
నేడు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో జగన్ పర్యటన
‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని కోదాడ, హుజూర్‌నగర్, మధిర, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని కోదాడ, హుజూర్‌నగర్, మధిర, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కోదాడలో, 11.30 గంటలకు హుజూర్‌నగర్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు మధిరలో, సాయంత్రం 5 గంటలకు కొత్తగూడెంలలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.