jion in YSRCP
-
అనంతపురంలో టీడీపీకి మరో షాక్
మడకశిర: మడకశిర నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్ తగిలింది.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతుండడంతో కేడర్ పూర్తిగా డీలా పడిపోయింది.ఏం చేయాలో తెలియక టీడీపీ ప్రముఖులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ముఖ్యంగా మడకశిర టీడీపీ జడ్పీటీసీ, ప్రముఖ టీడీపీనేత కరణాకర్‌రెడ్డి సతీమణి సులోచనమ్మ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయంలోని అధికారులకు అందించారు.వెంటనే తాను జడ్పీటీసీ పదవికి ఇచ్చిన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఒకప్పుడు మడకశిర నియోజకవర్గ రాజకీయాలను శాసించిన మాజీ ఎమ్మెల్యేలు వైసీతిమ్మారెడ్డి, వైవీ తిమ్మారెడ్డి కుటుంబానికి చెందిన సులోచనమ్మ టీడీపీ జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మడకశిర మండలంలో సులోచనమ్మ భర్త కరుణాకర్‌రెడ్డి టీడీపీలో ముఖ్య నాయకుడు.ఆయనకు ప్రస్తుత టీడీపీ అభ్యర్థి ఈరన్నతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఆయనను ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి,టీడీపీ అభ్యర్థి ఈరన్న బుజ్జగించినా ఫలితం లేదు. ఎట్టి పరిస్థితిలో టీడీపీలో ఉండమని ఆయన వారికి తేల్చి చెప్పారు. నేడు వైఎస్సార్సీపీలో చేరిక మడకశిరకు శనివారం వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి రానున్నారు.ఈనేపథ్యంలో టీడీపీకి,తన పదవికి రాజీనామా చేసిన మడకశిర జడ్పీటీసీ సులోచనమ్మ, భర్త కరుణాకర్‌రెడ్డి తదితరులు వందలాదిమంది వైఎస్జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. అంతే కాకుండా వీరితో పాటు ఇటీవలనే టీడీపీకి రాజీనామా చేసిన ప్రముఖులు హల్కూరు కాంతరాజు,అగళి వెంకటస్వామి,వారి అనుచరులు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరనున్నారు. -
ప్రజలను నమ్మించి మోసం చేసిన బాబు
ఆదోని టౌన్: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట..రోజుకో అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సమక్షంలో 23, 24వ వార్డుల పరిధిలోని కౌడల్‌పేట, కార్వన్‌పేటకు చెందిన వందమంది టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యూత్ నాయకుడు కోదండ, సురేష్, తాయన్న, నర్సింహులు, చరణ్, వలి, రాజు, ప్రసాద్, చైతన్య, ఉసేనప్ప, శ్రీనివాస్, రఘు, నర్సప్ప, వీరేష్, తుకారామ్, మల్లికార్జున, కృష్ణతో పాటు 83 మంది కార్వన్‌పేట నుంచి ఊరేగింపుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కండువాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోదండ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న తమకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు తమ వార్డు అభివృద్ధికి కూడా కృషి చేయలేదన్నారు. అందుకే తామంతా ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంట నడవాలని నిర్ణయించుకున్నామన్నారు. అన్న క్యాంటీన్లలో కమీషన్లకు కక్కుర్తి– ఎమ్మెల్యే పేదలకు సబ్సిడీతో భోజనం, టిఫిన్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలోనూ కమీషన్ల కోసం తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు పాకులాడుతున్నారని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఒక్కో సెంటర్‌కు రూ.36 లక్షల ప్రజా ధనాన్ని ఖర్చుచేశారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తారన్నారు. కార్యక్రమంలో పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, అధ్యక్షుడు దేవా, పారిశ్రామిక వేత్త రవిరెడ్డి, ఎమ్మెల్యే తనయుడు మనోజ్‌కుమార్‌రెడ్డి, సాయిరామ్, కిట్టు, తాయన్న, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో పలువురు చేరిక
పెద్దముడియం: మండలంలోని నాగరాజుపల్లెకు చెందిన పలువురు నాయకులు కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇంటింటికి వైఎస్సార్సీపీ కార్యక్రమంలోభాగంగా బుధవారం అవినాష్‌రెడ్డి, పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం సుధీర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరి జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించారు. కొందరు స్థానికులు మాట్లాడుతూ ఇళ్లు లేవని, రోడ్లు లేవని, రేషన్ కోసం మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని నాయకుల దృష్టికి తెచ్చారు. దీనికి నేతలు స్పందిస్తూ జగన్ ప్రభుత్వం రాగానే ప్రజా సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తామే దగ్గరుండి చూసుకుంటామన్నారు. ప్రతి ఇంటి వద్దకు అవినాష్‌రెడ్డి వెళ్లడంతో గ్రామంలోని ప్రజలు పార్టీ గెలుపు కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన రాచమల్లు చిన్నపురెడ్డి, యాసాగారి నారాయణరెడ్డి, ఉమ్మడి చిన్నపురెడ్డి, ఉమ్మడి నారాయణరెడ్డి, జయరామిరెడ్డి తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ హనుమంతురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, పట్టణ నాయకుడు పొరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, మండల నాయకులు నరసింహులు, చవ్వా శివకృష్ణారెడ్డి, పెద్దారెడ్డి, వెంటకశివారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ శివ దస్తగిరిరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి 100 మంది టీడీపీ నాయకులు
రామకుప్పం : ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైఎస్సార్ సీపీలో చేరవచ్చునని ఆ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన సభలో ఆయన ఈమేరకు ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం వీర్నమల పంచాయతీ వేమనపల్లెకి చెందిన దాదాపు 100 మంది యువకులు తెలుగుదేశం నుంచి చంద్రమౌళి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వీర్నమల గ్రామంలో పార్టీ జెండాను చంద్రమౌళి ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వీర్నమల పంచాయతీని 4 చిన్న పంచాయతీలు గా విభజించి అభివృద్ధి జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేయాలి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంను వదిలి తన స్వంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి పోటీ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవీ డిమాండ్ చేశారు. ఆదివారం వీర్నమలలో జరిగిన సభకు మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి జీవితం అబద్ధాల పుట్టని విమర్శించారు. స్వంత నియోజక వర్గంలో గెలవలేకనే కుప్పం ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, బాబురెడ్డి, రవి నాయక్, చిన్నరాజు నాయక్, మోహన్ నాయక్, భాస్కర్ నాయక్, కుమార్, గోవిందప్ప, నారాయణస్వామి, బరకత్, రామేగౌడు, మునెమ్మ, ఇంద్రప్ప, మునెప్ప, గంగయ్య, సిద్ధప్ప, మురళి, అప్పి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీకి ప్రజాదరణ
దత్తిరాజేరు,న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివ రాజు అన్నారు. దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం సర్పంచ్‌తో పాటు 300 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. పెనుమత్స సాంబశివరాజు, పార్టీ అరుకు పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకుడు బేబీనాయన, పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు అధ్వర్యంలో వారంతా పార్టీలో చేరారు.పెదమానాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి పార్టీ సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్ చుక్క సన్యాశినాయుడుతో పాటు ఉప సర్పంచ్ కిలుగు కనకరాజు వార్డు మెంబర్లు రౌతు దుర్గారావు, గొటివాడ ప్రసాద్,మానాపురం రాజ్యలక్ష్మి,బోర బంగారమ్మ, తుపాకుల లక్ష్మి,పెంకి రంగమ్మ, కనిమెరక తిరుపతి,రౌతు రాము,గంటా తులసీనాయుడు,రిటైర్డు ఉపాధ్యాయడు మానాపురం వాసదేవరావు, ఎంపీటీసీ మాజీ సభ్యు డు కిల్లాడ జయరాజ్ తదితర 300 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన రాష్ట్రంలో రావాలంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిం చాలన్నారు. కడుబండి శ్రీనివాసరావును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.బేబీనాయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు అకాంక్ష జగన్మో హన్‌రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కడుబండి మాట్లాడుతూ కాంగ్రెస్,టీడీపీ నాయకుల వల్లే రాష్ట్రం ముక్కలవుతోందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ ఒక్కటే పోరాడు తోం దన్నారు. తరువాత చీపురుపల్లి సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు, ప్రచార కార్యదర్శి గొర్లె వెంకటరమణ, ఆదాడ మోహనరావులు ప్రసంగిం చారు. కార్యక్రమంలో బోడసింగు సత్యంనాయుడు,కోడి బాబూజీ,మడక తిరుపతి,గెద్ద రమేష్‌నాయుడు,డోకల అప్పలనాయుడు,పెద్దింటి మోహనరావు, ఈదుబిల్లి కృష్ణ,ఈశ్వరరావు,అమరా సర్వాదేముడు,పప్పల సింహాచలం,వి సత్యనారాయణ పాల్గొన్నారు.