
సాక్షి, కుప్పం: జనసేన కుప్పం ఇన్‌చార్జి మద్దిరాల వెంకటరమణ తన పదవికి, పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేసి ఓటమి చెందారు.
అప్పటి నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను కుప్పం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చూస్తుంటే పీఏసీ కమిటీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.