
బాలకృష్ణకు మతిస్థిమితం ఉందా.. లేదా?
గతంలో ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన బాలకృష్ణను పిచ్చివాడు అనాలా.. సైకో అనాలా అంటూ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. మతిస్థిమితం లేని వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని ఆమె గుర్తు చేశారు. తనకు మతి స్థిమితం లేదని అప్పట్లో వైద్యుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు షర్మిల.
ఒకవేళ ఆయనకు ఇప్పుడు మతి స్థిమితం ఉందంటే అప్పట్లో దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నందుకు బాలకృష్ణపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా గురజాలలో షర్మిల అభిమానులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ ఈ ప్రశ్నలు సంధించారు.