గ్రేటర్‌లో రేపటి నుంచి షర్మిల జనభేరి
- 12, 13, 14 తేదీల్లో విస్తృత ప్రచారం
- పన్నెండు నియోజకవర్గాల్లో భారీ సభలు
సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల మూడు రోజుల నగర పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ‘జనభేరి’ పేరిట షర్మిల విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు శివకుమార్ గురువారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, వైఎస్ కుటుంబసభ్యుల రాక కోసం ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
ఇదీ షెడ్యూల్..
12వ తేదీ (శనివారం): ఉదయం 11కి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జనభేరి ప్రారంభం. ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో
రోడ్డు షోలు, బహిరంగసభలు.
13వ తేదీ (ఆదివారం): ఉదయం కుత్బుల్లాపూర్ నుంచి ప్రచార యాత్ర ప్రారంభమై మేడ్చల్, కంటోన్మెంట్, మల్కాజిగిరి నియోజకవర్గాల మీదుగా సాగుతుంది.
14వ తేదీ (సోమవారం):
మల్కాజిగిరి నుంచి యాత్ర ప్రారంభమై సికింద్రాబాద్, ఉప్పల్, అంబర్‌పేట మీదుగా ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి చేరుతుంది.