విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన కృష్ణా జిల్లాలోని గన్నవరం చేరుకుంటారు. అక్కడ మూడు బొమ్మల సెంటర్లో రోడ్‌షో నిర్వహించి ప్రసంగించనున్నారు. తర్వాత అక్కడి నుంచి గుంటూరు నగరానికి పయనమవుతారు. గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించి పలుచోట్ల ప్రసంగిస్తారు.
రాత్రి గుంటూరులోనే బస చేసి బుధవారం ఉదయం నేరుగా కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి చేరుకుంటారు. అక్కడ పామర్రు మీదుగా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు వరకు రోడ్‌షో నిర్వహిస్తారని పార్టీ ప్రోగామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం ‘సాక్షి’కి తెలిపారు.
నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగన్ పర్యటన
Published Tue, Apr 29 2014 1:35 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement