
నేడు షర్మిల జనభేరి
సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పార్టీ ముఖ్య నేత వైఎస్ షర్మిల మంగళవారం నగరంలో విస్తృత పర్యటన చేయనున్నారు. ఉదయం పది గంటలకు కుత్బులాపూర్ నియోజకవర్గంలోని షాపూర్‌నగర్ నుంచి ప్రారంభమయ్యే జనభేరి.. సాయంత్రం ఆరు గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పీఅండ్‌టీ కాలనీ వద్ద జరిగే బహిరంగసభతో ముగుస్తుంది. ఆయా ప్రాంతాల్లో జరిగే సభలకు కార్యకర్తలు, అభిమానులు, నగరవాసులు పెద్దఎత్తున తరలి రావాలని పార్టీ ముఖ్య నేత కె.శివకుమార్ విజ్ఞప్తి చేశారు.