సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. జగన్ పర్యటన వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకటరావు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మంగళవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని తుని, విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తునిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 26వ తేదీ ఉదయం యలమంచిలిలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు తగరపువలసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం
పురపాలక ఎన్నికల్లో భాగంగా నర్సీపట్నం, యల మంచిలి మున్సిపాలిటీల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తలపడుతున్నారు. విజయమే లక్ష్యంగా ఇప్పటికే పార్టీ శ్రేణులు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నగా రా మోగాక ఇతర పార్టీ అగ్రనాయకుల కంటే ముందుగా వై.ఎస్.జగన్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి రానుండడం పార్టీ అభ్యర్థుల్లో అప్పుడే విజ యానందం వెల్లివిరుస్తోంది.
మున్సిపోల్స్‌లో సాధించే విజయాల స్ఫూర్తితో ఆ వెంటనే జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ విజ యభే రి మోగిస్తుందన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నాలుగున్నరేళ్లుగా జగన్‌కు సర్వత్రా అండగా నిలిచిన జిల్లావాసులు ఈ కీలక సమయంలోనూ ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఆయన వెన్నంటే ఉంటారని, ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పార్టీ నాయకులు చె ప్తున్నారు. జగన్ ఎప్పుడు వచ్చినా ప్రజలు బ్రహ్మరథం పట్టడమే ఇందుకు తార్కాణ మంటున్నారు.