జగన్ సభలకు ముమ్మర ఏర్పాట్లు | Y.S jagan mohan reddy meeting huge arrangements | Sakshi
Sakshi News home page

జగన్ సభలకు ముమ్మర ఏర్పాట్లు

Published Sat, Apr 26 2014 3:42 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

Y.S jagan mohan reddy meeting huge arrangements

హుజూర్‌నగర్/కోదాడ టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిం చాలని కోరుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హుజూర్‌నగర్‌లోని సాయిబాబా థియేటర్ పక్కనున్న నగర పంచాయతీ స్థలం లో సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత హుజూర్‌నగర్ నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వేలా దిమంది ప్రజలు ఎంతో అభిమానంతో ఎదురుచూస్తున్నారు.

గతంలో రెండుసార్లు ఓదార్పుయాత్ర తేదీలు ఖరారైనా అనివార్య కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. హుజూర్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ ఇప్పటికే బలమైన పార్టీగా ఉంది. వైఎస్సార్‌సీపీ ఏర్పడ్డాక నియోజకవర్గంలో మొదటిసారిగా జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నారు. వైఎస్.జగన్ పర్యటనతో నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరే అవకాశం మెండుగా  కనిపిస్తుంది. అంతేగాక సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో సభాప్రాంగణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 కోదాడలో...
 జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం కోదాడలో నిర్వహించే బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గున్నం నాగిరెడ్డి, కోదాడ అసెంబ్లీ అభ్యర్థి ఎర్నేని బాబులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వేలాదిమంది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులు సభకు తరలివచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు.
 
 పట్టణ పరిధిలోని బైపాస్‌రోడ్డు వద్ద ెహ లిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఆయన సభాస్థలికి చేరుకుంటారు. శనివారం సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయించడంతో పాటు వేదిక ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు పట్టణ నాయకులు తుమ్మలపల్లి భాస్కర్, పెంట్యాల పాపారావు, నెమ్మాది భాస్కర్, తోట ఆదిత్య, కర్ల సుందర్‌బాబు,  జమీల్, లైటింగ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు.
 
 సభలను జయప్రదం చేయాలి
 గట్టు శ్రీకాంత్‌రెడ్డి
 
 హుజూర్‌నగర్, కోదాడలలో జరిగే వైఎస్సార్ జనభేరి సభలను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక సాయిబాబా థియేటర్ సమీపంలోని సభ నిర్వహణ స్థలంలో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భా వం తర్వాత మొదటిసారిగా నియోజకవర్గ పర్యటనకు వస్తున్న పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజలు భారీగా స్వాగ తం పలకనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్  అభిమానులు, సానుభూతిపరులు, అనుబంధసంఘాల కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement