కుప్పం నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక రూపొందించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ నారాయణగుప్ప తహశీల్దార్లను ఆదేశించారు.
10లోపు నివేదిక ఇవ్వాలని సబ్‌కలెక్టర్ ఆదేశం
కుప్పం, న్యూస్‌లైన్: కుప్పం నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక రూపొందించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ నారాయణగుప్ప తహశీల్దార్లను ఆదేశించారు. 10వ తేదీ లోపు బోగస్, దొంగ ఓట్లపై పూర్తిస్థారుులో సవుగ్ర నివేదికను అందించాలన్నారు. కుప్పంలో 43వేల బోగస్ ఓట్లు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సబ్ కలెక్టర్ నారాయణగుప్ప ఆదివారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహశీల్దార్లతో సమావేశమయ్యారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారికి కుప్పంలో అధికంగా ఓట్లు ఉన్నాయుని వస్తున్న ఫిర్యాదులపై పూర్తిస్థారుులో విచారణ జరపాలని సూచించారు.