‘‘వైఎస్ కలలు కన్నట్టుగానే గుడిసెల్లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే జగన్ లక్ష్యం. దేశంలో 50ఏళ్లలో 47లక్షల ఇళ్లు కడితే వైఎస్ తన ఐదేళ్ల మూడు నెలల పాలనలో ఏకంగా 48 లక్షల ఇళ్లు కట్టి చూపించాడు. ఇప్పుడు జగన్ ఏడాదికి 10లక్షల చొప్పున రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. వాటిని అక్కాచెల్లెళ్ల పేరిటే రిజిస్టర్ కూడా చేయించి ఆ ఇళ్లపై రుణాలందిస్తానని చెబుతున్నాడు. ఆ మహానేతలో ఉన్న దీక్ష, తెగువ, పట్టుదల జగన్‌బాబులో కూడా ఉన్నాయి. ఒకసారి మాట ఇచ్చాడంటే వాళ్ల నాయన మాదిరిగానే ఆ మాట తప్పేవాడు కాదు. నన్ను నమ్మండి. జగన్‌బాబును ఆశీర్వదించండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు