పార్టీలో చేరినవారితో అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు, సుధీర్‌రెడ్డి తదితరులు
పెద్దముడియం: మండలంలోని నాగరాజుపల్లెకు చెందిన పలువురు నాయకులు కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇంటింటికి వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలోభాగంగా బుధవారం అవినాష్‌రెడ్డి, పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం సుధీర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరి జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికెళ్లి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించారు. కొందరు స్థానికులు మాట్లాడుతూ ఇళ్లు లేవని, రోడ్లు లేవని, రేషన్ కోసం మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని నాయకుల దృష్టికి తెచ్చారు.
దీనికి నేతలు స్పందిస్తూ జగన్ ప్రభుత్వం రాగానే ప్రజా సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తామే దగ్గరుండి చూసుకుంటామన్నారు. ప్రతి ఇంటి వద్దకు అవినాష్‌రెడ్డి వెళ్లడంతో గ్రామంలోని ప్రజలు పార్టీ గెలుపు కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన రాచమల్లు చిన్నపురెడ్డి, యాసాగారి నారాయణరెడ్డి, ఉమ్మడి చిన్నపురెడ్డి, ఉమ్మడి నారాయణరెడ్డి, జయరామిరెడ్డి తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.
కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ హనుమంతురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, పట్టణ నాయకుడు పొరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, మండల నాయకులు నరసింహులు, చవ్వా శివకృష్ణారెడ్డి, పెద్దారెడ్డి, వెంటకశివారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ శివ దస్తగిరిరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment