రానున్నది రైతు రాజ్యామే... | The farmer said the kingdom ... | Sakshi
Sakshi News home page

రానున్నది రైతు రాజ్యామే...

Published Wed, Apr 23 2014 1:25 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

రానున్నది  రైతు రాజ్యామే... - Sakshi

రానున్నది రైతు రాజ్యామే...

రైతు సంక్షేమమే వైఎస్ జగన్ ధ్యేయం
 
అన్నదాత పక్షాన వైఎస్ తనయుడి నిత్య పోరాటాలు
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోనూ ప్రతిఫలించిన లక్ష్యం
సాగును లాభదాయకం చేసేలా నిండైన భరోసా

 
 పిన్నింటి గోపాల్

 1.    రైతులకు ఆసరాగా నిలవాల్సిందే. గిట్టుబాటు ధర కల్పించాల్సిందే. అందుకు 3 వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం
 2.    కరువులు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల్లో రైతులకు ఆసరాగా ఉండాలి. పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి, వీలైనంత త్వరగా పరిహారం చెల్లించాలి. అందుకు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. తర్వాతి పంట నాటికల్లా పరిహారం రైతు చేతికందిస్తాం
 3.    వ్యవసాయానికి ఇద్దరు మంత్రులుంటారు. ఒకరు వ్యవసాయ ఉత్పత్తులను, మరొకరు ఆ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు
 4.    {పాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలు.. వ్యవసాయానికి విడిగా బడ్జెట్
 5.    {పతి జిల్లానూ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దుతాం. దేశంలో ఈ తరహా పద్ధతి మరెక్కడా లేదు. దీని వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి
     

రాబోయే రైతు రాజ్యానికి సంకేతాలు
 
ఇలా విత్తనం నుంచి పంట విక్రయం దాకా ప్రతి దశలోనూ అన్నదాతలకు అన్ని రకాలుగా భరోసా కల్పించే అంశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి. అందరికీ అన్నం పెట్టే రైతు కుటుంబంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా వ్యవసాయానికి మేనిఫెస్టోలో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రైతు సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం గత నాలుగేళ్లుగా నిత్యం గళమెత్తుతూ, పాలకులను నిలదీస్తూ సాగుతున్న రైతు పక్షపాతి జగన్. రైతు రాజ్యాన్ని స్థాపిస్తానన్న ఆయన వాగ్దానం అన్నదాతకు భరోసాగా నిలుస్తోంది. విత్తనాల దశ నుంచీ అన్ని రకాలుగా ప్రభుత్వ సాయం, గిట్టుబాటు ధర కోసం స్థిరీకరణ నిధి... ఇద్దరు మంత్రులతో పూర్తిస్థాయి పర్యవేక్షణ, సాగుకు విడిగా బడ్జెట్... సాగు చల్లగా సాగేందుకు పలు అంశాలతో జగన్ ఆవిష్కరించిన భావి ప్రణాళిక రైతన్నలో ధీమా నింపుతోంది.
 
తాను అధికారంలోకి రాగానే రైతులు తిరిగి తలెత్తుకునేలా, అన్నదాత స్థైర్యాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో ఐదేళ్లుగా తిష్ట వేసిన పలు సమస్యల పరిష్కారం కోసం పలు మార్గాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. వాటన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామనే ధీమాను కూడా కల్పించారు. ఇవన్నీ ఎన్నికల గిమ్మిక్కులు కాదు. ఓట్ల ఎత్తుగడలు అసలే కావు. రైతు బాంధవుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయునిగా... రైతుల కోసం అనుక్షణం పరితపించే నైజం జగన్‌కు వారసత్వంగా వచ్చింది. పైగా వైఎస్ మాదిరిగానే రైతుల ఇక్కట్లను అతి దగ్గరగా చూశారు జగన్. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న వాస్తవం ఆయనకు బాగా తెలుసు. అందుకే అన్నదాత సమస్యల పరిష్కారం కోసం పాలకులపై ఒత్తిడి తెచ్చారు. దీక్షలు చేశారు. ప్రకృతి విపత్తులు రైతులను కుంగదీసినప్పుడల్లా వారి మధ్యకు వెళ్లారు. మనో నిబ్బరం కల్పించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కనీస మద్దతు ధర దక్కక దిగాలు పడ్డ రైతుకు ధైర్యం చెప్పారు. వారి తరఫున తాను రోడ్డెక్కారు. కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించారు. న్యాయం కోసం ఢిల్లీ దాకా వెళ్లారు. ప్రధానిని కదిలించారు. ఏం చేసినా కదలికే లేని పాలకుల నిర్వాకాన్ని క ళ్లారా చూశారు. వైఎస్ హయాంలో మాదిరిగా వ్యవసాయాన్ని మళ్లీ పండుగలా మార్చాలంటే ఏం చేయాలో స్పష్టమైన అంచనాకు వచ్చారు. దాని ఫలితమే... వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో రైతు సంక్షేమానికి పెద్దపీట.
 
మేనిఫెస్టోలోని మరికొన్ని కీలకాంశాలు..

 
1.  ఆరునూరైనా సాగుకు ఉచితంగా 9 గంటలు విద్యుత్. అందులో 7 గంటలు పగలే నిరంతరాయంగా సరఫరా
2.   రైతులకు వడ్డీ లేని రుణాలు, యాంత్రీకరణను ప్రోత్సహించడానికి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీ
3.    అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతుల కోసం సరికొత్త రుణ మాఫీ పథకం కోసం కేంద్రంపై ఒత్తిడి
4. పెట్టుబడుల్లేని దుస్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు విత్తు వేసేనాటికే రైతులకు బ్యాంకు రుణాలు
5.   అదనంగా 40 లక్షల అడుగుల గిడ్డంగుల నిర్మాణానికి ప్రాధాన్యం. ఆధునిక, శీతల గిడ్డంగుల నిర్మాణం
6.    రాష్ట్రంలో మూడు వ్యవసాయ వర్సిటీలు. రెండు జిల్లాలకో వ్యవసాయ డిగ్రీ కళాశాల, పరిశోధన కేంద్రం
7.    రైతులకు సూచనలిచ్చేందుకు 102 మొబైల్ క్లినిక్‌లు. పొలాల వద్దకెళ్లి నమూనాల సేకరణ, భూసార పరీక్షలు
8.    పశువులకు 103 సంచార వైద్యశాలలు. రైతుల చెంతకే పశు వైద్య సేవలు. మండలానికో పశు వైద్యశాల
 
 వైఎస్సే స్ఫూర్తి
 
 వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి పాటుపడాలన్న వైఎస్ జగన్ తపనకు స్ఫూర్తి ఆయన తండ్రి, మహా నేత దివంగత వైఎస్సే. అన్నదాత బాగుండాలని నిత్యం తపించిన నిజమైన నాయకుడు వైఎస్సార్. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేశారు. సాగుకు ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు. రూ.1,259 కోట్ల విద్యుత్ బకాయిలనూ రద్దు చేశారు. రైతులకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే రాష్ట్రానికి మేలే తప్ప భారం కాదని రుజువు చేసి చూపారు. అదనులో పెట్టుబడి ఉంటేనే రైతులకు సాంత్వన అని గ్రహించి పంట రుణాలపై వడ్డీని పావలాకు తగ్గించారు. ప్రకృతి విపత్తుల బారి నుంచి రైతుకు రక్షణ కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా పంటల బీమా పథకాన్ని అమలు చేసిన ఆదర్శ పాలకుడు వైఎస్. ఆయన ప్రతి నిర్ణయమూ రైతుల ప్రయోజనమే పరమావధిగా జరిగింది. మోన్‌శాంటోకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మరీ అది దిగొచ్చేలా చేశారు. బీటీ పత్తి విత్తనాల ధరను రూ.750కి తగ్గించి రైతు ముఖంలో చిరునవ్వులు పూయించారు.
 
 జగన్ మాట...
 
 రెతును విస్మరిస్తే సర్కారుకు మూడినట్టే. సర్వం కోల్పోయి వారు అల్లాడుతుంటే, సగం ధాన్యమే కొంటానంటూ వ్యాపారుల కంటే అధ్వానంగా వ్యవహరిస్తోంది
 - విజయవాడ ‘లక్ష్య దీక్ష’లో
 రైతు కంట కన్నీరు రాష్ట్రానికే అరిష్టం. అన్నదాతను పట్టించుకోని ఈ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిలో దూకడం మేలు    - విజయవాడ ‘మహా ధర్నా’లో
 
కేంద్రం పట్టించుకుంటే తప్ప పోలవరం ప్రాజెక్టును మీరు కట్టలేరా?
 - ‘హరితయాత్ర’లో రాష్ర్ట కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్న
 
ఇది ముందుచూపు ఏమాత్రమూ లేని గుడ్డి సర్కారు. పంట నష్టపోతే చచ్చేది రైతే కదా. చస్తే చావనీ అన్నట్టు వ్యవహరిస్తోందీ అధ్వాన ప్రభుత్వం
 - కడప కలెక్టరేట్ వద్ద ‘కరెంటు పోరు’లో

 రైతుల సమస్యలపై సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. లేదంటే మేమే తెరిపిస్తాం బిల్లులు కట్టని రైతులను జైల్లో పెట్టాలన్న చంద్రబాబుకు వారి పేరెత్తే అర్హతే లేదు
 - ఆర్మూరు ‘రైతు దీక్ష’లో
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement