సాక్షి, చిత్తూరు: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సింహంలా సింగిల్‌గా వస్తుంటే.. చంద్రబాబు మాత్రం అన్ని పార్టీలతో కలిసి కూటమిగా బయలుదేరారు. మరోవైపు.. చంద్రబాబు తనకు కంచుకోట అని చెప్పుకునే కుప్పంపైనే ఓటమి భయం వెడుతోంది. వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో కుప్పంపై చంద్రబాబు దృష్టిసారించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కుప్పం ఓటర్లను ఆకర్షించేందుకు వరాలను ప్రకటించబోతున్నారు. ఇక, గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అసలు కుప్పాన్ని పట్టించుకునేవారు. కానీ, ఈసారి మాత్రం ఎన్నికల హాడావుడి మొదలవగానే మొదటగా కుప్పంపైనే ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో తాను ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు కుప్పం దారి పట్టారు.
ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల నుంచే కుప్పం నియోజకవర్గం ఓటర్లలో మార్పు కనిపించింది. గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు మోజార్టీ భారీగా తగ్గింది. దీంతో బాబు సైతం షాకయ్యాడు. ఇక, తాజాగా కుప్పం నియోజకవర్గ పరిధిలో భారీగా దొంగ ఓట్లను తొలగించడంతో అటు చంద్రబాబు, ఇటు టీడీపీలో వణుకు మొదలైంది.
మరోవైపు.. ఇటీవలి కాలంలో కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఎలాంటిదైనా వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలుస్తోంది. కుప్పం మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కుప్పం ప్రజలకు దండిగా చేరుతుండటంతో ఓటర్లు సైతం మార్పును కోరుకుంటున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, చంద్రబాబుతో భయం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment