ఫుల్ స్వింగ్‌లో వైఎస్సార్ సీపీ | ysr sharmila election campaign | Sakshi
Sakshi News home page

ఫుల్ స్వింగ్‌లో వైఎస్సార్ సీపీ

Published Mon, May 5 2014 2:15 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఫుల్ స్వింగ్‌లో వైఎస్సార్ సీపీ - Sakshi

ఫుల్ స్వింగ్‌లో వైఎస్సార్ సీపీ

  •  కేడర్‌లో జోష్ నింపిన జగన్, షర్మిల పర్యటనలు
  •  వందలాది కార్యకర్తలు,
  •  అభిమానులతో భారీ ర్యాలీలు
  •  అమలాపురం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫుల్‌జోష్‌తో ఉంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి షర్మిల పర్యటన కేడర్‌లో ఉత్సాహాన్ని నింపింది.  అమలాపురం పార్లమెంట్ పరిధిలో శనివారం పి.గన్నవరంలోజగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన జనభేరి సభకు వేలాదిగా జనం పోటెత్తారు. అలాగే షర్మిల రాజోలు నియోజకవర్గం పరిధిలో మలికిపురం, కొత్తపేటల్లో నిర్వహించిన జనభేరి సభలు సైతం విజయవంతమయ్యాయి. ఒకేరోజు అన్నా, చెల్లెళ్లు చేసిన ఎన్నికల ప్రచారం పార్టీ కేడర్‌లో మనోస్థైర్యాన్ని నింపింది. పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ తనపరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తొలుత పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో శుక్రవారం ఆయన అసెంబ్లీ అభ్యర్థులు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు.

    మామిడికుదురు మండలం పాశర్లపూడి వంతెన వద్ద నుంచి ఆరంభమైన రోడ్ షో పలు గ్రామాల మీదుగా రాజోలు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. ఆదివారం అమలాపురం నియోజకవర్గంలో రోడ్ షో జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి విశ్వరూప్, అసెంబ్లీ అభ్యర్థి గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయిల ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో సైతం విజయవంతమైంది. అమలాపురం చిట్టబ్బాయి ఇంటి వద్ద మొదలైన ఈ రోడ్‌షో హైస్కూల్ సెంటరు, గోఖలే సెంటరు, భూపయ్య అగ్రహారం, ఎత్తురోడ్డు, కొంకాపల్లి, గడియారస్తంభం, ఆర్టీసీ బస్టాండ్, ముమ్మిడివరంగేట్, నల్లవంతెన, ఎర్రవంతెన మీదుగా తిరిగి హైస్కూల్ సెంటరుకు చేరుకుంది. ఈ రోడ్‌షోకు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో అమలాపురం పార్టీ జెండాలతో నిండిపోయింది.ఆయా ప్రాంతాల్లో విశ్వరూప్, బాబూరావుల ప్రచారానికి మంచి స్పందన లభించింది. పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ, పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, జంపన రమేష్‌రాజు, నిమ్మకాయల హనుమంతశ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కుడుపూడి బాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఐ.వి.సత్యనారాయణ, డీసీసీబీ డెరైక్టర్ ఇళ్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement