
నేడు జగన్ జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆది, సోమవారాల్లో నగరంలో విస్తృత పర్యటన చేయనున్నారు.
సోమవారం మరో ఐదు నియోజకవర్గాల్లో టూర్
సాక్షి, సిటీబ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆది, సోమవారాల్లో నగరంలో విస్తృత పర్యటన చేయనున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి సికింద్రాబాద్ అడ్డగుట్ట చౌరస్తాలో జరిగే బహిరంగసభకు హాజరవుతారు.
అక్కడి నుంచి నేరుగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేరుకుని జగద్గిరిగుట్ట ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటయ్యే సభలో పాల్గొంటారు. తిరిగి సోమవారం ఉదయం పది గంటలకు బయలుదేరి జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో జరిగే సభలు, రోడ్ షోల్లో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ముఖ్య నాయకుడు కె.శివకుమార్ తెలిపారు.