
వీర్నమల సభలో ప్రసంగిస్తున్న కె.చంద్రమౌళి
రామకుప్పం : ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైఎస్సార్ సీపీలో చేరవచ్చునని ఆ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన సభలో ఆయన ఈమేరకు ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం వీర్నమల పంచాయతీ వేమనపల్లెకి చెందిన దాదాపు 100 మంది యువకులు తెలుగుదేశం నుంచి చంద్రమౌళి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వీర్నమల గ్రామంలో పార్టీ జెండాను చంద్రమౌళి ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వీర్నమల పంచాయతీని 4 చిన్న పంచాయతీలు గా విభజించి అభివృద్ధి జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేయాలి
సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంను వదిలి తన స్వంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి పోటీ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవీ డిమాండ్ చేశారు. ఆదివారం వీర్నమలలో జరిగిన సభకు మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి జీవితం అబద్ధాల పుట్టని విమర్శించారు. స్వంత నియోజక వర్గంలో గెలవలేకనే కుప్పం ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, బాబురెడ్డి, రవి నాయక్, చిన్నరాజు నాయక్, మోహన్ నాయక్, భాస్కర్ నాయక్, కుమార్, గోవిందప్ప, నారాయణస్వామి, బరకత్, రామేగౌడు, మునెమ్మ, ఇంద్రప్ప, మునెప్ప, గంగయ్య, సిద్ధప్ప, మురళి, అప్పి తదితరులు పాల్గొన్నారు.