కుప్పంలో గళమెత్తిన షర్మిల | ys sharmila's speech in kuppam janabheri | Sakshi
Sakshi News home page

Apr 27 2014 5:49 PM | Updated on Mar 22 2024 11:30 AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీ చేసే కుప్పం నియోజకవర్గంలో గళమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కుప్పంలో జరిగిన వైఎస్ఆర్ జనభేరిలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్నేళ్లుగా మీ నెత్తిన భస్మాసుర హస్తం పెట్టిన చంద్రబాబుని నమ్మొద్దన్నారు. ప్రతి ఒక్క వర్గానికి తానున్నాని భరోసా కల్పించిన నాయకుడు దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రైతులకు, మహిళలకు చంద్రబాబు రూపాయి వడ్డీకే రుణాలు ఇస్తే, వైఎస్‌ఆర్ పావలా వడ్డీకే రుణాలు అందించారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో లక్షలాదిమంది లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాదు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేలా పేదోడికి భరోసా కల్పించారని చెప్పారు. ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే వైఎస్ఆర్ అన్ని పథకాలను అద్భుతంగా అమలుచేయగలిగారన్నారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖర్‌రెడ్డి గారు వెళ్లిపోయారని, ఆయన మరణాతరం ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. ఈ ఐదేళ్లలో ఏ ఒక్కసారైనా చంద్రబాబు కాంగ్రెస్‌ను నిలదీశారా? అని ప్రశ్నించారు. అవిశ్వాస సమయంలో కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా ఏర్పడి కిరణ్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement