జగన్‌కోసం...
గుంటూరు
వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన ఖరారు కావడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. జైలునుంచి విడుదలయ్యాక తొలిసారిగా జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఈ నెల ఆరో తేదీన నరసరావుపేటలో నిర్వహించే జనభేరి సభలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, వారి అనుచరులతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. 7, 8 తేదీల్లో మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మృతిని తట్టుకోలేక అశువులు బాసినవారి కుటుంబాలను జగన్ ఓదార్చుతారు.
జైలునుంచి విడుదలయ్యాక తొలిసారిగా...
2012 మే 24వ తేదీన మాచర్ల నియోజకవర్గం కారంపూడి బహిరంగ సభలో ప్రసంగించి ఠమొదటిపేజీ తరువాయి
సీబీఐ విచారణకు జగన్ హాజరయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ కుటిల యత్నాల కారణంగా 16 నెలలు జైలు జీవితం గడపడంతో ప్రజలకు, పార్టీ కేడర్‌కు దూరయ్యారు. ఆ లోటును భర్తీ చేసేందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జననేత సోదరి షర్మిల పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
అందరికీ అండగా ఉన్నామనే భరోసా అటు ప్రజలకు, పార్టీ కేడర్‌కు కలిగించారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు, జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర ప్రజలసంక్షేమం కోసం ‘సమరదీక్ష’ను చేపట్టారు. సమైక్యాంధ్రకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని గత ఏడాది ఆగస్టులో ఈ దీక్షను చేపట్టారు. ఆ తరువాత డిసెంబరులో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభించిందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా ఒక రోజు దీక్ష చేపట్టారు.
అంతకు ముందు(గత ఏడాది ఫిబ్రవరిలో) జగన్ వదిలిన బాణం షర్మిల జిల్లాలో 33 రోజులపాటు మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రను నిర్వహించి ప్రజలకు బాసటగా నిలిచారు. సరైన ఆధారాలను సీబీఐ చూపించలేకపోవడంతో ప్రత్యేక కోర్టు జగన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీ పటిష్టతపై దృష్టి సారించి రానున్న ఎన్నికలకు శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలవారీగా జనభేరిని నిర్వహిస్తున్నారు.
జనభేరి పోస్టర్ విడుదల
జిల్లాలోని నరసరావుపేటలో ఈ నెల ఆరున జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న జనభేరికి సంబంధించిన పోస్టర్‌ను చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్బంగా వారిద్దరూ మాట్లాడుతూ జగన్‌పాలనలోనే పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అందగలవని తెలిపారు. జిల్లాలోని నాయకులంతా ఆ నాటి సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.