‘జనభేరి’ని అడ్డుకుంటే కఠిన చర్యలు: ఎస్పీ | SP Ranganath warns activists not to threat for ys jagan mohan reddy Jana bheri sabha | Sakshi
Sakshi News home page

‘జనభేరి’ని అడ్డుకుంటే కఠిన చర్యలు: ఎస్పీ

Published Tue, Mar 4 2014 5:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

‘జనభేరి’ని అడ్డుకుంటే కఠిన చర్యలు: ఎస్పీ - Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 5న ఖమ్మంలో నిర్వహించే ‘జనభేరి’ బహిరంగసభకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం  ఎస్పీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన హక్కులుంటాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పార్టీలు వ్యవహరించాలని సూచించారు.
 
 సోమవారం  ఆయన వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, జేఏసీ నేతలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు అనుమతి కోసం ఆ పార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు పోలీసు శాఖ కూడా అనుమతి ఇచ్చిందని తెలిపారు.  సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో జిల్లాలో జరిగే మునిసిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్పీ  కోరారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకే ఎన్నికలు జరుగుతున్నప్పటికీ జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ వర్తిస్తుందని వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement