ఫ్యాన్ ప్రభంజనం
‘ఆయనకు అరవై ఐదేళ్ల వయసొచ్చింది. ఏదోరకంగా పదవిలోకొస్తే చాలనుకుంటున్నా డు. ప్రజలు.. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదనుకుంటున్నాడు. అందుకే.. ఆల్ ఫ్రీ హామీలతో మభ్యపెడుతున్నాడు. వాస్తవాలు గమనించండి. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుంచుకోండి. నీతి.. నిజాయితీ.. విశ్వసనీయతకు ఓటేయండి. సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి మన పార్టీ అభ్యర్థులను గెలిపించండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పాలకొల్లులో శనివారం నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభ జన సునామీని తలపించింది. ‘ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటు వేసేముందు ఒక్కసారి వైఎస్‌ను గుర్తు చేసుకోండి. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రాజన్న రాజ్యానికి మళ్లీ నాంది పలకండి’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. నారాయణపురం, మార్టేరు సెంటర్లలో ఆమె నిర్వహించిన ‘జనభేరి’ సభలకు జనం పోటెత్తారు.
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయన సోదరి షర్మిల నిర్వహిం చిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలతో ‘పశ్చిమ’ హోరెత్తింది. క్షీరపురి పట్టణం ‘జగన్’ ఉత్సాహంతో ఉప్పొంగి పోగా..ఉంగుటూరు మండలం నారాయణపురం, పెనుమంట్ర మండలం మార్టేరులో సమర శంఖారావం పూరించిన షర్మిల మాటల తూటాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారుు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందంటూ కార్యకర్తలు జోరు పెం చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయ న సోదరి షర్మిల శనివారం జిల్లాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఎక్కడ చూసినా వైఎస్సార్ సీపీ జెం డాల రెపరెపలు.. కార్యకర్తలు, అభిమానుల సందడి కనిపించింది.
జనసంద్రమైన క్షీరపురి
పాలకొల్లులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన జనభేరి సభకు ప్రజలు సునామీలా తరలివచ్చారు. పట్టణంలోని రోడ్లన్నీ జనసంద్రమయ్యూరుు. రహదారులన్నీ కిక్కిరిసిపోయూరుు. ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు వైఎస్ జగన్ రాక కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. వారి అభిమానానికి వైఎస్ జగన్ పులకించిపోయూరు.
వైఎస్ పథకాలను జగనన్న పక్కాగా అమలు చేస్తారు : షర్మిల
‘జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ పథకాలన్నిటినీ బ్రహ్మాం డంగా అమలు చేస్తారు. పేదల కష్టాలు తెలిసిన జగనన్న ప్రతి పేదవాడికి న్యాయం చేస్తారు. ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే తిరగరాసేందుకు జగనన్న పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయలేదు. అందుకే ఏ పథకాన్నీ కొనసాగిస్తానని చెప్పలేకపోతున్నారు. రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేశారు గనుక తానూ చేస్తానంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీ సం వడ్డీ కూడా మాఫీ చేయలేదు చంద్రబాబు. వైఎస్ ఉచిత విద్యుత్ ఇచ్చారు గనుక బాబు కూడా ఇస్తానంటున్నారు. చంద్రబాబు మోసపుమాటలు నమ్మొ ద్దు’ అని షర్మిల పిలుపునిచ్చారు నరసాపురం ఎంపీ అభ్యర్థి వంక రవీం ద్రనాథ్, ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, పాలకొల్లు అభ్యర్థి మేకా శేషుబాబు, నరసాపురం అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు, భీమవరం అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, ఉండి అభ్యర్థి పాతపాటి సర్రాజు, ఉంగుటూరు అభ్య ర్థి పుప్పాల వాసుబాబు, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, అల్లు సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, గుబ్బల తమ్మయ్య, మేడిది జాన్సన్, కండిబోయిన శ్రీనివాసరావు, ఎంఎస్ రెడ్డి, గాదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
పేదల గుండెల్లో స్థానం సంపాదించాలి : వైఎస్ జగన్
‘ఓటు వేసేముందు మనమంతా ఆలోచన చేయాలి. ఎటువంటి నాయకుడు మనకు కావాలి. ఎటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలి అనేది ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో... ఏ వ్యక్తి అయితే ప్రతి పేదవాడి మనసు తెలుసుకుంటాడో.. ఏ వ్యక్తి అయితే చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండేందుకు ఆరాటపడతాడో అటువంటి వ్యక్తినే మనం నాయకుడిగా ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తినే మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి. ఇవాళ మీ అందరితో ఒకే విషయాన్ని చెబుతున్నా.. ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. దివంగత మహానేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మనం మళ్లీ తెచ్చుకునేందుకు కలసికట్టుగా పనిచేద్దాం’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలకొల్లు సభలో ప్రజలకు పిలుపునిచ్చారు.