Visakhapatnam Lok Sabha
-
సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
ఎంవీపీ కాలనీ: ‘మీ సమస్య ఏదైనా.. ఏ అవసరమొచ్చినా బొత్స సత్తిబాబు మీ వెంట ఉన్నాడు. అన్నదమ్ముడిగా మీ మధ్య పెరిగాను.. మీ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఈ స్థాయికి చేరాను.. ఆ ఆదరణ ఎల్లప్పుడూ నాకు, మా పార్టీకి కావాలి’అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వాసుల ఎదుట తన ఆకాంక్షను వెల్లడించారు. విశాఖ నగరంలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల ఆత్మీయ సమావేశం లాసన్స్ బే కాలనీలోని వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో జరిగింది.మంత్రితో పాటు బొత్స ఝాన్సీ పాల్గొని ఉత్తరాంధ్ర వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లో సేవలు అందించానన్నారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర ప్రజానీకం తనకు, తన కుటుంబానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా తమ నుంచి మునుపటి భరోసాను పొందవచ్చునన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఉత్తరాంధ్ర ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేసి అఖండ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీ ఉండాలన్నదే సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని మంత్రి బొత్స పేర్కొన్నారు.ఇందుకు అనుగుణంగానే అవినీతికి తావులేకుండా రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లుగా సుపరిపాలన అందించడంతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్ వంటి నాయకుడు దేశ రాజకీయ చరిత్రలో లేరన్నారు. మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు నమ్మకం, భరోసా, ధైర్యం అందించారన్నారు. ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చిడమే సీఎం జగన్ అజెండా అన్నారు. లక్ష కోట్లతో విజన్ విశాఖ పేరిట నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ఉత్తరాంధ్ర వాసులు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు. -
మంచి నేతతోనే మంచి పాలన
విశాఖ ఎన్నికల ప్రచారంలో వైఎస్‌విజయమ్మ విశాఖపట్నం: ‘‘కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దివంగతనేత రాజశేఖరరెడ్దిదే. వైఎస్సార్ సువర్ణయుగంలో ఒక్కో కుటుం బానికి నాలుగైదేసి సంక్షేమ పథకాలందాయి. విద్యుత్, ఆర్టీసీ, మున్సిపల్, నీటి పన్నులేవీ పెంచలేదు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మందికి ఉచిత ఆపరేషన్లు. దేశం మొత్తంమీద ఐదేళ్లలో 47 లక్షలఇళ్లు నిర్మిస్తే.. అదేకాలంలో ఒక్క మన రాష్ట్రం లోనే 48లక్షల ఇళ్లు నిర్మించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లతో రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. మంచినేతను ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని నిరూపించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ పట్నం లోక్‌సభ అభ్యర్థి విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శుక్రవారం నగరంలోని మధురవాడ, ఆనందపురం, గాజువాక, పరవాడలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో తాము ఎన్నో అవమానాలకు గురయ్యామని చెప్పారు. ‘‘వైఎస్ మరణం తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చుతానని నల్లకాలువలో ఇచ్చిన మాటకోసం జగన్‌బాబు పదవిని కాదనుకున్నాడు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చాక మా కుటుంబంపై కక్ష సాధింపు మొదలైంది. అయినా జగన్‌బాబు నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాడు. ఫీజుపోరు, జన దీక్ష, జల దీక్ష, రైతు దీక్ష, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశారు. నేనూ వారం రోజులు నిరాహార దీక్ష చేశా. ఓదార్పుయాత్రకు వచ్చిన ఆదరణచూడలేక... చేయని తప్పుకు జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారు. 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను 16నెలల వరకు అడ్డుకున్నారు. అయినా తన పోరాటం ఆపలేదు. తనను నమ్ముకున్న వారికి అండగా ఉండాలనే నన్ను, షర్మిలను మీ ముం దుకు పంపించారు. మాటకు కట్టుబడే కుటుంబం మాది. ఫ్యాను గర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీని గెలిపించండి. మేనిఫెస్టోలో ప్రకటించివన్నీ నెరవేరుస్తాం’’ అని భరోసానిచ్చారు.