సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రధాన కార్యాలయంపై ఇటీవల దాడి ఎందుకు జరిగిందో ఆ పార్టీ నేతలు దాచి పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమైన చంద్రబాబు బృందం ఈ విషయాన్ని చెప్పాల్సిందని పేర్కొన్నారు. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కారణంగా సానుభూతి కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు యత్నిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద కుట్రలో భాగంగానే టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని దూషించడానికి పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని, ఇందుకు చంద్రబాబు పార్టీ నేతల్ని ప్రేరేపిస్తున్నారని విజయసాయిరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలో భాగంగా సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈనెల 19న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ‘తాడేపల్లి ప్యాలెస్ (ముఖ్యమంత్రి అధికారిక నివాసం)లో కూర్చొన్న దద్దమ్మకు నేను చెబుతున్నా. నీకు దమ్ముంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల పోలీసులకు నోటీసులు ఇవ్వు బోసిడీకే. నీకు దమ్ముంటే గుంటూరు ఎస్పీకి నోటీసు ఇవ్వండి. పబ్‌జీ దొరా.. వేరే ఎవరికైనా నోటీసులు ఇవ్వు.. మాకు కాదు. బోసిడీకే మాపై కాదు.. స్మగ్లర్లపై చర్యలు తీసు కోవడానికి యత్నించు..’ అన్నారని వివరించారు.
టీడీపీ డర్టీ పాలిటిక్స్‌తో ప్రజల ఆగ్రహమే టీడీపీ కార్యాలయంపై దాడికి కారణమని తెలిపారు. దాడి కి సంబంధించిన ఛాయాచిత్రాలు చూపించి సాను భూతి పొందడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ అధ్య క్షుడు చంద్రబాబు.. ప్రజలు ఎందుకు దాడిచేశారనే విషయంపై మౌనం వహిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను చంద్రబాబు ఖం డించలేదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న సీఎం, ఇతరులపై నీఛమైన వ్యాఖ్యలు చేయమని చంద్రబాబు పార్టీ నేతల్ని ప్రోత్సహిస్తు న్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతితో సమావేశ మైనప్పుడు టీడీపీ కార్యాలయంపై ప్రజలు ఎందు కు దాడిచేశారో కూడా ప్రస్తావిస్తే బాగుండేదని తెలిపారు.
టీడీపీ అధికార ప్రతినిధి ప్రకటనల వీడియోలు చూస్తే పెద్ద కుట్రలో భాగంగానే తప్పు డు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్ప ష్టంగా రుజువవుతోందని తెలిపారు. అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. టీడీపీ నేతల ప్రకటనలు రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ, మునిసిపాలిటీ, పంచాయతీ, స్థానిక సంస్థలకు సంబంధించి 2019 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా అధికారం పొందలేకపోయిందని గుర్తుచేశారు. అందుకే ఆర్టికల్ 356 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవస్థను అణగదొక్కాలని కోరుకుంటోందని తెలిపారు.
ఎందుకు దాడిచేశారో చెప్పాల్సింది
Published Tue, Oct 26 2021 4:57 AM | Last Updated on Tue, Oct 26 2021 8:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment