దత్తిరాజేరు,న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివ రాజు అన్నారు. దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం సర్పంచ్‌తో పాటు 300 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరాయి. పెనుమత్స సాంబశివరాజు, పార్టీ అరుకు పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకుడు బేబీనాయన, పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు అధ్వర్యంలో వారంతా పార్టీలో చేరారు.పెదమానాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి పార్టీ సమావేశం నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్ చుక్క సన్యాశినాయుడుతో పాటు ఉప సర్పంచ్ కిలుగు కనకరాజు వార్డు మెంబర్లు రౌతు దుర్గారావు, గొటివాడ ప్రసాద్,మానాపురం రాజ్యలక్ష్మి,బోర బంగారమ్మ, తుపాకుల లక్ష్మి,పెంకి రంగమ్మ, కనిమెరక తిరుపతి,రౌతు రాము,గంటా తులసీనాయుడు,రిటైర్డు ఉపాధ్యాయడు మానాపురం వాసదేవరావు, ఎంపీటీసీ మాజీ సభ్యు డు కిల్లాడ జయరాజ్ తదితర 300 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.
ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన రాష్ట్రంలో రావాలంటే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిం చాలన్నారు. కడుబండి శ్రీనివాసరావును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.బేబీనాయన మాట్లాడుతూ తెలుగు ప్రజలు అకాంక్ష జగన్‌మో హన్‌రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు.
కడుబండి మాట్లాడుతూ కాంగ్రెస్,టీడీపీ నాయకుల వల్లే రాష్ట్రం ముక్కలవుతోందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ ఒక్కటే పోరాడు తోం దన్నారు. తరువాత చీపురుపల్లి సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు, ప్రచార కార్యదర్శి గొర్లె వెంకటరమణ, ఆదాడ మోహనరావులు ప్రసంగిం చారు. కార్యక్రమంలో బోడసింగు సత్యంనాయుడు,కోడి బాబూజీ,మడక తిరుపతి,గెద్ద రమేష్‌నాయుడు,డోకల అప్పలనాయుడు,పెద్దింటి మోహనరావు, ఈదుబిల్లి కృష్ణ,ఈశ్వరరావు,అమరా సర్వాదేముడు,పప్పల సింహాచలం,వి సత్యనారాయణ పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ సీపీకి ప్రజాదరణ
Published Sat, Dec 14 2013 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement