
14న జననేత జగన్ జనభేరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నారు. అనంతపురం లోక్‌సభ పరిధిలోని గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో 14న జనభేరి నిర్వహిస్తారు. 15న హిందూపురం లోక్‌సభ పరిధిలోని మడకశిర, పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారు కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. 2012లో అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారు. దాదాపు రెండేళ్ల తర్వాత జననేత జిల్లాకు రానుండటం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనుంది.