మంచి నేతతోనే మంచి పాలన | good leader for good governance says in ys vijayamma | Sakshi
Sakshi News home page

మంచి నేతతోనే మంచి పాలన

Published Sat, May 3 2014 1:45 AM | Last Updated on Mon, Jan 7 2019 8:29 PM

మంచి నేతతోనే మంచి పాలన - Sakshi

మంచి నేతతోనే మంచి పాలన

విశాఖ ఎన్నికల ప్రచారంలో వైఎస్‌విజయమ్మ
 
 విశాఖపట్నం: ‘‘కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దివంగతనేత రాజశేఖరరెడ్దిదే. వైఎస్సార్ సువర్ణయుగంలో ఒక్కో కుటుం బానికి నాలుగైదేసి సంక్షేమ పథకాలందాయి.   విద్యుత్, ఆర్టీసీ, మున్సిపల్, నీటి పన్నులేవీ పెంచలేదు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మందికి ఉచిత ఆపరేషన్లు. దేశం మొత్తంమీద ఐదేళ్లలో 47 లక్షలఇళ్లు నిర్మిస్తే.. అదేకాలంలో ఒక్క మన రాష్ట్రం లోనే 48లక్షల ఇళ్లు నిర్మించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లతో రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. మంచినేతను ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని నిరూపించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ పట్నం లోక్‌సభ అభ్యర్థి విజయమ్మ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శుక్రవారం నగరంలోని మధురవాడ, ఆనందపురం, గాజువాక, పరవాడలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో తాము ఎన్నో అవమానాలకు గురయ్యామని చెప్పారు. ‘‘వైఎస్ మరణం తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చుతానని నల్లకాలువలో ఇచ్చిన మాటకోసం జగన్‌బాబు పదవిని కాదనుకున్నాడు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చాక మా కుటుంబంపై కక్ష సాధింపు మొదలైంది. అయినా జగన్‌బాబు నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాడు. ఫీజుపోరు, జన దీక్ష, జల దీక్ష, రైతు దీక్ష, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశారు. నేనూ వారం రోజులు నిరాహార దీక్ష చేశా. ఓదార్పుయాత్రకు వచ్చిన ఆదరణచూడలేక... చేయని తప్పుకు జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారు. 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను 16నెలల వరకు అడ్డుకున్నారు. అయినా తన పోరాటం ఆపలేదు. తనను నమ్ముకున్న వారికి అండగా ఉండాలనే నన్ను, షర్మిలను మీ ముం దుకు పంపించారు. మాటకు కట్టుబడే కుటుంబం మాది. ఫ్యాను గర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీని గెలిపించండి. మేనిఫెస్టోలో ప్రకటించివన్నీ నెరవేరుస్తాం’’ అని భరోసానిచ్చారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement