Actor Vishal Gave Clarity About His Political Entry Rumors - Sakshi
Sakshi News home page

Vishal: పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన నటుడు విశాల్‌

Jul 1 2022 8:14 PM | Updated on Jul 1 2022 8:42 PM

Actor Vishal Gives Clarity on his Political Entry - Sakshi

చెన్నై: 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా సినీ నటుడు విశాల్‌ అంటూ గత కొద్ది రోజులుగా ఎల్లో మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లపై విశాల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఆ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను.

రాజకీయ ప్రవేశంపై నన్ను ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదు. అసలు ఈ వార్త  ఎక్కడ నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యం కానీ, కుప్పం నుంచి పోటీ చేసే ఆలోచన కానీ తనకు లేదని' సినీ నటుడు విశాల్‌ తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే, నటుడు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లాఠీ. నటి సునయ ననాయికగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాన్ని రాణా ప్రొడక్షన్స్‌ పతాకంపై విశాల్‌ మిత్రులు, నటులు, రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement