ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులు
ఆదోని టౌన్: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట..రోజుకో అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సమక్షంలో 23, 24వ వార్డుల పరిధిలోని కౌడల్‌పేట, కార్వన్‌పేటకు చెందిన వందమంది టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యూత్ నాయకుడు కోదండ, సురేష్, తాయన్న, నర్సింహులు, చరణ్, వలి, రాజు, ప్రసాద్, చైతన్య, ఉసేనప్ప, శ్రీనివాస్, రఘు, నర్సప్ప, వీరేష్, తుకారామ్, మల్లికార్జున, కృష్ణతో పాటు 83 మంది కార్వన్‌పేట నుంచి ఊరేగింపుగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి ఎమ్మెల్యే వైఎస్‌ఆర్‌సీపీ కండువాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోదండ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న తమకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు తమ వార్డు అభివృద్ధికి కూడా కృషి చేయలేదన్నారు. అందుకే తామంతా ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంట నడవాలని నిర్ణయించుకున్నామన్నారు.
అన్న క్యాంటీన్లలో కమీషన్లకు కక్కుర్తి– ఎమ్మెల్యే
పేదలకు సబ్సిడీతో భోజనం, టిఫిన్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలోనూ కమీషన్ల కోసం తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు పాకులాడుతున్నారని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఒక్కో సెంటర్‌కు రూ.36 లక్షల ప్రజా ధనాన్ని ఖర్చుచేశారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తారన్నారు. కార్యక్రమంలో పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, అధ్యక్షుడు దేవా, పారిశ్రామిక వేత్త రవిరెడ్డి, ఎమ్మెల్యే తనయుడు మనోజ్‌కుమార్‌రెడ్డి, సాయిరామ్, కిట్టు, తాయన్న, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment