
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder)అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి’అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు!’అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ. 2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారని, అదే బాబు అధికారంలో ఉంటే 15 శాతం ఎక్సెస్‌లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ. 15 వేల కోట్లు దోచుకునేవాడని విజయసాయిరెడ్డి బుధవారం ట్విటర్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder)అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 27, 2020
చదవండి:
‘పెప్పర్ గ్యాంగ్‌ను వీధుల్లోకి వదిలారు’
'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?'
Comments
Please login to add a commentAdd a comment