఇల్లెందు చేరుకుంది. అక్కడ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం షర్మిల టేకులపల్లి మీదుగా పాల్వంచ చేరుకున్నారు. పాల్వంచలో జనజాతర... పాల్వంచలో జనభేరికి జనాభిమానం పోటెత్తింది. ఎటుచూసినా వైఎస్ఆర్ సీపీ శ్రేణులతో జనజాతర గా కనిపించింది. కొత్తగూడెం అసెంబ్లీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఇల్లెందు క్రాస్‌రోడ్ నుంచి పాల్వంచ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మోటార్ సైకిళ్లతో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడంతో పార్టీలో నూతనోత్తేజం కనిపించింది. దమ్మపేట సెంటర్ జన జాతరగా మారింది. షర్మిలను చూసేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత దమ్మపేట సెంటర్లో భారీగా హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తుండగా జై జగన్ నినాదాలు మిన్నంటాయి. ఫ్యాను గుర్తుకే ఓటేయాలని ఆమె పదేపదే చెబుతుండటంతో అదే రీతిలో ప్రజలు కూడా స్పందించారు. పాల్వంచ మండల శివారు వరకు ఇదే రీతిలో జనప్రవాహం కొనసాగింది. అనంతరం ప్రచారయాత్ర రాత్రి 8.30 గంటలకు మోరంపల్లి బంజర మీదుగా మణుగూరు చేరుకుంది. ఇక్కడ కూడా గిరిజనులు షర్మిలపై ఆప్యాయత చూపించారు. అభిమానులు భారీగా తరలిరావడంతో మణుగూరు జనప్రవాహాన్ని తలపించింది. ఓటేసే ముందు మదినిండా వైఎస్‌ను తలుచుకోండి... ‘గిరిజనులంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి అమిత ప్రేమ...దేశ చరిత్రలోనే రాష్ట్రంలో గిరిజనులకు 13 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కు కల్పించిన ఘనత ఆయనదే’ అని షర్మిల అన్నారు. మణుగూరులో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ... ఓటేసే సమయంలో ఒక్కసారి వైఎస్‌ను గుండెలనిండా గుర్తు తెచ్చుకుని ఆయన పాలన తిరిగి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ తెల్లం వెంకటరావు, ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూరాకుల నాగభూషణం, బాణోతు మదన్‌లాల్, డాక్టర్ రవిబాబునాయక్, వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఎన్వీ రెడ్డి. వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, సీపీఎం నాయకులు కాసాని ఐలయ్య, బొంతు రాంబాబు, దేవులపల్లి యాకయ్య, అన్నవరపు కనకయ్య, వైఎస్ఆర్ సీపీ కొత్తగూడెం నియోజకవర్గ పరిశీలకులు ఆకుల మూర్తి, నాయకులు వనమా రాఘవ, భీమా శ్రీదర్, పాయం ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పరుగు పరుగున మిర్చి కూలీలు... షర్మిల జనభేరి మంచుకొండ. పొన్నెకల్, భీక్లీ తండా గ్రామశివారుకు చేరుకోగానే... గ్రామ సమీపంలో మిర్చి తోటల్లో మిరపకాయలు కోస్తున్న కూలీలు రహదారిపైకి వచ్చేందుకు పరుగులు తీశారు. ఇది గమనించిన షర్మిల కాన్వాయ్‌ని వారు వచ్చేదాక ఆపారు. ‘ఏంటమ్మా.. బాగున్నారా.. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి’ అని వారిని పలకరించిన తర్వాత ప్రచార రథం ముందుకు కదిలింది. భీక్లీతండాలో బాణోతు రాజేష్ అనే బాలుడు మిర్చి కోత పనుల నుంచి షర్మిల వద్దకు వచ్చాడు. ఏం నాన్నా.. పనికి వెళుతున్నావా.. బాగా చదువుకోవాలి.. జగనన్న అధికారంలోకి రాగానే మీ జీవితాలు బాగుపడుతాయి.. నువ్వు మంచిగా చదువుకోవాలంటూ ధైర్యం చెప్పారు. షర్మిల నేటి పర్యటన షెడ్యూల్ ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజన్న బిడ్డ, జగనన్న సోదరి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల మూడోరోజు మంగళవారం నాటి పర్యటన షెడ్యూల్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. ఉదయం 10 గంటలకు అశ్వాపురం, 11 గంటలకు సారపాక, 12 గంటలకు భద్రాచలం, 4 గంటలకు మోరంపల్లిబంజర, 5 గంటలకు ములకలపల్లి, రాత్రి 7 గంటలకు దమ్మపేట రోడ్‌షోల్లో పాల్గొంటారని వివరించారు. ఈ పర్యటనలో షర్మిలతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావ్‌తో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ, సీపీఎం అభ్యర్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. -
వైఎస్ విజయమ్మకుజననీరాజనం
పశ్చిమ కృష్ణా జనసంద్రంగా మారింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు.. దారిపొడవునా ప్రజల నీరాజనాలు నడుమ మండుటెండను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో వైఎస్సార్ జనభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కోసం నిరీక్షించిన ప్రజలను ఉద్దేశించి పలుచోట్ల ప్రసంగిస్తూ జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల శంఖారావం పూరించారు. సోమవారం జిల్లాలోని జగ్గయ్యపేట నియోజవర్గంలో ప్రారంభమైన యాత్ర మైలవరం నియోజకవర్గంలో ముగిసింది. -
ఆస్పరి వైఎస్ఆర్ జనభేరీలో జగన్ ప్రసంగం
-
ఖమ్మంజిల్లా కారేపల్లిలో షర్మిళ జనభేరీ
-
'సీమాంధ్రకు నవనూతన రాజధానిని నిర్మిస్తాం'
-
వైఎస్సార్సీపీ మానిఫెస్టోపై విశ్లేషణ కార్యక్రమం
-
'రాష్ట్రానికి జగన్ లాంటి సమర్థ నాయకుడు కావాలి'
-
'తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్‌ది పదిల స్థానం'
-
'బాబు హయాంలో పాలన బ్రష్టు పట్టింది'
-
వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో హైలైట్స్
-
కాకుమానులో విజయమ్మ జనభేరీ
-
మోదుకూరులో విజయమ్మ జనభేరీ
-
రేపు జగన్ జనభేరి
ఆస్పరి, పత్తికొండలో పర్యటన సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జనభేరి కార్యక్రమం సోమవారం జిల్లాలో ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జననేత సోమవారం సాయంత్రం ఆలూరు, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆస్పరిలో సోమవారం సాయంత్రం మూడు గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పత్తికొండకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు వెల్లడించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని జనభేరిని విజయవంతం చేయాలని కోరారు. -
'జగన్ నాయకత్వంలో సుస్థిర పాలనను సాధిద్దాం'
-
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
-
గ్రేటర్లో రేపటి నుంచి షర్మిల జనభేరి
12, 13, 14 తేదీల్లో విస్తృత ప్రచారం పన్నెండు నియోజకవర్గాల్లో భారీ సభలు సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల మూడు రోజుల నగర పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ‘జనభేరి’ పేరిట షర్మిల విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు శివకుమార్ గురువారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, వైఎస్ కుటుంబసభ్యుల రాక కోసం ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇదీ షెడ్యూల్.. 12వ తేదీ (శనివారం): ఉదయం 11కి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జనభేరి ప్రారంభం. ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రోడ్డు షోలు, బహిరంగసభలు. 13వ తేదీ (ఆదివారం): ఉదయం కుత్బుల్లాపూర్ నుంచి ప్రచార యాత్ర ప్రారంభమై మేడ్చల్, కంటోన్మెంట్, మల్కాజిగిరి నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. 14వ తేదీ (సోమవారం): మల్కాజిగిరి నుంచి యాత్ర ప్రారంభమై సికింద్రాబాద్, ఉప్పల్, అంబర్‌పేట మీదుగా ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుతుంది. -
14న జననేత జగన్ జనభేరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నారు. అనంతపురం లోక్‌సభ పరిధిలోని గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో 14న జనభేరి నిర్వహిస్తారు. 15న హిందూపురం లోక్‌సభ పరిధిలోని మడకశిర, పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారు కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. 2012లో అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారు. దాదాపు రెండేళ్ల తర్వాత జననేత జిల్లాకు రానుండటం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనుంది. -
12న జగన్ జనభేరి
కోడుమూరు, ఆలూరు, పత్తికొండలో పర్యటన రోడ్‌షో.. జనంతో మాటామంతీ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 12న జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన జనభేరి.. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో ఒక్క రోజు వాయిదా పడిందన్నారు. 12న ఉదయం 10 గంటలకు కోడుమూరుకు చేరుకోనున్న జననేత రోడ్‌షో అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అక్కడి నుంచి నేరుగా ఆలూరుకు పయనమవుతారని.. మార్గమధ్యలో స్థానికులను కలుసుకుంటారన్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఆలూరులో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారన్నారు. అనంతరం నేరుగా పత్తికొండకు చేరుకుని రోడ్‌షో చేపడతారని.. ఆ తర్వాత జనభేరిలో ప్రసంగిస్తారని వెల్లడించారు. చాలా కాలం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పర్యటనల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆ చిరునవ్వు కోసం.. ఆ చేతి స్పర్శ కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కుటుంబ పెద్దగా బాగోగులు చూసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక రైతులు, వృద్ధులు, అక్కాచెల్లెళ్లు.. అన్నాతమ్ముళ్లకు కుటుంబ సభ్యుడు వస్తున్న అనుభూతిని కలిగిస్తోంది. -
'గ్రామాల్లో బెల్టు షాపులను నిషేధిస్తా'
-
చదువుకున్న ప్రతీ ఒక్కరికీ 'ఉద్యోగ భరోసా'
-
'కరెంట్ కోతల్లేని రాష్ట్రాన్ని నిర్మిస్తా'
-
"పేదవాడి ఆరోగ్య భరోసా 'ఆరోగ్యశ్రీ'ని పునర్నిర్మిస్తా"
-
అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు
-
'డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం'
-
'ప్రజా సేవలన్నీ ప్రజల ముందుకే'
-
పేదరికం చదువులకు అడ్డు కాకుడదనేదే 'అమ్మఒడి' లక్ష్యం
-
రైతన్నలకు ప్రభుత్వ భరోసా