టీడీపీని చూస్తే జాలేస్తోంది | chandrababu naidu holding legs of pawan kalyan, says ys sharmila | Sakshi
Sakshi News home page

టీడీపీని చూస్తే జాలేస్తోంది

Published Sat, May 3 2014 1:50 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

టీడీపీని చూస్తే జాలేస్తోంది - Sakshi

టీడీపీని చూస్తే జాలేస్తోంది

అధికారం కోసం పవన్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు: షర్మిల ధ్వజం    
 
 ఏలూరు: ‘‘ఆ రోజుల్లో రాజశేఖరరెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు అన్ని పక్షాలను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా గెలవలేకపోయాడు. ఇప్పుడు రాజశేఖరుని కొడుకుని కూడా ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేకుండా పోయింది. అందుకే ఎక్కడి నుంచో మోడీని, ఇక్కడ నుంచి సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్‌ని తెచ్చుకున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు మోడీ కాళ్లు పట్టుకున్నారంటే అర్థం ఉంది. కానీ చివరికి పవన్ కల్యాణ్ కాళ్లు కూడా పట్టుకున్నారు. తెలుగుదేశం నాయకులను చూస్తే పాపం అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చూస్తే జాలేస్తోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చంద్రబాబును విమర్శించారు.

బోడీ మోడీ, పవన్ లేకుంటే చంద్రబాబు బయటకే రారన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కొవ్వూరులో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ఆమె మాట్లాడారు. ‘‘పీఆర్పీ పెట్టిన చిరంజీవి రూ.70 కోట్లకు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయాడు. ఆయన తమ్ముడు పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఎంతకు అమ్ముడుపోయాడో తెలియాల్సి ఉంది. ఒక్క మంత్రి పదవి కోసం ఆయన అన్నగారు పార్టీని మూసేశారు. ఈయన ఏ మంత్రి పదవి వస్తుందని బీజేపీ, టీడీపీ పక్కన చేరారో తేలాల్సి ఉంది.

సీమాంధ్రకు అన్యాయం జరిగితే ఊరుకోనని చిందులు తొక్కుతున్న పవన్ కల్యాణ్.. 2009లో పీఆర్పీ మేనిఫెస్టో లో తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు ఎందుకు ప్రకటించారు? ఇక్కడి ప్రజల గొంతు కోసిన బీజేపీ, టీడీపీ నేతలనే ఈయన కౌగిలించుకుని నీతులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ చెప్పేదంతా సొల్లే. చంద్రబాబుకు ఓటేయవద్దని గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చెప్పలేదా? ఇప్పుడు ఆయనకు ఓటేయాలని ఎలా చెబుతున్నాడు?’’ అని షర్మిల దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement