‘జనభేరి’ ఏర్పాట్ల పరిశీలన
పి.గన్నవరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పి.గన్నవరంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే వైఎస్సార్ జనభేరి సభలో పాల్గొంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. పి.గన్నవరం మూడు రోడ్ల సెంటర్‌లో జరిగే ఈ సభకు కోనసీమ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మూడు రోడ్ల సెంటర్ సమీపంలో ఉన్న లేఅవుట్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను చిట్టబ్బాయి, పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పి.గన్నవరం అసెంబ్లీ అభ్య ర్థి కొండేటి చిట్టిబాబు పరిశీలించారు.
చిట్టబ్బాయి మాట్లాడు తూ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఇక్కడకు చేరుకుంటారని తెలిపారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించిన ప్రతీచోటా ఇసుకేస్తే రాలనంత జనం తరలివస్తున్నారన్నారు. మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ సభకు అంబాజీపేట మీదుగా వచ్చే వాహనాలను విశాఖ డెయి రీ వద్ద లేఅవుట్ స్థలంలో పార్కింగ్ చేయాలన్నారు. జి.పెదపూ డి వైపు వచ్చే వాహనాలను హెలిపాడ్ సమీపంలోని ఖాళీ స్థలం లోను, రాజోలు నుంచి వచ్చేవి ఎల్.గన్నవరం వద్ద పార్కింగ్ చేయాలన్నారు. పార్టీ నాయకులు మంతెన రవిరాజు, అడ్డగళ్ల వెంకట సాయిరామ్, దొమ్మేటి వెంకట శివరామన్, కొక్కిరి రవికుమార్, పిల్లి సత్యనారాయణ, అన్నాబత్తుల నాయుడు, యన్నాబత్తుల ఆనంద్, చొల్లంగి చిట్టిబాబు పాల్గొన్నారు.
షర్మిల సభను విజయవంతం చేయండి
రంపచోడవరం : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల నాలుగో తేదీన స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహిస్తున్న వైఎస్సార్ జనబేరి సభను విజయవంతం చేయాలని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ కోరారు. ఉదయం 10 గంటలు జరిగే ఈ సభకు కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్‌లు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.